To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
12 November 2015
Hyderabad
యుకే - యూరప్ లో “తెలంగాణా టూరిజం” అంబాసడర్ గా “తెలంగాణా ఎన్నారై ఫోరమ్ (TeNF)”
- లండన్ సమావేశం లో తెలంగాణా టూరిజం సెక్రెటరీ బుర్ర వెంకటేశం ప్రకటన
తెలంగాణా టూరిజం శాఖ మరియు తెలంగాణా ఎన్నారై ఫోరమ్ (TeNF) సంయుక్తంగా లండన్ లో "తెలంగాణా టూరిజం అభివృద్ది - ఎన్నారైల పాత్ర" సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమం లో ముఖ్య అతిది గా తెలంగాణా టూరిజం సెక్రెటరీ బుర్ర వెంకటేశం గారు పాల్గొన్నారు, అలాగే తెలంగాణా ఎన్నారై ఫోరమ్ ప్రతినిదుల తో పాటు, స్థానిక ట్రావెల్ ఏజెంట్స్, ప్రవాస తెలంగాణా వాదుల పాల్గొన్నారు.
ముందుగా గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణా ఎన్నారై ఫోరమ్ సంస్థ (TeNF), రాష్ట్ర ఆవిర్భావం కి ముందు ఉద్యమ ప్రస్థానం, తరువాత బంగారు తెలంగాణా కై చేస్తున్న కార్యక్రమాల వీడియో ని ప్రదర్శించి అతిథులకు వివరించారు.
వ్యవస్థాపక సబ్యుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ, సంస్థ ఆవిర్భావం నుండి నేటి వరకు చేపట్టిన కార్యక్రమాల గురించి అలాగే సంస్థ విజన్ ని, బావిష్యత్తు కార్య చరణను సభకు వివరించారు. బాద్యత గల తెలంగాణా సంస్థగా ప్రతి వేదిక పై నూతన రాష్ట్రాన్ని మార్కెట్ చేస్తున్నామని, అలాంటిది నేడు తెలంగాణా టూరిజం లాంటి ప్రభుత్వ సహకారం ఉంటే ఇంకా రెట్టింపు ఉత్సాహం తో, అధికారికంగా ఎన్నో ప్రపంచ వేదికల్లో తెలంగాణా ప్రాముక్యతను వివరించగలమని, తద్వారా, తెలంగాణా రాష్ట్రానికి పర్యాటకులను పెంచుకొనే అవకాశం ఉందని తెలిపారు.
తెలంగాణా టూరిజం సెక్రెటరీ బుర్ర వెంకటేశం గారు మాట్లాడుతూ, తెలంగాణా ఎన్నారై ఫోరమ్ గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణా సంస్కృతిని, తెలంగాణా రాష్ట్రాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్న తీరు చాలా గొప్పగా ఉందని, అంది వచ్చిన అన్ని వేదికలను ఉపయోగించుకొని రాష్ట్రాన్ని మార్కెట్ చేస్తున్న తీరు ఎంతో స్పూర్తి గా ఉందని ప్రశంసించారు. కొన్ని రోజుల ముంది పార్లిమెంట్ లో జరిగిన బిజినెస్స్ మీట్ లో తెలంగాణా పర్యాటక శాఖ కు అవకాశం కల్పించినందుకు తెలంగాణా ప్రబుత్వం తరుపున, వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణా పర్యాటక శాఖ అభివృద్దికి ప్రబుత్వం చేపడ్తున్న కార్యక్రమాలని, అలాగే ప్రపంచవ్యాప్తంగా వివిధ వేదికలపైన తెలంగాణా పర్యాటక శాఖ ప్రాతినిత్యం గురించి సభకు వివరించారు. ప్రవాస తెలంగాణా సంస్థలు గా, బాద్యత గల ప్రవాస తెలంగాణా బిడ్డలు గా అందరు ముందుకు వచ్చి ప్రబుత్వం తో కలిసి "బంగారు తెలంగాణా" నిర్మాణ క్రమంలో తెలంగాణా పర్యాటక అబివృద్దికి కలిసి రావాలని పిలుపున్నిచ్చారు.
అన్ని రంగాల్లో కంటే పర్యాటక రంగం లో పెట్టుబడులకి తెలంగాణా రాష్ట్రం అనువై న రాష్ట్రమని, వివిద అవకాశాల గురించి వివరించారు. పర్యాటక శాఖ అబివృద్దికి యుకే - యూరప్ లో తెలంగాణా ఎన్నారై ఫోరమ్ ని అంబాసడర్ గా చేసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రబుత్వం సిద్దంగా ఉందని, రానున్న రోజుల్లో హైదరాబాద్ లో ఒక సమావేశం ఏర్పాటు చేసి అందరి సూచనలతో ముందుకు వెళ్ళడానికి సిద్దంగా ఉన్నామని పేర్కొన్నారు.
చివరిగా తెలంగాణా ఎన్నారై ఫోరమ్ అద్యక్షులు సిక్క చంద్రశెకర్ గౌడ్ మాట్లాడుతూ, స్వంతగా ఇప్పటివరకు తెలంగాణా అబివృద్దికి ఎంతో కృషి చేశామని, ఈరోజు ప్రబుత్వం అందిస్తున్న సహకారం తో ఖచ్చితంగా మరింత బాద్యతగా ముందుకు వెళ్తామని తెలిపారు. తెలంగాణా ఎన్నారై ఫోరమ్ ని యుకే - యూరప్ అంబాసడర్ గా గుర్తించినందుకు ప్రబుత్వానికి, కే. సీ. ఆర్ గారికి, ముక్యంగా వ్యక్తిగతంగా వచ్చి మాలో ఎంతో స్పూర్తి నింపిన తెలంగాణా టూరిజం సెక్రెటరీ బుర్ర వెంకటేశం గారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యాక్రమంలో వ్యవస్థాపక సబ్యుడు అనిల్ కూర్మాచలం, అద్యక్షులు సిక్క చంద్రశెకర్ గౌడ్, అడ్వై సరి బోర్డ్ ఛైర్మన్ ఉదయ్ నగరాజు , ప్రమోద్ అంతటి మరియు ఇవెంట్స్ ఇన్ఛార్జ్ నగేష్ రెడ్డి తో పాటు సబ్యులు రత్నాకర్, సుమాదేవి, నరేశ్, శ్రీకాంత్ జెల్ల, స్వామి ఆశ, మీనాక్షి అంతటి, విక్రమ్ రెడ్డి, శ్రీనివాస్, సత్య, ప్రీతి, జ్యోతి రెడ్డి, గుప్త, కందాల ట్రావే ల్స్ అధినేత ప్రమోద్ కందాల తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.