To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
30 July 2015
Hyderabad
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) కనీ విని ఎరుగనిరీతిలో మొట్టమొదటి సారిగా పదునెనిమిది సంవత్సరాల వయసు పైబడిన స్థానిక గాయనీగాయకులకు ‘స్వరమంజరి’ అనే పాటల పొటీల కార్యక్రమాన్ని, డాల్లస్ మహానగర ప్రాంతంలోని సెయింట్ మేరిస్ చర్చ్ లో ఈ నెల ఆదివారం 26వ తేదీన ఘనంగా నిర్వహించారు. పిల్లలకు శిక్షణా శిబిరాలు, పాటల పోటీలు మనం తరచు చూస్తూనే ఉంటాం. కాని పెద్దలకు ఇటువంటి వినూత్న పాటల పోటీలు నిర్వహించటం సంస్థ చరిత్రలో ఇదే మొదటిసారి అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. “ఫ్రగతి పథంలో పది సూత్రాలు” అంటూ ఈ సంవత్సరం విభిన్నరీతిలో సరికొత్త కార్యక్రమాలను మన తెలుగువారికి అందించాలనే తపనతో ఈ కార్యక్రామానికి శ్రీకారం చుట్టి స్థానిక కళాకారులకు మరింత ప్రోత్సాహం కలిగించారు సంస్థ అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి. తుది ఆవృత్తంతో కలిపి స్వరమంజరి కార్యక్రమంలో మొత్తం ఐదు ఆవృత్తాలు ఉంటాయని, మిగతావి ఆగస్టు 22, సెప్టెంబరు 26, అక్టోబరు 31, డిశెంబరు 05 తేదీలలో నిర్వహించనున్నారు,
జ్యొతీ ప్రజ్వలనతో సంస్థ అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి, ముఖ్య అతిధి మరియు ప్రధాన న్యాయనిర్ణేత శ్రీ గి. ఆనంద్ గారు, ప్రత్యేక కార్యక్రమాల సమన్వయకర్త శ్రీమతి. శారద సింగిరెడ్డి, స్థానిక న్యాయనిర్ణేతలు శ్రీ రాజశేఖర్ సూరరిభోట్ల, శ్రీ శ్రీనివాస్ ప్రభల, టాంటెక్స్ ఉతారాధ్యక్షులు శ్రీ. సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, ఉపాధ్యక్షులు శ్రీ.కృష్ణ ఉప్పలపాటి, కార్యదర్శి శ్రీ.మహేష్ ఆదిభట్ల, సంయుక్త కార్యదర్శి శ్రీ చినసత్యం వీర్నపు, కోశాధికారి శ్రీమతి.కృష్ణవేణి శీలం, సంయుక్త కోశాధికారి శ్రీ వేణు పావులూరి, మరియు కార్యవర్గ సభ్యులు శ్రీ.వెంకట్ దండ, శ్రీ రఘు గజ్జెల, శ్రీమతి. లక్ష్మీ పాలేటి, శ్రీమతి జ్యోతి వనం, శ్రీ రామకృష్ణారెడ్డి రొడ్డా, తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. టాంటెక్స్ ప్రత్యేక కార్యక్రమాల జట్టు సభ్యులు శ్రీ సతీష్ పున్నం, శ్రీమతి ఇందు పంచార్పుల, శ్రీమతి పల్లవి తోటకూర, శ్రీమతి జయ తెలకలపల్లి, శ్రీ నరేష్ సుంకిరెడ్డి, శ్రీ పవన్ గంగాధర్, శ్రీ వెంకట్ కోడూరి, శ్రీ నగేష్ దిండుకుర్తి, శ్రీ శివ మాతేటి మరియు శ్రీ రవితేజ చురుకుగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి సంస్థ కార్యదర్శి శ్రీ.మహేష్ ఆదిభట్ల వ్యాఖ్యాతగా వ్యవహరించి ఆద్యంతం గాయనీ గాయకులను పరిచయం చేయటంతో పాటు, వారు పాడిన పాట యొక్క సినిమా పేరు, విడుదలైన సంవత్సరం, పాడిన వారు, దర్శకుల వివరాలను ప్రేక్షకులకు తెలియజేయటమే కాకుండా వారి చమత్కారికలతో కార్యక్రమానికి మరింత వన్నె తెచ్చారు. ఈ పాటల పోటీలకు చలనచిత్ర గాయకులు శ్రీ.ఆనంద్ గాదెల, శాస్త్రీయ సంగీత గాయకులు శ్రీ. శ్రీనివాస్ ప్రభల, సంగీత దర్శకులు శ్రీ.రాజశేఖర్ సూరిభొట్ల న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. అనంతరం ఈ పాటల పోటీలను నిర్వహించటంలో ప్రధాన సంధానకర్త అయిన అశ్విన్ కౌత ‘గణనాయకాయ గణాధ్యక్షాయ’ అనే ప్రార్థనా గీతంతో స్వరమంజరికి శ్రీకారం చుట్టారు.
శివకేశవులని సైతం డోలలూగించేటువంటిది గానం. చతుర్వేదాలలో అతిముఖ్యమైన ‘సామ వేదం’ నుండి ఆవిర్భవించిన గాన విద్యను నిరంతరం సాధన చేస్తే కాని గాత్రంలో శృతి-లయలను నిలపడం సాధ్యం కాదు. ఏనాడో మర్చిపోయిన పాటలను ఙ్ఞాపకం తెచ్చుకుని తమగాత్రాలకు పదునుపెట్టి మేమూ పాడగలం అని ఎంతోమంది గాయనీ గాయకులు ఈ స్వరమంజరి ప్రథమ సంచిక పాటల పోటీలో పాల్గొని వారి వారి ప్రతిభను చాటుకున్నారు.
ఇందులో ఆనంద్ కసవరాజు, సాయి రాజేష్ మహాభాష్యం, శాంతి నూతి, చైతన్య పెళ్ళూరి, కీర్తి వర్రె, చక్రపాణి కుందేటి, సంగీత మారిగంటి, శ్రీని ఏలేశ్వరపు, రమేష్ నారని, ప్రభాకర్ కొట, పరిమళ మార్పాక, నాగి వడ్లమణి, పూజిత కడిమిసెట్టి, ఆషాకీర్తి ధర్మపురి, సమీర ఇల్లెందుల, మురళి హనుమంతకారి, గౌతం కస్తూరి, జానకి శంకర్, స్వప్న గుడిమెళ్ళ, కమలాకర్ పూనూరు, సంతోష్ కమ్మంకర్, గోపాల్ చెరుకు, స్వేత బొమ్మిసెట్టి, దీప్తి బెండపూడి గాయనీ గాయకులు ఎంతో ఔత్సుకతతో తమదైన శైలిలో ఆలపించారు. సుమారు ఐదు గంటలపాటు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పాటల పోటీలకు ఆడియొ అందించినవారు బాల గణపవరపు, వీడియొ శ్రీ. వెంకట్ జొన్నాడ, ఫొటోగ్రాఫి శ్రీ. భాస్కర్ అందించారు.
న్యాయ నిర్ణేతలు ఇకముందు జరగబోయే స్వరమంజరి రెండవ సంచికలో కేవలం శాస్త్రీయ సంప్రదాయంతో శృతి తాళ, లయ, గతి, విన్యాసాలు, భావరాగాలు, ఎత్తుగడలు సమపాళ్ళలో కలిగిఉండే సినీ గీతాలు ఉంటాయని ప్రకటించారు.
తదనంతరం సినీ గాయకులు, సంగీత దర్శకులు శ్రీ.ఆనంద్ గాదెల “ఒక వేణువు వినిపించెను" అనే గీతాన్ని ఆలపించి ప్రేక్షకులను మైమరపించారు. టాంటెక్స్ సంస్థ అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి మరియు కార్యవర్గ సభ్యులు న్యాయ నిర్ణేతలను సన్మానించి ఙ్ఞాపికను అందించారు.
ఈ పాటల పోటీలో పాల్గొన్న గాయనీ గాయకులు పలువురు వారి వారి అనుభవాలను తెలియజేస్తూ స్వరమంజరి వంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు న్యాయ నిర్ణేతలద్వారా మరియు తమ తోటి కళాకారుల ద్వారా ఎన్నో మెళకువలు నేర్చుకో గలిగామనీ శ్రీ.గౌతం కస్తూరి అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఇకముందు కూడా నిర్వహిస్తే బాగుంటుందనీ శ్రీమతి. సమీరా ఇల్లెందుల, ఎప్పుడో మర్చిపోయిన పాటలను గుర్తుకు తెచ్చిన ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం వారికి వారు ఎంతో ఋణపడి ఉంటాం అని కు. పరిమళ మార్పక స్పందనను తెలియజేసారు.
చివరగా వందన సమర్పణలో శ్రీమతి.శారద సింగిరెడ్డి స్వరమంజరి కార్యక్రమానికి ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి, మరియు ప్రసార మాధ్యమాలైన టీవీ9, టీవీ5, సీవీఆర్ టీవీలకు, స్వరమంజరి పాటల పొటీ విజేతకు బంగారు పతకాన్ని అందజేయనున్న తన్మయీ జ్యువెల్లర్స్ కు, కార్యక్రమ అజ్ఞాత పోశాకదాతకు, ఆడిటోరియం యాజమాన్యానికి, ఈ కార్యక్రమానికి స్వల్పాహారం అందించిన కేఫ్ బహార్ కు కృతఙ్ఞతా పూర్వక అభివందనములు తెలియజేసారు.