To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
14 December 2013
Hyderabad
తానా సంస్థ - పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ సహకారం తో 2014 ఉగాది నుండి తెలుగు భాష, గాత్ర సంగీతం, వాయిద్య సంగీతం, కూచిపూడి నృత్యం, భరత నాట్యం, ఆంధ్ర నాట్యం లలో నాల్గు సంవత్సరాల కోర్సు లను ప్రారంభిస్తున్నట్లు తానా ఆధ్యక్షుడు మోహన్ నన్నపనేని మరియు తానా మాజీ అధ్యక్షుడు, "తానా- పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ కోర్సు ల" చైర్మన్ ప్రసాద్ తోటకూర ఓ సంయుక్త ప్రకటన లో తెలియజేశారు.
ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అఫిలియేషన్ నియమ నిబంధనల మేరకు మరియు వారు నిర్దేశించిన కోర్సుల ప్రకారం అమెరికాలో వివిధ నగరాలలో వచ్చే ఉగాది నుండి కోర్సులను ప్రారంభిస్తున్నట్లు, మొదటి మూడు సంవత్సరాలు తానా సంస్థ స్వయంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు, నాల్గవ సంవత్సరం లో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయ అధికారులు అమెరికా వచ్చి పరిక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన విద్యార్ధులకు విశ్వవిద్యాలయ సర్టిఫికెట్లు ప్రదానం జేస్తారని తెలిపారు. విదేశాలలో తెలుగు భాష, గాత్ర సంగీతం, వాయిద్య సంగీతం, కూచిపూడి నృత్యం, భరత నాట్యం, ఆంధ్ర నాట్యం అన్ని కోర్సులను భోదించడానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అనుమతి యివ్వడం ఇదే తోలి సారి అని అందుకు విశ్వవిద్యాలయ అధికారులకు కృతజ్ఞతలను తెలియ జేసారు.
అమెరికా లోని వివిధ నగరాలలో తెలుగు భాష, గాత్ర సంగీతం, వాయిద్య సంగీతం, కూచిపూడి నృత్యం, భరత నాట్యం, ఆంధ్ర నాట్యం లలో కోర్సులను భోదించడానికి ఆసక్తి, అర్హత ఉన్న అధ్యాపకులు వెంటనే తమ అర్హత లతొ కూడిన వివరాలను prasadthotakura@gmail కు పంప వలసింది గాను, మరిన్ని వివరాలకు ప్రసాద్ తోటకూర ను 817-300-4747 లో సంప్రదించ వలసింది గా కోరుచున్నారు.