To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
08 June 2015
Hyderabad
TECA నిర్వహించినమొదటి తెలంsగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం శనివారం నాడు బ్రిటన్ లోని శేఫ్ఫిల్ద్ నగరం లో చాలా అద్బ్జుతం గా జరిగింది. ముఖ్య అతిధులుగ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ హార్రి హర్ఫం, షెఫ్ఫీల్ద్ కౌన్సిలర్ ఇబ్రార్ హుస్సేన్, యూకే & ఇండియా వ్యాపారవేత్త సుధీర్ దేవులపల్లి విచ్చేసినారు. కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన తో మొదలై సంస్కృతిక కార్యక్రమాలు, గీతాలు, ప్రముఖుల వుపన్యాసలతో ఆద్యంతం మనోరంజకం గా జరిగింది.
ఎం పీ హారి హర్ఫం మాట్లాడుతూ "ఈ కార్యక్రం చాలా బాగుంది అని, ఇలాంటి కార్యక్రమాల వాళ్ళ వివిధ వర్గాల వారికి ఒకరి గురించి మరొకరు తెలుసు కొనడానికి వీలు వుంటుందని తెలిపారు. TECA టీం ని వారి యొక్క కొత్త రాష్ట్రం కోసం చేస్తున్న కార్యక్రమాలను అభినాందించారు.
షఫీల్డ్ కౌన్సిలర్ ఇబ్రార్ హుస్సేన్ మాట్లాడుతు "తనకి ఇండియా గురించి బాగ తెలుసునని, వారు కష్టించి పనిచేసే ప్రజలని గుర్తు చెసారు. TECA టీం ని తనని ముఖ్య అతిధి గా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఇక ముందు ఇలాంటి కార్యక్రమాలకి తను తప్పక వస్తానని, తన నుంచి గాని తన పార్టీ తరఫున గాని ఎలాంటి సహాయం కావలన్నా తప్పక చేస్తానని తెలిపారు.
వ్యాపారవేత్త సుధీర్ దేవులపల్లి మాట్లాడుతు "ప్రస్తుత ప్రపంచం లో ఎవరికి పక్క వారి గురించి, తన వారి గురించి పట్టించుకునె తీరిక లేకుండా పోయిందని, అలాంటప్పుడు Time is Money అనగా సమయం కెటాయించటమె ధనం కన్నా విలువైంది అని అన్నారు. ఇలాంటి సందర్భంలొ TECA కి చెందిన వివిధ రంగాలకి చెందిన నైపుణ్యం కలిగిన యువకులు ఇలాంటి కార్యక్రమాలు జరుపడం చాలా ఆనందంగా వుంది అని అన్నారు. వ్యపారవేత్త గా తన వల్ల యూకే మరియు ఇండియాలో ఎలాంటి సహాయం కావాలన్నా తప్పక చేస్తానని అన్నారు.
TECA టీం ప్రథినిధి శెషేంద్ర శేషభట్టర్ మాట్లాడుతూ "మేము అందరం తెలంగాణ నుండి వచ్చి UK లో ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్నామని, మేమంతా తెలంగాణ అభివృద్ధి కి మా వంతు సహాయం చేయటానికి సిద్ధంగ వున్నామని చెప్పారు. TECA ద్వార తెలంగాణ ప్రభుథ్వానికి ఇంఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో, హెల్త్కేర్ రంగం లో, తెలంగాణ యువకుల స్కిల్ డెవలప్మెంట్ కొరకై వివిధ ప్రాజెక్ట్స్ ఆలోచిస్తున్నామని వీటిని తెలంగాణ ప్రభుత్వానికి నివేదిస్తామని అన్నారు. మరియు TECA సంస్థ లో తెలంగాణ డెవలప్ మెంట్ కోసం పాటుపడె ప్రతి ఒక్కరు www.teca.website లొ చేరవచ్చని చెప్పారు.
.