To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
22 June 2016
Hyderabad
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం(టాంటెక్స్) మైత్రి ఆధ్వర్యంలో "ఫాదర్స్ డే" సంబరాలు శనివారం, జూన్ 18వ తేదీన టచ్ నైన్ ఇండియన్ రెస్టారెంట్ లో మైత్రి సమన్వయకర్త శ్రీమతి మండిగ శ్రీలక్ష్మి గారి అధ్యక్షతన ఘనంగా నిర్వహించబడ్డాయి. దాదాపు 100 కి పైగా పెద్ద వాళ్ళు ఈ కార్యక్రమం లో పాలు పంచుకుని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసారు.
ప్రవాసంలో నివసిస్తున్న మరియు భారత దేశం నుండి తమ పిల్లలతో గడపడానికి విచ్చేసిన తల్లిదండ్రుల కోసం టాంటెక్స్ ఏర్పాటు చేసిన వేదిక ఈ మైత్రి. రేపటి తరం చిన్నారి సహస్ర మనకన్నా ముందు తరాన్ని కీర్తిస్తూ పాడిన నాన్న లాలి పాట తో కార్యక్రమం మొదలయ్యింది. చిరంజీవి వనం హర్షిత్ సొంతంగా నాన్న మీద చక్కని కవిత వ్రాసి వినిపించాడు.
అమ్మను ప్రేమ, ఆప్యాయత, అనురాగాలకి ప్రతీక గా అమ్మను, మరియు నాన్నను రక్షణ, భవిష్యత్తు తీర్చి దిద్దడానికి ప్రతీకగా అనుకోవడం సహజం. అమ్మలా నాన్న ప్రేమను ప్రదర్శించ ప్రదర్షించలేనప్పటికీ కి, ఇద్దరి ప్రేమ స్వచ్చ స్వచ్ఛ మైన దే ది అని తెలియచేస్తూ ప్రదర్శించిన “మా నాన్న” షార్ట్ ఫిల్మ్ అందరి మనసుకు మనసులను హత్తుకుంది.
విచ్చేసిన పెద్దలు వారి వారి పరిచయాలతో, ఒకరి గురించి మరొకరు తెలుసుకునే అవకాశం కలిగింది. పరిచయానంతరం, మైత్రి బృంద సభ్యులు వనం జ్యోతి, చాగర్లమూడి శ్రీదేవి, బింగి సుమన ఎంతో ఉత్సాహంగా ఆడించిన “నేం బింగో”, "టాబూ" ఆటలు కాసేపు అందరినీ చిన్న పిల్లలను చేసాయి. పోటా పోటీగా అందరూ చాలా శ్రద్ధతో ఆడారు. పంచె కట్టే పోటీ చాలా సరదాగాగ అందరిని నవ్వించింది. ఆటల్లో గెలిచిన వారికి బహుమతులు అందజేసారు.
పాలకమండలి సభ్యులు రొడ్డా రామకృష్ణ గారు ఎన్నో తెలుగు పుస్తకాలు, నవలలను సహృదయం తో అందరికీ పంచిపెట్టి ఎంతో మందికి ఆనందం కలిగించారు. వచ్చిన పెద్దవారితో ఫాదర్స్ డే సందర్భంగా కేక్ కట్ చేయడంతో కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. మైత్రి కార్యక్రమం లో పాల్గొన్న సభ్యులు హర్షధ్వానాలతో తమ ఆనందాన్ని తెలియచేసారు.
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, ఉత్తరాధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు శీలం కృష్ణవేణి, తక్షణ పూర్వాధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి, కార్యవర్గ సభ్యులు వనం జ్యోతి, మండిగ శ్రీ లక్ష్మి పాలేటి లక్ష్మి, తోట పద్మశ్రీ , పార్నపల్లి ఉమా మహేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమన్వయకర్త శ్రీమతి మండిగ శ్రీలక్ష్మి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేపడతాం అని, మైత్రి సభ్యు ల లు కోరిక మేరకు కోరిన విధంగా జూలై నెలలో మైత్రి సభ్యులకి "కేరంస్" మరియు "చెస్" పోటీలు నిర్వహిస్తాము అని తెలియచేసారు. ఎంతో ఉత్సాహం గా తో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి వేదిక కల్పించిన "టచ్ నైన్" యాజమాన్యానికి, ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి మరియు ప్రసార మాధ్యమాలైన టీవీ9, టీవీ5, టిఎన్ఐ లకు ఐనా టీవీ, సీవీఆర్ టీవీలకు కృతఙ్ఞతా పూర్వక అభివందనములు తెలియజేసారు..