To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
11 January 2017
USA
ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అనేది మరువని మన తెలుగు ప్రవాసీయులు అమెరికాలో అందమైన ముగ్గులు వేస్తూ సంక్రాంతి కళను ముందుగానే తీసుకొచ్చారు. అమెరికాలోని సెంట్రల్ ఓహియోలో తెలుగు వాళ్లంతా సంక్రాంతి ముగ్గుల పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. నాట్స్ తో కలిసి అడుగులు వేసే సెంట్రల్ ఓహియో తెలుగు సంఘం (టాకో) ఈ ముగ్గుల పోటీలు నిర్వహించింది. దాదాపు 125 మంది మహిళలు ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొని తమ సృజనాత్మకతను చూపించారు. తెలుగు వారి సంస్కృతి సంప్రదాయాలను తాము ఎన్నటికి మరిచిపోలేమని చాటారు. ఈ ముగ్గుల పోటీలో చక్కటి ప్రతిభ చూపిన విజేతలకు చీరలను బహుమతులను అందించారు.
ఓహొయొ తెలుగు సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావు మన్నే కార్యవర్గ సభ్యులు రవి వంగూరి, జ్యోతి పూదొట, వేణు బత్తుల , జగన్ చలసాని, ప్రతిమ సురవరపు, శ్రీనివాస్ పోలిన ,సుబ్బు కాశిచైనుల, అపర్న కొనంకి, ప్రసాద్ కాడ్రు , శ్రీకాంత్ మునగాల ,నరెష్ గంధం, విజయ్ కాకర్ల, వెంకట్ కనక,వినొద్ కొసిక,మహి వన్నె, మురళి పుట్టీ, సతీష్ సింగంపల్లి తదితరులు ఈ ముగ్గుల పోటీలను దిగ్విజయంగా నిర్వహించడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఈ పోటీలకు సహకరించిన వాలంటీర్లందరిని టాకో ప్రత్యేకంగా అభినందించింది.