pizza
చికాగో లో తెలుగు మాట్లాట
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

12 May 2015
Hyderabad

చికాగో మే 10, 2015. "మిరపకాయ సెనగపిండి కలిపితే వచ్చే పదార్థం ఏమిటి? పెరుగులో పొపు వస్తే తయారు అయ్యే పదార్థం ఏమిటి?" అనే ప్రశ్నల కి తమ పిల్లలు ఇచ్చే జవాబు విని అవాకు అయ్యెరు తల్లి-తండ్రులు. "యజ్ఞము, నిర్లిప్త ము" వంటి పదాలను వ్రాయడం చూసి, తల్లి-తండ్రులు ముగ్ధులు అయ్యారు. ఇటీవలే చికాగో పరిసారాలలో జరిగిన సిలికానాంధ్ర మనబడి ప్రవాస కుటుంబాలకు, పిల్లలకు తెలుగు పై మక్కువ పెరగాలనే ఉద్దేశ్యంతో మే 9, శనివారం, అరోరా లో జరిగిన తెలుగు మాట్లాట పోటీలలో జరిగాయి. సుమారు 75 మంది బాలబాలికలు మాట్లాట పోటీలలో ఆడి తమ ప్రతిభాపాటవాలతో కనులవిందు గావించారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో పలుచోట్ల జరుగుతున్న ఈ మాట్లాట ఆటలు – తిరకాటం (జెపర్డీ-లైక్ గేమ్స్), పదరంగం (తెలుగు స్పెల్లింగ్ బీ), ఒక్క నిమిషం మాత్రమే (తెలుగు జస్ట్-ఆ-మినిట్) జరుగుతున్నాయి.

చికాగో పరిసరాలలో సిలికానాంధ్ర మనబడి దిన దిన ప్రవర్థమానంగా చిన్నారులను ఆకట్టుకుని తెలుగుని ఇక్కడి ప్రవాసాంధ్రుల పిల్లలుకు నేర్పుతోంది. ప్రస్తుతం సుమారు 100 కు పైగా పిల్లలు చికాగో పరిసరాలలో అరోరా, బఫ్ఫల్లో గ్రోవ్, బొలింగ్ బ్రుక్, షా మ్ బర్గ్, వెస్ట్ మాంట్, వెస్ట్ దండీ సెంటర్లలో తెలుగు నేర్చుకుంటున్నారు. ఈ మాట్లాట పోటీలలో న్యాయ నిర్ణేతలు మరియు పిల్లల తల్లి-తండ్రులు స్వచ్ఛంద సహాయకులు గా వ్యవహరించి ఉత్సాహంగా పాలుగొన్నారు.

“పలుకే బంగారం.. పదమే సింగారం” అనే పిలుపుతో ఈ మాట్లాట పోటీలు భాషాభిమానులను ఆకట్టుకుంటూ, తల్లిదండ్రులకు తెలుగు పై మక్కువ పెంచుతూ, రేపటి తరమైన పిల్లలలో తెలుగు తారలను వెలికి తీస్తోందనండంలో సందేహం లేదు. ఈ ఆటలలో విజేతలైన చిన్నారులు:

బుడతలు వయోవిభాగం (5 నుండి 9 ఏళ్ళు):
తిరకాటం:1) సుమేధ సూరుభొట్ల 2) శ్రావ్య కోట్లో
పదరంగం:1) శ్రావణి తెల్లాప్రగడ 2) సూర్యనినాద్ భమిడి
ఒక్క నిమిషం మాత్రమే (ఓనిమా): 1): కావ్యమాలిక పురాణం 2) సౌమ్య మేడపాటి
సిసింద్రీలు వయోవిభాగం (10 నుండి 13 ఏళ్ళు):
తిరకాటం: 1) వివేక్ ఇలి 2)  అక్షయ పొట్లూరి
పదరంగం: 1) వివేక్ ఇలి  2) కావ్య బొమ్మ 
ఒక్క నిమిషం మాత్రమే: ఓనిమా  1) సాయి అనిరూద్ధ్ వేదార్ధం 2) సాత్విక్ పిట్టల 

విజేతలకు జ్ఞాపికలు అందించిన ఇల్లినాయిస్ మనబడి సమన్వయకర్త సుజాత అప్పలనేని విజేతలకు జ్ఞాపికలు అందించి ఈ పోటీలు విజయవంతంగా నిర్వహించిన మంజుల భమిడి గారికి, సహకారం అందించిన పద్మ వెల్లంకి గారికి అభినందనలు తెలిపారు.

ఈ పోటిలలో న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన స్వచ్ఛందకార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ ఆటలపోటీలను చూసిన తల్లితండ్రులు సిలికానాంధ్రమనబడి వారు చేస్తున్న తెలుగు భాషాసేవకుతమ కృతజ్ఞతలు,అభినందనలు తెలిపారు.

 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved