To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
12 October 2016
Hyderabad
తెలంగాణ యూరోప్ కల్చరల్ అసోసియేషన్ (టెకా) ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను ఆక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున బర్మింగ్హామ్ పట్టణంలో యూరోప్ లోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామి గుడి ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరిపారు. బతుకమ్మ పండుగకు బర్మింగ్హామ్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.
ఈ పండుగకు భారత కౌన్సిల్ జనరల్ శ్రీ జె.కె శర్మ గారు, ప్రముఖ ఉపాధ్యాయుడు, పాటల రచయిత శ్రీ నందిని సిద్ధారెడ్డి గారు, ఆనందం సినిమా ఫేమ్ హీరో ఆకాశ్ గారు, ఎన్నారై తెరాస సెల్ అధ్యక్షులు శ్రీ అనిల్ కూర్మాచలం గారు, తెలంగాణ జాగృతి లండన్ అధ్యక్షులు సంపంత్ గారు మరియు ప్రముఖ బిజినెస్ మాన్ డా|| రాజా పప్పు గారు తదితరులు హాజరు అయ్యారు.
టెకా కార్యదర్శి శేషేంద్ర శేషభట్టర్ మాట్లాడుతూ ఇది టెకా ఆధ్వర్యం లో రెండవ బతుకమ్మ పండుగ అని, ఈ పండుగ ప్రత్యేకత వల్ల తెలంగాణ వారు మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రలకు చెందిన భారతీయులు మరియు బ్రిటన్ వాసులు కూడా ఆదరిస్తున్నారు అని అన్నారు. ఇది తెలంగాణ సంకృతి గొప్పదనం అని అన్నారు. టెకా పండుగలు మాత్రమే కాకుండా "మేక్ ఇన్ ఇండియా" ద్వారా తెలంగాణలో పెట్టుబడులు పెట్టదలచుకున్న వ్యాపారవేత్తలకు తగిన సూచనలు కూడా చేస్తుంది అని అన్నారు.
టెకా కార్యదర్శి రమేష్ తాటిశెట్టి మాట్లాడుతూ టెకా తెలంగాణ ఎన్నో స్వచ్చంద కార్యక్రమాలు కూడా చేస్తూ తెలంగాణ నిర్మాణంలో తనవంతు బాధ్యత నిర్వహిస్తుంది అని అన్నారు.
టెకా కోర్ కమిటీ మెంబెర్స్ విష్ణు, క్రాంతి, శశికాంత్, రాంరెడ్డి, వెంకట్, కిరణ్, ఉపేందర్, అజయ్, నరేష్, మూర్తి, తేజ, హరీష్, శివాజీ, చందన్, రఘు, ప్రవీణ్ మరియు మహిళా విభాగం మెంబెర్స్ రేఖ, రమ్య, సౌందర్య, హేమ, స్రవంతి, ఉష, సౌమ్య, మౌనిక, సోనాలి, వోల్గా మరియు చాలా మంది ఇతర సభ్యులు బతుకమ్మ పండుగ జరుపుకునే అందరికి శుభాకాంక్షలు తెలిపారు.