
To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
07 June 2016
Hyderabad
లాస్ ఏంజెల్స్ June 4th, 2016 - అమెరికా లోని లాస్ ఏంజెల్స్ పట్టణం లో ఈస్ట్ వేల్ నగరం లో లాస్ ఏంజెల్స్ తెలుగు అసోసియేషన్ (లాటా) వారు నిర్వహించిన తమన్ మ్యూజికల్ నైట్ పాటల వేడుక అట్టహాసంగా జరిగింది.
తమన్ అండ్ గ్రూప్ శ్రీ కృష్ణ, గీత మాధురి,దీపు, దీపక్ సుబ్రహ్మణ్యం మరియు సమీరా భరద్వాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రదర్శన కన్నుల పండుగగా, వీనుల విందుగా, ఉత్సాహ భరితంగా జరిగింది.
టాలీవుడ్ సింగర్స్ తన గానామృతంతో తెలుగు ప్రజలను ఉర్రూతలూగించారు. ఈ కార్యక్రమం కేవలం మూడు రోజులలోనే అనుకోని నిర్వహించబడినను భారీ స్పందన లభించింది.
అతి తక్కువ వ్యవధి లొనే తమన్ అండ్ బృందానికి కావాల్సిన అన్ని వసతులు చేకూర్చి, నాణ్యమైన ఆడియో visuals ని అందించి, ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి లాటా వారి సంస్ధ యొక్క బలమైనటువంటి వాలంటీర్స్ కృషియే అని మరొకసారి నిరూపించారు.
ఈ కార్యక్రమాన్ని ప్రణాళిక బద్దంగా నిర్వహించి ఇంతటి ఘన విజయానికి కారణమయిన లాటా సంస్థను లాస్ ఏంజెల్స్ తెలుగువారు కొనియాడారు. ఈస్ట్వేల్ నగరం లో మొట్ట మొదటి సారిగా ఇలాంటి కార్యక్రయమం చేసినందుకు అక్కడి తెలుగు వారు ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఇంకా ముందుముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలనీ అభినందించారు.
తమన్ & బృందం ఈ పాటల వేడుక ఇంత వైభవంగా జరుపుకోవడానికి కారణమైన వాలంటీర్స్ కు వారి శ్రమను లాటా యొక్క ప్రెసిడెంట్ & బోర్డ్ అఫ్ డైరెక్టర్స్ పేరు పేరున తమ కృతజ్ఞతలు తెలిపారు.
తమన్ & బృందం ఈ పాటల వేడుక ఇంత వైభవంగా జరుపుకోవడానికి కారణమైన వాలంటీర్స్ కు వారి శ్రమను లాటా యొక్క ప్రెసిడెంట్ & బోర్డ్ అఫ్ డైరెక్టర్స్ పేరు పేరున తమ కృతజ్ఞతలు తెలిపారు.




