To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
11 July 2015
Hyderabad
***తెలుగు కళా సమితి మూడు పదుల ముచ్చట *** అంగరంగ వైభవంగా 30వ వార్షికోత్సవ సంబరాలు ***
తెలుగు కళా సమితి 30వ వార్షికోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. జులై 10న (ఈ రోజు )సాయంత్రం ఆరున్నర నుంచి పదిన్నర వరకు రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ లో బాంక్వెట్ డిన్నర్ ఏర్పాటు చేశారు. దీనికి ముందు ముఖ్యంగా ఇండియా నుంచి వచ్చిన ప్రముఖులు,సినీ ప్రముఖులు, తెలుగు కళా సమితి సపోర్టర్స్, స్పాన్సర్లు, దాతలతో పరిచయ కార్యక్రమం ఉంది. దీని తరువాత లైట్ ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రాములు కూడా ఉన్నాయి. కాక్ టైల్స్, డెలీషియస్ ఇండియన్ ఫుడ్, సోషల్ నెట్ వర్కింగ్, మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాలు రూపొందించారు.
బ్యాంకెట్ రిజిస్ట్రేషన్, ఇతర వివరాలు http://form.jotform.us/form/51743753572157లో చూడొచ్చు.
శనివారం అద్భుతమైన కార్యక్రమాలు
జులై 11న అదిరిపోయే కార్యక్రమాలను రూపొందించింది తెలుగు కళా సమితి. న్యూజెర్సీలోని 1020, బ్రాడ్ స్ట్రీట్ లో ఉన్న నెవార్క్ సింఫనీ హాల్ లో ఈ కార్యక్రమాలు జరుగనున్నాయి . శనివారం సెలవురోజు కావడంతో ఉదయం 9 గంటల నుంచి రాత్రి పదకొండున్నర వరకు హుషారుపుట్టించే ఎన్నో ప్రోగ్రామ్స్ ను కండక్ట్ చేయబోతోంది తెలుగు కళా సమితి. ముందుగా పొమొనా టెంపుల్ నుంచి విచ్చేస్తున్న శ్రీ కృష్ణ దేశిక యతీంద్ర జీయర్ స్వామిజీ వారిచే తో ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది. అమెరికా మరియు ఇండియా జాతీయగీతాలతో తెలుగు కళా సమితి 30 వ వార్షికోత్సవ ప్రారంభం కానున్నాయి. తెలుగు వైభవంపై జొన్నవిత్తుల ప్రసంగంతో పరిచయ కార్యక్రమం మొదలవుతుంది. స్థానిక నృత్య కళాకారులచే నృత్య ప్రదర్శనలు , ఇండియా నుంచి వచ్చిన ఆర్టిస్టులతో వివేకానంద డ్రామా, పాఠశాల విద్యార్ధులచే ప్రదర్సనలు , గిరిజ కొల్లూరు ఆలపించే జానపద గేయాలు, స్థానిక నృత్య స్కూల్స్ విద్యార్ధుల క్లాసికల్ డ్యాన్స్, పరమానందయ్య శిష్యుల నాటిక, మరో రెండు నాటకాలు, ఇండియన్ రాగావారు నిర్వహించే సింఫనీ వాద్య (ఇన్ స్ట్రుమెంటల్) ప్రదర్శన , కవి స్కూల్ ఆఫ్ డ్యాన్స్ నుంచి జుగళ్ బంది , కల్యాణి ద్విభాష్యం గారిచే అన్నమయ్య కీర్తనలు, మీగడ రామలింగ స్వామి, ఏ. కోటేశ్వరరావు ల గయోపాఖ్యానం, థిల్లాన , ఫ్యాషన్ షో, సాహిత్యపోటీలతో పాటు సంగీత దర్శకుడు అనూప్రూబెన్స్ ట్రూప్ తో మ్యూజికల్ షో నిర్వహించబోతున్నారు. రాత్రి ఏడు గంటల నుంచి డిన్నర్ మొదలవుతుంది. తెలుగు కళా సమితి 30వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ 30వ వార్షికోత్సవ సంబరాల కు స్థానిక సంస్థలతో పాటు నేషనల్ తెలుగు ఆర్గనైజేషన్స్ కూడా తమ మద్దతు తెలిపాయి. కల్చరల్ సెలబ్రేషన్స్ రిజిస్ట్రేషన్ వివరాలు http://form.jotform.us/form/51743314713147లో చూడొచ్చు.
డోంట్ మిస్ ఇట్!!