To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
22 May 2013
Hyderabad
UK - Reading (రీడింగ్) నగరంలో అత్యంత వైభవంగా జరిగిన శ్రీ శ్రీనివాస కల్యాణ వేడుకలు!
GB-SRSB (గ్రేట్ బ్రిటన్ - శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావన్) మరియు TTD (తిరుమల తిరుపతి దేవస్థానం) వారి సంయుక్త ఆధ్వర్యంలో మే 12న శ్రీ శ్రీనివాసుడి కల్యాణం కనుల పండుగగా జరిగింది. 2500కి పైగా భక్తులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. రీడింగ్ నగరంలోగల Rivermead Leisure కాంప్లెక్స్లో ఈ వేడుకలు జరిగాయి.
చూపరులు మంత్ర ముగ్దులయ్యే విధంగా ఉన్న స్వామివారి, అమ్మవార్ల విగ్రహాలకి తిరుపతిలో పూజ చేసిన అనంతరం ఇక్కడికి కల్యాణానికి తీసుకురావడం జరిగింది. తొలుత తిరుపతి నుంచి వేద పండితులని , అర్చకులని, ఈ కార్యక్రామానికి ముఖ్య వ్యాఖ్యాతగా వ్యవహరించడానికి విచ్చేసిన TTD అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టరుగా పని చేసిన శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు గారిని మరియు అక్కడికి విచ్చేసిన భక్తులందరినీ GB-SRSB తరపున ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంతోష్ కుమార్ బచ్చు స్వాగతించారు. నాదస్వర వాయిద్యాల మధ్య స్వామివారిని, అమ్మవార్లని ఉరేగింపుగా తీసుకుని వచ్చి సేవా కార్యక్రమాల భాగంలో మొదట లాంచనంగా సుప్రబాత సేవతో స్వామిని మేల్కోల్పారు. కార్యక్రమంలో జరిగిన వివిధ సేవల్లో (సుప్రబాత సేవ, తోమాల సేవ, అర్చన మరియు కళ్యాణ సేవ) భక్తులు భక్తి విశ్వాసాలతో పాల్గొని తన్మయత్వంలో మునిగి తేలారు. ప్రపంచ నలుమూలలో TTD వారు నిర్వహిస్తున్న శ్రీనువాసుడి కళ్యాణ కార్యక్రమాల్లో శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు గారి వ్యాఖ్యం ఇక్కడి భక్తులని ఎంతగానో ఆకట్టుకుంది. సుమన పాడిన అన్నమాచార్య కీర్తనలు , మరియు ఇతర భక్తులు పాడిన భక్తి పరమైన పాటలు అందరినీ అలరించాయి.
ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు, అక్కడ గల సంస్థలు (ICICI బ్యాంకు, షిర్డీ సాయి బాబా అసోసియేషన్ అఫ్ లండన్ - SHITAL, తెలుగు అసోసియేషన్ అఫ్ రీడింగ్ అండ్ అరౌండ్ - TARA, Shehnai Banquet Suites మొదలగునవి) స్వచ్చందంగా వివిధ సేవల్ని అందించారు. ఉదయం ఏర్పాటు చేసిన ఫలహారం మరియు కళ్యాణం తరువాత ఏర్పాటు చేసిన మహా ప్రసాదాన్ని భక్తులు ఆస్వాదించారు. ఎంతో నిష్టగా పూజలు నిర్వహించిన TTD అర్చకులని, సహకరించిన TTD ఆఫీసర్లని మరియు శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు గారిని నిర్వహకులు సన్మానించారు.
ఆపై సౌత్ ఇంగ్లాండ్లో గల వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 50కి పైగా చిన్నారులు, పెద్దలు పలు బాలాజీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి మన శాస్త్రీయ గానాలతో, నృత్యాలతో చూపురులని రంజింప చేసారు. సాయంత్ర ఆరతితో ఈ వేడుకలు ముగిశాయి.
UKలో ఇంతటి పెద్ద ఎత్తున శ్రీనివాసుడి కల్యాణం జరగడం, అందులో తాము పాల్గొనడం తమకు ఎంతో ఆనందంగా వుందని అక్కడికి వచ్చిన భక్తులు TTD వారికి మరియు ఈ కార్యక్రామినికి మూలమైన శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావన్ (GB-SRSB) సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తిరుపతి నుంచి తీసుకొచ్చిన లడ్డు ప్రసాదాన్ని భక్తులందరికీ ఉచితంగా పంచడాన్ని భక్తులు హర్షం వ్యక్తం చేసారు.
ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి తోడ్పడిన అందరికీ కళ్యాణ నిర్వాహకులు (ఫ్రహ్ల్లద పురోహిత్, బద్రీ గర్గెశ్నరి, విద్యాసాగర్ జ్యోషి, రాఘవెందిరన్ గోవింద రావు మరియు శ్రీహరి గుబ్బి) కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ రాఘవేంద్ర స్వామి వారికి UKలో ఆలయ నిర్మాణమే ఈ శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావన్ (GB-SRSB) సంస్థ ముఖ్య ఉద్దేశం. ఈ సంస్థ ప్రతీ సంవత్సరం శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన, శ్రీ ధన్వంతరి హోమం, శ్రీ నరసింహ జయంతి ఇలాంటి పలు కార్యక్రమాలు చేపడతారు.