To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
19 October 2015
Hyderabad
తెలంగాణ సంస్కృతికి ప్రతిభింభమైన బతుకమ్మ వేడుకలు లండన్ బ్రిటిష్ పార్లమెంట్ శనివారం సాయంత్రం ఆట్టహాసంగా జరిగాయి. తెలంగాణా జాగృతి యునైటెడ్ కింగ్డమ్ (TJUK) ప్రెసిడెంట్ సంపత్ కృష్ణ ధన్నంనేని event co ordinator Suman rao BALUMURI ఆధ్యర్యంలో జరిగిన ఈ వేడుకలకు అక్కడి MP లార్డ్ దోలకియా సతి సమేతంగా విచ్చేసారు ,అలాగే మాజీ భారత వికెట్ కీపర్ ఫరూక్ ఇంజనీర్ ,ఇండియన్ హై కమిషన్ మొదటి సెక్రటరీ విజయ్ వసంత , అక్కడి కౌన్సిలర్ పాల్ సతిరేసన్ మరియు టాలీవుడ్ హీరో ఆకాష్ ముఖ్య అతిధులుగా విచ్చేసి , జరిగిన కార్యక్రమాన్ని ఆద్యంతం వీక్షించి , అందరికి బతుకమ్మ శుభాకాంక్షలు తెలియ జేసారు
బ్రిటన్ పార్లమెంట్ లోని హౌస్ అఫ్ కామన్స్ జరిగిన ఈ కార్యక్రమం కి ఇంగ్లాండ్ నలుమూలల నుండి ప్రవాస తెలంగాణా వారు సకుటుంబ సపరివారంగా వచ్చారు , ముఖ్యంగా తెలంగాణా ఆడపడుచులు బంగారు బతుకమ్మ ని చేత బూని లండన్ విధులలో కనువిందు చేస్తూ , తెలంగాణా లో జరిగే బతుకమ్మ పండుగ సంప్రదాయాన్ని కళ్ళకు అద్దినట్టు ఆ బతుకమ్మలను ఒక చోట చేర్చి ఆట పాటలతో ఆ బతుకమ్మ ని కొలుస్తూ జరుపుకున్నారు
తెలంగాణా జాగృతి యునైటెడ్ కింగ్డమ్ శాక నిర్వహించిన బంగారు బతుకమ్మ కి ముఖ్య అథిదులుగ అక్కడి MP లార్డ్ దోలకియా సతి సమేతంగా విచ్చేసారు ,అలాగే మాజీ భారత వికెట్ కీపర్ ఫరూక్ ఇంజనీర్ ,ఇండియన్ హై కమిషన్ మొదటి సెక్రటరీ విజయ్ వసంత , అక్కడి కౌన్సిలర్ పాల్ సతిరేసన్ మరియు టాలీవుడ్ హీరో ఆకాష్ ముఖ్య అతిధులుగా విచ్చేసి , జరిగిన కార్యక్రమాన్ని ఆద్యంతం వీక్షించి , అందరికి బతుకమ్మ శుభాకాంక్షలు తెలియ జేసారు
బతుకమ్మ అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు , తెలంగాణా విశిష్టతను చాటే విధంగా అక్కడి తెలంగాణా వారు చేసిన నృత్యాలు , పాటలు ప్రతి ఒక్కరిని అలరించింది
అంతే కాకుండా తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కలవకుంట్ల కవిత ఇచ్చిన పిలుపు మేరకు , తెలంగాణా లో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు బాసట గ నిలవాలని నిశ్చయించి జాగృతి యుకె అధ్యక్షుడు సంపత్ కృష్ణ ధన్నమనేని మరియు బృందం అద్వర్యం లో ప్రతి నెల ఒక రైతు కుటుంబాన్ని దత్తత తీసుకోని సంవత్సర కాలం పాటు వారికి ఆర్ధిక సహాయం అందించడానికి విరాళాలు సేకరించారు ... దాని కోసం చేసిన లఘు చిత్రం అక్కడి వారి అందరిని కదిలించింది , అతిధులు జాగృతి చేస్తున్న ఈ గొప్ప కృషిని ప్రసశించారు
రుచికరమైన వంటకాలతో , తెలంగాణా సాంప్రదాయ సద్దులతో , ఆడపడచుల ఆత్మీయ పలకరింపులతో , కళ్ళను కట్టిపడేసే సాంస్కృతిక ప్రదర్శనలతో ఆ సాయంత్రం అట్ట హసంగా గడించింది
అదే విదంగా 18 వ తేదిన బంగారు బతుకమ్మ బ్రిటన్ లో ని బర్మింగ్హామ్ లో టేక సంయుక్తంగా నిర్వహిస్తున్నారు , ఈ నేల 24 న ఘనంగా దసరా సద్దుల బతుకమ్మ ని తెలంగాణా డెవలప్మెంట్ ఫోరం సంయుక్తంగా లండన్ కనివిని ఎరుగని విధంగా భారీగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని అధ్యక్షుడు సంపత్ ధన్నమనేని తన ప్రసంగం లో చెప్పారు
తెలంగాణా జాగృతి యునైటెడ్ కింగ్డమ్ శాక అధ్యక్షుడు సంపత ధన్నమనేని , ఉప అధ్యక్షులు సుష్మ , సుమన్ బలమురి ,సంతోష్ ,జనరల్ సెక్రటరీ శ్రవణ్ రెడ్డి, మీడియా & ప ర ఓ పావని రెడ్డి , సాంస్కృతిక విభాగం పావని పాల ,మహిళా విబాగం సంధ్య దశరథ్ బోలిశేటి , బిజినెస్ సెక్రటరీ కిశోరే మునగాల ,కోశాదికారి రఘు జక్కుల , కోర్ సభ్యులు గణేష్ పాల , ప్రశాంత్ , వంశీ మునిగంటి, నటరాజ్ మోలాల , వేణు గదాసు తదితరులు కార్యక్రమానికి విజయానికి తమ వంతు పాత్రను పోషించారు