
To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
14 April 2014
Hyderabad
తారా (తెలుగు అసోసియేషన్ అఫ్ రీడింగ్ అండ్ అరౌండ్ - Telugu Association of Reading & Around) ఆధ్వర్యంలో ఉగాదిని పురస్కరించుకొని ఏప్రిల్ 5వ తేదిన, శనివారం 400కి పైగా తెలుగు కుటుంబాలు కలిసి కొత్త సంవత్సారాన్ని ఆహ్వానిస్తు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. రీడింగ్ లో గల యూనివర్సిటీ అఫ్ రీడింగ్ లో ఈ వేడుకలు జరిగాయి.
జ్యోతీ ప్రజ్వలనతో తారా ప్రెసిడెంట్ లక్ష్మిమాటురు గారు ఈ వేడుకల్ని ప్రారంబించారు. ప్రముఖ సినీ సంగీత వయోలిన్ కళాకారిణి, విద్వంసురాలు శ్రీమతి జ్యోత్స్న శ్రీకాంత్ ముఖ్య అతిధిగా విచ్చెయగా, సంగీత ప్రపంచానికి ఆమె చేసిన సేవల్నిగుర్తిస్తూ తారా వారు జ్యోత్స్న గారిని సన్మానించారు. ఆపై జ్యోత్స్నగారి వయోలిన్ సంగీత ప్రదర్శన మంత్ర ముగ్ధ్లుల్ని చేయగా, నంది అవార్డ్ గ్రహిత ప్రముఖ సినీ నేపధ్యగాయని మాళవిక తన మధురమైన గానాలతో అందరినీ ఉత్తేజపరిచారు.
ప్రకాష్ గారు జయ నామ సంవత్సరంలో రాశి ఫలాలని వినోదంగా వివరించారు. చిన్నారులలో తెలుగు భాష మీద ఆసక్తి పెంచే విధంగా ‘తెలుగాట’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏకపాత్రాభినయం, వీణ, వయోలిన్ వాయిద్యాలు, కూచిపూడి, భరతనాట్యం, మెడ్లీ డాన్సులు, పలు రకాల నాటకాలు (యమలోకం, రామాయణం, కాల్ యువర్ డాక్టర్, ఓంకార్ డాన్స్ ఛాలెంజ్), చిన్నారుల నృత్యాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 25మందికి పైగా కలిసి చేసిన ‘ఫ్లాష్ మాబ్’ డాన్స్ ఈ వేడుకల్లో ఒక ప్రత్యేకంగా నిలచింది.
ఈ నగరంలో మరియు చుట్టుపక్కల నివసిస్తున్న తెలుగు వారు తమ సంప్రదాయాలను కాపాడుకోవడానికి, వారి పిల్లలకు మన దేశం మీద ఇష్టం, గౌరవం పెరిగే విధంగా, మన సంస్కృతిని కాపాడుకునే విధంగా ఇలాంటి కార్యక్రమాలను ఇంకా చేపట్టాలని నిర్ణయించారు.
ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి మూలమైన కార్యక్రమ తారా కోర్ కమిటీ, ఎక్సేకుటీవ్ కమిటీ సభ్యులు మరియు వాలంటీర్స్ ఆనందం వ్యక్త పరిచారు.


