|
To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
29 April 2017
Hyderaad
అమెరికాలో పర్యటిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు భారీ ఫ్లెక్సీలతో స్వాగతం పలుకుతూ తమ ప్రత్యేకతను చాటుకుంటోంది సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం. తాము ఏ కార్యక్రమం చేపట్టినా విలక్షణం గాను అత్యంత భారీగాను చేస్తుండడం సిలికానాంధ్ర ప్రత్యేకత. లక్షమందితో అన్నమయ్య పాటలు పాడించినా, 6 వేలమంది తో కూచిపూడి మహాబృంద నాట్యం చేయించినా, అమెరికాలో 27 వేలమందికి తెలుగు భాష నేర్పిస్తున్నా...ఇలా ఏది చేసినా అది ఒక ప్రభంజనమే.. ఇప్పుడు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా రోజుకు లక్షకు పైగా వాహనాలు తిరిగే అతి పెద్ద జాతీయ రహదారిపై ఉన్న సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ, డా. హనిమిరెడ్డి లకిరెడ్డి భవనం పై నుండి 500 చదరపు అడుగుల ఫ్లెక్సీ ఏర్పాటు చేసి... యావత్ బే ఏరియా దృష్టి అటువైపు మరల్చింది సిలికానాంధ్ర.
కూచిపూడి నాట్యారామం అద్యక్షులు ఆనంద్ కూచిభొట్ల సారధ్యంలో సిలికానాంధ్ర సభ్యులు దిలీప్ కొండిపర్తి, రాజు చమర్తి, దీనబాబు కొండుభట్ల, సాయి కందుల, వంసీ నాదెళ్ళ, సిద్దార్ధ్ నూకల, రవి చివుకుల, కిషోర్ గంధం, యష్వంత్, దిలీప్ సన్రాజు, సిలికానాంధ్ర ఆడపడుచులు ప్రభ మాలెంపాటి, స్నేహ వేదుల, నిరుపమ, శ్రీవల్లి, శిరీష,జయంతి కోట్ని తదితరులు యూనివర్సిటీ ప్రాంగణాన్ని అందంగా ముస్తాబు చేస్తున్నారు. ఇప్పటికే తాము దత్తత తీసుకున్న కూచిపూడి గ్రామం ఆదర్శగ్రామంగా తీర్చిదిద్ది ముఖ్యమంత్రి ప్రశంశలందుకున్న సిలికానాంధ్ర, భారతీయ కళలను అందించే విశ్వవిద్యాలయం నెలకొల్పిన తొలి తెలుగు సంస్థగా అందరి దృష్టీ ఆకర్షిస్తోంది సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం....
|
|
|
|
|
|