
To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
31 March 2014
Hyderabad
సిలికానాంధ్ర మనబడి ద్వితీయ సాంస్కృతికోత్సవం Falls Church High School , Viriginia లో ఘనంగా జరిగింది . ఈ కార్యక్రమం లో మేరీల్యాండ్ , వర్జీనియా రాష్ట్రాల నుంచి వచ్చిన 250 మనబడి విద్యార్థుల ప్రదర్సనలు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. రోజంతా వర్షం పడుతూనే ఉన్న మనబడి కార్యక్రమాల మీద ఉన్న ఆసక్తి తో దాదాపు 900 మంది విచ్చేసి ఈ సాంస్కృతికోత్సవ కార్యక్రమాన్నిఎంతో విజయవంతం చేశారు . మనబడి విద్యార్థుల తెలుగు ప్రతిభ పాటవాలు చూసి చాలామంది మేము కూడా మా పిల్లలని వచ్చే విద్యా సంవత్సరం మనబడి లో చేర్పిస్తాము అని చెప్పారు . చాలామంది వారికి దగ్గరలో మరిన్ని మనబడి సెంటర్స్ ని ప్రారంభిన్చావలసినది గా అభ్యర్థించారు .
సిలికానాంధ్ర మనబడి సాంస్కృతికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ga కాలిఫోర్నియా నుంచి మనబడి అధ్యక్షులు శ్రీ . రాజు చామర్తి గారు , సిలికానాంధ్ర ఉపాధ్యక్షులు శ్రీ .దీనబాబు కొండుభట్ల గారు ,స్నేహ వేదుల గారు , న్యూ జెర్సీ నుంచి శ్రీ శరత్ వేట గారు , V.P Global development,
విచ్చేసి విద్యార్థులకు ప్రశంస పత్రాలు , ఉపాధ్యాయులకు జ్ఞాపికలు అందచేసారు.
.ఈ కార్యక్రమాన్ని విజయవంతయం చేయడానికి కృషి చేసిన విద్యార్థులకు , విద్యార్థులు తల్లిదండ్రులకు ,స్వచ్చందంగా పనిచేసిన వారందరికి పేరు పేరున ధన్యవాదములు తెలిచేసారు . ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన క్యాట్స్అధ్యక్షులు శ్రీ . మధు కోలా గారికి ధన్యవాదములు తెలిపారు .
సిలికానాంధ్ర మనబడి సాంస్కృతికోత్సవం విజయవంతం కావడానికి విశేషంగా కృషి చేసిన సాంస్కృతిక కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ చివలురి గారు , అనిత కారంచేడు గారు , చిత్ర గుండ్లపల్లి గారు , నీరజ గుమ్మ గారు, గీత జొన్నలగడ్డ గారు , నరేష్ గోగినేని గారు , జానా గారు, జనార్ధన్ గారికి, సమన్వయ కర్తలకు ,ఉపాధ్యాయులకు ఇతర వాలంటీర్స్ అందరికి సిలికానాంధ్ర మనబడి వర్జీనియా , మేరీల్యాండ్ , వాషింగ్టన్ D.C ఏరియా రీజినల్ కోఆర్డినేటర్ గౌడ్ రాంపురం గారు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు .





