To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
18 November 2014
Hyderabad
విజయవాడ సిద్దార్థ వైద్య కళాశాలలో వైద్య విద్యనభ్యసించి అమెరికాలోని వివిధ నగరాలలో వైద్యులుగా ఉన్న ప్రవాస తెలుగువారు విశాఖ పునర్నిర్మాణం కోసం 55 వేల డాలర్లు (సుమారు 33 లక్షల రూపాయలు) సమీకరించారు. ఈ నిధుల సమీకరణకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) చేయూత నందించింది. నవంబర్ 16 ఆదివారం డల్లాస్ లో జరిగిన సమావేశంలో సిద్దార్థ వైద్య కళాశాల ప్రతినిధులు డాక్టర్ సతీష్ కుమార్ పొట్లూరి, డాక్టర్ అరుణ్ మిత్ర కాండ్ర, డాక్టర్ హిమ మిక్కిలినేని, డాక్టర్ వంశీ కొర్రపాటి, డాక్టర్ సుమన్ రావూరి, డాక్టర్ వినయ వెన్నం, డాక్టర్ సుధామయి మొలకలపల్లి పాల్గొన్నారు. వారు ఈ మొత్తాన్ని తానా దక్షిణ విభాగపు ప్రాంతీయ ప్రతినిధి డాక్టర్ రాజేష్ అడుసుమిల్లి చేతుల మీదుగా తానా సంస్థకు అందించారు.
రాజేష్ అడుసుమిల్లి మాట్లాడుతూ అమెరికాలో ఉన్న సిద్దార్థ వైద్య కళాశాలకు చెందిన వైద్యులు విశాల హృదయంతో స్పందించి నిధులు సమీకరించడం హర్షించదగ్గ విషయమని వాటిని తానా సంస్థ సిద్దార్థ వైద్య కళాశాల పూర్వ విద్యార్థులతో కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేస్తుందని తెలియ చేసారు. మున్ముందు కూడా తానాతో సిద్దార్థ వైద్య కళాశాల అనుబంధం కొనసాగుతుందని, తానాతో కలిసి వైద్యపరంగా మన తెలుగు వారికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలు చేస్తామని సిద్దార్థ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల ప్రతినిధి డాక్టర్ సతీష్ కుమార్ పొట్లూరి తెలియజేసారు.
సమావేశానికి హాజరైన తానా పూర్వాధ్యక్షులు డాక్టర్ నవనీతకృష్ణ గొర్రెపాటి, డాక్టర్ ప్రసాద్ తోటకూర తానా బోర్డు డైరెక్టర్ రామ్ యలమంచిలి తానా కమిటీ చైర్స్ మురళి వెన్నం, చలపతి కొండ్రకుంట, శ్రీకాంత్ పోలవరపు సిద్దార్థ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల బృందానికి అభినందనలు తెలియజేసారు. తానా అధ్యక్షుడు నన్నపనేని మోహన్ మాట్లాడుతూ సిద్ధార్థ కళాశాల సంస్థలకు, తానాకు ఎంతో అనుబంధం ఉందని ఇటువంటి సత్కార్యానికి పూనుకుని తానా సంస్థ ద్వారా విరాళాలు అందించాలని నిర్ణయించుకున్న సిద్దార్థ వైద్య కళాశాల పూర్వ విద్యార్థులందరికీ కృతజ్ఞతలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో కమిటీ చైర్స్ ఉమ యలమంచి, సాంబ దొడ్డ, వినోద్ ఉప్పు, శివ వంకాయలపాటి, పరమేష్ దేవినేని, సాయి లింగా, అనిల్ ఆరేపల్లి, లక్ష్మీకాంత్ గొర్రెపాటి, తానా ఫౌండేషన్ కోశాధికారి మంజులత కన్నెగంటి , తానా పత్రిక పూర్వ సంపాదకులు చంద్ర కన్నెగంటి, డల్లాస్ లో ప్రముఖ దంత వైద్యులు మహేష్ గొంది మరొయు అనేక మంది డల్లాస్ లోని ప్రవాస తెలుగు వారు పాల్గొన్నారు.