To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
21 June 2014
Hyderabad
జూన్ 15th లాస్ ఏన్జేలీస్, కాలిఫోర్నియ: దక్షిణ కాలిఫోర్నియాలో తెలుగు మాట్లాట ప్రాధమిక పోటి June 14న & అంత్య పోటి June 15న నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో సాన్డియాగో, ఆరెంజ్ కౌంటీ, ట్రైవ్యాలీ ప్రాంతాలనుండి 90 మందికి పైచిలుకు పిల్లలు తెలుగు భాష పై వారి పట్టుని ప్రదర్శించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.
ఆరెంజ్ & శాండీయాగో ఉపవిభాగంలో బుడతల వయోతరగతిలో పదరంగం ఆటలో విజేతగా అనీష చిత్త, తదుపరి విజేతగా కౌశిక్ కస్తూరి, తిరకాటం ఆటలో విజేతగా అనీష కాట్రగడ్డ, తదుపరి విజేతలుగా అశోక్ గరికపాటి, శబ్దిక గుబ్బ నిలిచారు. అలాగే సిసింద్రీల వయోతరగతిలో పదరంగం విజేతగా శ్రీయాంష్ యార్లగడ్డ, తదుపరి విజేతగా సమీక్ష కోమటిరెడ్డి, తిరకాటం విజేతగా అమోఘ కోక, తదుపరి విజేతగా శ్రీజ రావిలిసేట్టి గెలిచారు. ముందురోజు జరిగిన ట్రైవ్యాలీ ఉపవిభాగంలో బుడతల వయోతరగతిలో రెండుఆటలలో కశ్యప్ కల్వకోట విజేతగా, తదుపరి విజేతలుగా గణేష్ కోక, నందిని కొత్తపల్లి నిలిచారు. ఈ గెలుపొందిన పిల్లలు సెప్టెంబర్ లో లేబర్ డే రోజు కాలిఫోర్నియాలో జాతీయస్థాయి పోటీలలో మిగతా ప్రాంతాలనుంచి గెలిచిన వారితో ఢీకొంటారు. జాతీయస్థాయి పోటీలలో గెలిచిన పిల్లలకి ఘనమైన బహుమతులు, ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో బాటూ, అన్ని ప్రచార మాధ్యమాల ద్వారా వాళ్ళ ప్రతిభ ప్రపంచం నలుమూలలా తెలిసేలా చెయ్యడం జరుగుతుంది.
కార్యక్రమ సమన్వయకర్త సురేష్ బాబు ఐనంపూడి మాట్లాడుతూ లాస్ ఏన్జేలీస్ లో ఈ కార్యక్రమ విజయం ముఖ్యంగా మోహన్ కాట్రగడ్డ, కిరణ్ సింహాద్రి, శ్రీనివాస్ యార్లగడ్డ, సుధా దావులురి, శ్రీధర్ బండ్లమూడి, జ్యోతి దైత, రాము రాచమల్ల, రఘు మద్దుల, శ్రీధర్ కోమటిరెడ్డి లాంటి స్వచ్చంద సేవకుల సంభావన అని పేర్కొన్నారు.
సిలికానాంధ్ర మనబడి తెలుగు మాట్లాట సంధాత డాంజి తోటపల్లి మాట్లాడుతూ ఇప్పటివరకు లాస్ ఏన్జేలీస్ తో పాటు న్యు జెర్సీ, టెక్సాస్, కాలిఫోర్నియలో బే ఏరియా, అట్లాంటా, నార్త్ కరోలినా, మిచిగన్, వర్జీనియా, న్యూ యార్క్, ఫిలడెల్ఫియా, చికాగో, సియాట్టేల్, సాన్ డియాగో ప్రాంతాలలో 800+ మంది పిల్లలు ఈ తెలుగు మాట్లాట ఆటల పోటీలలో పాల్గొన్నారని, తెలుగు మాట్లాట పోటీల నిర్వహణకు ప్రత్యేకంగా తయారుచేయబడిన మాయాదర్పణం సాఫ్ట్ వేర్ సరణి వల్ల ఆటలు శ్రీఘ్రంగా, స్థిరంగా, అడ్డంకులు లేకుండా కోనసాగడానికి సాధ్యమైయింది అని తెలియజేసారు.