|

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
29 July 2015
Hyderabad
ఘనంగా ముగిసిన సిలికానాంధ్ర మనబడి తూర్పు ప్రాంత ఉపాధ్యాయుల మరియు సమన్వయ కర్తల సదస్సు
ప్రిన్స్ టన్, న్యూజెర్సీ జులై 24-26: సిలికానాంధ్ర మనబడి
అమెరికాలో సిలికానాంధ్ర మనబడి ప్రతి యేటా ఉపాధ్యాయుల, సమన్వయకర్తల ప్రశిక్షణ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ ఏడాది ఈ సదస్సులు మూడు ప్రాంతాలలో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రెండవ సదస్సు ఈ వారాంతం న్యూజెర్సీ రాష్ట్రం లోని ప్రిన్స్ టన్ నగరం లో జరిగింది. మనబడి విస్తరణ విభాగ ఉపాధ్యక్షులు శరత్ వేట నేతృత్వంలో, ప్రశాంతి & మహేష్ మారం రెడ్డి, రత్న వేట, శ్రీధర్ & మాధురి కొండగుంట, రాజేశ్వరి రామానంద్, కిరణ్ దుద్దాగి, సునీల్ వేమురెడ్డి, శ్రీనివాస్ కొరిటాల, సోమేష్ వీరమనేని, ప్రసాద్ మానికొండ, ప్రత్యూష వెంపరాల చక్కటి ఏర్పాట్లతో ఈ కార్యక్రమాన్ని అత్యంత సమర్ధవంతంగా నిర్వహించారు. కనెక్టికట్, ఫ్లోరిడా, జార్జియా,ఇండియానా, మేన్, మేరీల్యాండ్, మాసాచుసెట్స్, మిషిగన్, న్యూ జెర్సీ, న్యూయార్క్, నార్త్ కెరొలినా, ఒహాయో, పెన్సిల్వేనియ, టెన్నెస్సీ, వర్జీనియా తదితర రాష్ట్రాల నుండి; సౌత్ ఆఫ్రికా, స్కాట్లండ్, కెనడా వంటి ఇతర దేశాల నుండి కూడా మనబడి ఉపాధ్యాయులు, సమన్వయకర్తలూ మరియు కీలక బృందంలోని సభ్యులు, దాదాపు నూట ముప్పైమంది కి పైగా ఈ సదస్సులో పాల్గొన్నారు.
ఈ సదస్సులలో ముఖ్యభాగంగా పాఠ్యప్రణాళిక బృందం సభ్యులు కూచిభొట్ల శాంతి, రాయవరం విజయ భాస్కర్, ఓరుగంటి వేణుగోపాల కృష్ణలు శిక్షణా కార్య క్రమాన్ని నిర్వహించి భారత దేశం వెలుపల పుట్టి పెరిగే పిల్లలకు తెలుగును బోధించే విధానం లోని మెళుకువలను మనబడి ఉపాధ్యాయులకు వివరించారు .అలాగే గత విద్యాసంవత్సరం చివరిలో నిర్వహించిన అభిప్రాయసేకరణలో తల్లి తండ్రుల దగ్గర నుంచి వచ్చిన స్పందనని విశ్లేషించి, వాటిలో అత్యంత విలువైన స్పందనలను వెంటనే అమలు పరచటానికి కావాల్సిన ప్రణాళిక లను సిద్ధం చేశారు .
మనబడి లో పిల్లలకోసం ప్రతి ఏటా నిర్వహించే సాంస్కృతికోత్సవాలు ,తెలుగు మాట్లాట పోటీలు ,బాలానందం వంటి రేడియో కార్యక్రమాలను నిర్వహిస్తున్న తీరు తెన్నులు ,పిల్లల మీద వాటి ప్రభావం గురుంచి ఆరోగ్యకరమైన వాతావరణం లో చర్చించారు.
ఈ సందర్భంగా మనబడి డీన్ రాజు చమర్తి మాట్లాడుతూ ,ఇలాంటి సదస్సులు ద్వారా నిర్వహించే శిక్షణ తరగతుల ద్వారా ఉత్తమ ఉపాధ్యాయులు తయారవుతారని , అలాంటి శిక్షణ పొందిన మనబడి ఉపాధ్యాయుల దగ్గర తెలుగు నేర్చుకొనే విద్యార్ధులు మరింత నాణ్యమైన విద్యను పొందగలుగుతారని చెప్పారు. మనబడి 2015-16 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు జరుగుతున్నాయని ,ఈ అవకాశాన్ని భారత దేశం వెలుపల నివసిస్తున్న ప్రతి తెలుగు వారు ఉపయోగించుకొని వారి పిల్లలు మాతృభాష నేర్చుకొనే దిశగా ప్రోత్సాహింఛి తెలుగు ను ప్రాచీన భాష నుంచి ప్రపంచ భాషగా మార్చే ఈ మహాయజ్ఞం లో పాలు పంచు కోవాలని కోరారు .దీనబాబు కొండుభట్ల మాట్లాడుతూ అమెరికాలోని 35 రాష్ట్రాలతో పాటు సౌత్ ఆఫ్రికా,సింగపూర్,ఆస్ట్రేలియా వంటి 12 దేశాలలో కూడా మనబడి ద్వారా తెలుగు నేర్చుకునే 4000 పైగా విద్యార్ధులకు నాణ్యమైన విద్య ని అందించడానికి ఇలాంటి సదస్సులు,సిక్షణా కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని, శిక్షణా శిబిరం నిర్వాహకులను అభినందించారు.
ఈ కార్యక్రమం లో మనబడి కీలక బృందం సభ్యులు దీన బాబు కొండుభట్ల ,శ్రీదేవి గంటి,శ్రీ రాం కోట్ని,స్నేహ వేదుల మరియు అతిధులు శతావధాని నరాల రామరెడ్డి, పుట్టపర్తి నాగపద్మిని,జి. ఎల్. న్. మూర్తి తదితరులు పాల్గొన్నారు.



|
|
|
|
|
|