pizza
Steve Sweeney,Senate President of New Jersey at Sai Datta Peetham
న్యూజెర్సీ సాయి దత్త పీఠానికి విచ్చేసిన స్టీవ్ స్వీని - సెనెట్ ప్రెసిడింట్
అమెరికాలో షిరిడీ నిర్మాణానికి సహకారం అందిస్తానని హామీ
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at hijeevi@gmail.com

17 August 2015
Hyderabad

సౌత్ ప్లెయిన్ఫీల్డ్: అమెరికాలో షిరిడి నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సాయి దత్త పీఠానికి అటు ప్రవాస భారతీయులతో పాటు అమెరికన్ల మద్దతు లభిస్తోంది. తాజాగా న్యూజెర్సీలో స్థానిక సెనెట్ ప్రెసిడింట్ స్టీవ్ స్వీని సాయి దత్త పీఠానికి విచ్చేసి అమెరికాలో షిరిడీ నిర్మాణానికి తన వంతు మద్దతు అందిస్తానని ప్రకటించారు. న్యూజెర్సీ ప్రజా ప్రయోజన శాఖ మంత్రి ఉపేంద్ర చివుకులతో కలసి స్టీవ్ స్వీని సాయి దత్త పీఠానికి విచ్చేశారు. అమెరికాలో షిరిడీ నిర్మాణానికి చేపడుతున్న మహా సంకల్పం గురించి ఉపేంద్ర చివుకుల స్టీవ్ కు వివరించారు. ప్రతి సాయి భక్తుడి 11 డాలర్ల విరాళంతో షిరిడీ నిర్మాణ లక్ష్యానికి ఎలా చేరువ కానున్నది చివుకుల స్టీవ్ కు స్పష్టం చేశారు. సాయి దత్త పీఠంలో జరిగిన పూజలో కూడా పాల్గొన్న స్టీవ్.. పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. అక్కడ జరుగుతున్న నిత్యాన్నదాన మందిరం ను పరిశీలించారు. సాయినాధుని ప్రసాదములను స్వీకరించారు. సాయిదత్త పీఠానికి రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని స్టీవ్ స్వీని అన్నారు.

 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved