To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
12 November 2015
Hyderabad
సంగీత సరస్వతికి పూజా కుసుమం టాంటెక్స్ ‘స్వరమంజరి’: 4వ ఆవృత్తం అద్భుతం
ఆనాటి పాత సినిమా పాటలతో పాటు నేటి పాప్ సాంగ్స్ రీమిక్స్ వరకు పాత కొత్తల మేలు కలయికగా ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘స్వరమంజరి’ పాటల పోటీలు రసఙ్ఞ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి.
‘స్వరమంజరి’ పాటల పొటీల కార్యక్రమం నాల్గవ ఆవృత్తం డాల్లస్ మహానగర ప్రాంతంలోని సెయింట్ మేరిస్ చర్చ్ లో ఈ నెల అక్టోబర్ 31వ తేదీన ఘనంగా నిర్వహించారు. ఇప్పటికే నాలుగు ఆవృత్తాలు విజయవంతంగా సాగాయి. మొదటి ఆ వృత్తం లో ముప్పై మంది కళాకారులు తలపడగా నాల్గవ అవృత్తానికి చేరుకునేసరికి పది మంది కళాకారులు మాత్రమే ఈ పోటీలో గెలిచి నాల్గవ అంకానికి చేరుకున్నారు. ప్రతి ఒక్కరూ ఏమాత్రం శక్తి వంచన లేకుండా చివరి వరకు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ అటు శ్రోతలను ఇటు న్యాయ నిర్ణేతలను మెప్పించేందుకు ప్రయత్నించారు. డిసెంబర్ నెల 5 వ తేదీన స్వరమంజరి గ్రాండ్ ఫినాలే పోటీలను డాల్లస్ లోని ‘జాక్ ఇ షింగ్లీ’ ఆడిటోరియం వేదికగా నిర్వహిస్తున్నారు.
ప్రత్యేకించి స్థానికంగా ఉన్న కళాకారుల్లోని ప్రతిభను చాటి చెప్పేందుకు ప్రత్యేకమైన వేదికను కల్పించాలనే సదుద్దేశంతో టాంటెక్స్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా సాగుతున్న ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో విజయవంతమైందని చెప్పాలి. తల్లితండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించి మన సంప్రదాయ సంగీతాన్ని నేర్చుకునేందుకు అడుగులు వేయటం స్పష్టమైన మార్పును తెలియజేస్తొంది. ఆధునికతతో పాటు అచ్చమైన తెలుగుదనాన్ని కాపాడుకోటానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో తోడ్పడతాయని మరోసారి నిరూపితమైంది.
జ్యొతీ ప్రజ్వలనతో సంస్థ అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి, ఉత్తరాధ్యక్షులు శ్రీ. సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి ఉప్పలపాటి, ముఖ్య అతిధి మరియు ప్రధాన న్యాయనిర్ణేత శ్రీమతి విజయలక్ష్మి, స్థానిక న్యాయనిర్ణేతలు శ్రీ రాజశేఖర్ సూరిభొట్ల, శ్రీ.శ్రీనివాస్ ప్రభల, ప్రత్యేక కార్యక్రమాల సమన్వయకర్త శ్రీమతి. శారద సింగిరెడ్డి, కోశాధికారి శ్రీమతి. కృష్ణవేణి శీలం, సంయుక్త కోశాధికారి శ్రీ. వేణు పావులూరి, మరియు కార్యవర్గ సభ్యులు శ్రీమతి శ్రీలక్ష్మి మండిగ, శ్రీమతి. జ్యొతీ వనం శ్రీ.వెంకట్ దండ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. టాంటెక్స్ ప్రత్యేక కార్యక్రమాల జట్టు సభ్యులు శ్రీమతి. ఇందు పంచార్పుల, శ్రీమతి. జయ తెలకలపల్లి, శ్రీమతి. పల్లవి తోటకూర, శ్రీమతి. మాధవి సుంకిరెడ్డి, శ్రీ నరేష్ సుంకిరెడ్డి, శ్రీ వెంకట్ కోడూరి, పాల్గొన్నారు. ఈ పాటల పోటీలకు ప్రధాన సంధానకర్తగా శ్రీ.అశ్విన్ కౌత వ్యవహరించారు.ఈ కార్యక్రమానికి శ్రీమతి. జయ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ప్రముఖ గాయని శ్రీమతి విజయలక్ష్మి, శ్రీ రాజశేఖర్ సూరిభొట్ల శ్రీ శ్రీనివస్ ప్రభల న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళాకారుల్లోని ప్రతిభా పాటవాలను పరిచయం చేసేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో తోడ్పడతాయని టాంటెక్స్ కృషిని ప్రశంసించారు.
సంగీతం ఓ సాగర మథనం. భావాతీత ప్రపంచం లోకి మనల్ని తీసుకువెళ్ళి సేద తీర్చే శబ్ద తరంగం. కుల, మత, జాతి, వైషమ్యాలకు అతీతంగా అందరూ అర్థం చేసుకునే భావనా స్వరూపం. తూర్పుపశ్చిమాలను ఏకం చేసే సాగర అలల పరంపరాను స్ఫురితం. ప్రపంచ శాంతి కేవలం సంగీతం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అన్నమయ్య, త్యాగయ్య వంటి మహా వాగ్గేయకారుల మొదలు పాప్ చక్రవర్తి మైకేల్ జాక్సన్ వరకు సంగీతం ద్వారా మోక్షాన్ని పొందారు. సప్తస్వరాలే సంగీతానికి ఆధారం జీవన్ముక్తికి పరమపద సోపానం. భాష ఏదైనా భావం ఒక్కటే. సరిగమలు మారినా మధురిమలు మారని సజీవ నాదం. అటువంటి నాదాన్నిరాగరంజకంగా శాస్త్రీయం, జానపదం, భక్తి, వైరాగ్య, సినీ సంగీతాన్ని హృదయం స్పందించే విధంగా గాయనీ గాయకులు పాటలను తగినట్లుగా గానం చేసి అందరినీ మెప్పించారు. ఇందులో ముందుగా శ్రీ. అశ్విన్ కౌత భక్తకన్నప్ప చిత్రం నుండి కిరార్తార్జునీయం అంశం పాడి పోటీ కి నాంది పలికారు. అటుతర్వాత పూజిత కడిమిసెట్టి, మురళీ హనుమంతకారి ప్రభాకర్ కొట, ఆషాకీర్తి ధర్మపురి, నాగి వడ్లమన్నాటి, సంగీత మరిగంటి, సాయి రాజేష్ మహాభాష్యం, జానకి శంకర్, చక్రపాణి కుందేటి, ఎంతో ఔత్సుకతతో తమదైన శైలిలో ఆలపించారు. ఈ పాటల పోటీలకు ఆడియొ అందించినవారు శ్రీ. బాల గణపవరపు, వీడియొ శ్రీ. వెంకట్ జొన్నాడ, ఫొటోగ్రాఫి శ్రీ. భాస్కర్. టాంటెక్స్ సంస్థ అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి మరియు కార్యవర్గ సభ్యులు న్యాయ నిర్ణేతలను సన్మానించి ఙ్ఞాపికను అందించారు.
చివరగా వందన సమర్పణలో శ్రీమతి. జయ స్వరమంజరి కార్యక్రమానికి ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన, దేశీ ప్లాజా, రేడియో ఖుషి, ఎక్ నజర్ ,టోరి, హమార, మరియు ప్రసార మాధ్యమాలైన ఐన టీవీ , టీవీ9, టీవీ5, సీవీఆర్ టీవీలకు, స్వరమంజరి పాటల పొటీ విజేతకు బంగారు పతకాన్ని అందజేయనున్న తన్మయీ జ్యువెల్లర్స్ కు, కీ.శే. కె.ఎల్.ప్రసాద్ గారి కుటుంబ సభ్యులకు, ఆడిటోరియం యాజమాన్యానికి కృతఙ్ఞతా పూర్వక అభివందనములు తెలియజేసారు.
--టాంటెక్స్ స్వరమంజరి కార్యక్రమంపై డా. సుధ కలవగుంట సమర్పించిన నివేదిక