To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
21 June 2014
Hyderabad
జూన్ 14 సాయంత్రం ఆల్ఫరెట్ట ఇండిపెండెన్స్ హై స్కూల్ లో అంగరంగ వైభవంగా జరిగిన EIS -సిరివెన్నెల తో తామా సాహితీ సదస్సు అట్లాంటా తెలుగు భాషాభిమానులను అత్యంత పరిపూర్ణం గా అలరించింది.
శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో జరిగిన రెండున్నర గంటల కార్యక్రమం ఆయన కవితా గానంతో సాగింది.
కార్యక్రమం ముందుగా రత్న మంజూషా, శ్రీనివాస్ దుర్గం బృందం వారి సిరివెన్నెల పాటల తో మొదలైంది.
సాహిత్య కార్యదర్శి శ్యాం మల్లవరపు స్వాగతోపన్యాసం తో సిరివెన్నెలకి స్వాగతం పలికారు. సిరివెన్నెల తెలుగు వారికి గర్వ కారణం అని పలికారు.
ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన EIS కిరణ్ పాషం ని సిరివెన్నెల గారు సత్కరించారు. కిరణ్ పాషం మాట్లాడుతూ శ్రీ సిరివెన్నెల కార్యక్రమం స్పాన్సర్ చేయటం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు. తామా ప్రెసిడెంట్ సంధ్యా ఎల్లాప్రగడ మాట్లాడుతూ సిరివెన్నెలను అట్లాంటా తీసుకు రావాలన్న భాగీరధ ప్రయత్నం ఇన్ని రోజులకి ఫలించిందని , శ్రీ సిరివెన్నెల సినిమా సాహిత్య విలువలు పెంచారని, సాహిత్యంలో స్థానం కల్పించారని పేర్కొన్నారు.
చైర్మన్ సునీల్ సావిలి మాట్లాడుతూ ఈలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు తామా నిర్వహిస్తుందని పేర్కొన్నారు.
శ్రీ సిరివెన్నెల అట్లాంటా అమెరికా ప్రయాణ విశేషాలను చెబుతూ, తెలుగు బాష మీద NRI తెలుగు వారి ఆసక్తిని మెచ్చుకున్నారు. భారతీయతను, వసుధైక కుటుంబం గురించి, జీవనం లో వచ్చిన మార్పులు, భాషనూ ఎలా మార్చుకుంటూ, జీవనది లాంటి భాష యొక్క ప్రాముఖ్యత గురించి పేర్కొన్నారు. సభికులు రాసి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చి వారిని అలరించారు. అభిమానుల కోరిక మీద జగమంత కుటుంబం పాట పాడి వినిపించారు.
కార్యక్రమం చివర సంధ్యా ఎల్లాప్రగడ వ్రాసిన పుస్తకం "జ్ఞాపకాలలో" ఆవిష్కరించారు.
తామా కార్యవర్గం శ్రీ సీతారామ శాస్త్రి గారిని శాలువా, జ్ఞాపిక ఇంకా ప్రశంసా పత్రంతో సత్కరించారు.
పాటలు పాడిన బాలికలకి, తామా మెడల్స్, సర్టిఫికెట్స్ పంచారు.
తామా ఉపాధ్యక్షులు వినయ్ మద్దినేని వోట్ అఫ్ థాంక్స్ తో కార్యక్రమం ముగిసింది.
సౌండ్ మరియు లైట్ సహకారం శ్రీనివాస్ దుర్గం అందించారు.
ఫోటో వీడియో శ్రీధర్ వాకిటి, ప్రవీణ్ బొప్పన అందించారు.
స్నాక్ సువిధ వారు అందించారు.