
To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
22 June 2015
Hyderabad
కనెక్టికట్ లో వెల్లువిరిసిన తెలుగు మాట్లాట పోటీలు
జూన్ మూడవ వారాంతంలో కనెక్టికట్ లో Newington, వల్లభధాం దేవాలయ ప్రాంగణం లో సిలికానాంధ్ర మనబడి తెలుగు మాట్లాట పోటీలు విజయవంతంగా ముగిసాయి. దాదాపు 40 మంది చిన్నారులు పాల్గొని తమ తమ తెలుగు వికాస విజ్ఞాన ప్రతిభలతో అందరిని అలరించారు.
తెలుగు భాషా/విషయ జ్ఞానాలని పరీక్షించే “తిరకాటం”, తెలుగు పదాలలో సరైన అక్షరాలు, గుణింతాలు, వత్తులు వ్రాయడాన్ని పరీక్షించే “పదరంగం” ఆటల పోటీలు జరిగాయి. ఒక్కనిమిషం పాటు పిల్లలు వారికి నచ్చిన అంశంపై తెలుగులోనే మాట్లాటడం, ఒక్కనిమిషం మాత్రమే (ఒనిమా), అందరిని ఆకట్టుకుంది. ఒనిమా లో పిల్లల ప్రదర్శించిన ప్రతిభలకు, తిరకాటం పోటీలలో పిల్లలు చెప్పిన సమాధానాలకు ప్రేక్షకుల నుంచి విశేష ప్రతిస్పందన వచ్చింది. కరతాళ ధ్వనులతో ప్రాంగణం హోరెత్తింది.
మనబడి కార్యక్రమంలో కనెక్టికట్ లో మొత్తం 100 మందికి పైగా పిల్లలు ఐదు తరగతుల పాఠ్యప్రణాళిక లో వారం వారం తెలుగు నేర్చుకుంటున్నారు. ఈ పోటీలకి కనెక్టికట్ లో మనబడిలో తెలుగు నేర్చుకుంటున్న పిల్లలే కాక, అన్ని తెలుగు బడుల నుంచి పిల్లలు పాల్గొనటం ఒక విశేషం అయితే, పోటీలకి విచ్చేసిన బాషాబిమానులందరు ఈ పోటీలను చివరిదాకా ఉండి, సంపూర్ణంగా ఆస్వాదించటం మరొక విశేషం.
ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ పోటీలలో గెలుపొందిన బాలబాలికల వివరాలు:
బుడతలు (5-9 సంవత్సరాల వయస్సు)
తిరకాటం: (1) మహతీ సూరి (2) సుదీక్ష గాదిరాజు
పదరంగం: (1) రశ్మి వొబ్బిలిశెట్టి (2) స్వప్నిక కొట్ర
సిసింద్రీలు (10-13 సంవత్సరాల వయస్సు)
తిరకాటం: (1) హర్ష కొలిచిన (2) సౌమ్య కొవ్వూరి
పదరంగం: (1) సౌమ్య కొవ్వూరి (2) శ్రియ దానం
ఈ పోటీలలో గెలుపొందిన పిల్లలకు రావు యలమంచిలి గారు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమాలకు రవికాంత్ వొబ్బిలిశెట్టి, రవి కౌతరపు, సుధ కౌతరపు, రమేష్ దర్శి, బారతి దర్శి, శైలజ, అనురాధ కొవ్వూరి ఇంకా అనేక మంది భాషా సైనికులు కృషి చేసారు. సిలికానాంధ్ర మనబడి స్ఫూర్తి, తెలుగు నేర్చుకోవడానికి కల్పిస్తున్న తరగతులతో ప్రవాసంలో తెలుగు పై మమకారం, ఆసక్తి మరెంతో పెంపొందాలని, ఇటువంటి కార్యక్రమాలు చేబట్టి పిల్లలకు ఆటల ద్వారా తెలుగు ఇంకా హత్తుకునేలా చెయ్యాలని హాజరైన అనేక మంది పిల్లల తల్లిదండ్రులు, తెలుగు వారు ఆకాంక్షించారు.


