To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
26 June 2015
Hyderabad
డల్లాస్ లో తిరుమల తిరుపతి దేవస్థానంచే శ్రీనివాసుని కళ్యాణం
కలియుగం లో దర్మాన్నీ నాలుగు పాదాల మీద నడిపించదానీకీ గొవిందుడు స్వయంబూ గా వెలిసాడు. స్వామి వారి సెవలొ తరించడానికి దెవతలు ఏడుకొండలు గా మారారు అనేది నమ్మకం. మారారు కోరికలు కోరితే కొంగు బంగారం చేసే దేవదేవుడు శ్రీ. వెంకటేశ్వర స్వామి. ఆ స్వామిని కనులారా వీక్షించడానికి ఒక జన్మ సరిపోదు.
ఆ శ్రీనివాసుని నిత్య కల్యాణము, లోక హితము కొరకు. ఆ పవిత్ర కొండపై కల్యాణము చూడాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి. అయితే అనేక కారణాలు వలన అది ఏళ్ల వెళ్ళ సాధ్యం కాకపోయినా, ఆ స్వామి మనకై మార్గము సులువు చేస్తూ ఉంటాడు.
అమెరికాలోని డల్లాస్ శివార్లలో ఫ్రిస్కో లోని Dr. పెప్పర్ అరిన లో తిరుమల తిరుపతి దేవస్థానం (తే.తే.దే) వారిచే స్వామివారి కళ్యాణం జరగనున్నది. డల్లాస్ తిరుమలగా భాసిల్లే ఫ్రిస్కోలో ఈ కార్యక్రమం జరగడం రెండవ సారి. 2012లో తే.తే.దే జరిపిన శ్రీనివాసుని కల్యాణానికి ఏడు వేలకు పైగా భక్తులు వీచేశారు. ఈ ఏడాది పది వేలకు పైగా భక్తుల దర్శనార్థం సన్నాహాలు జరుగుతున్నాయి. తే.తే.దే వారి అర్చకులు, వేదం పండితులు, ఉత్సవ మూర్తులు పూజా సామగ్రి, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్వామివారి లడ్డు మరియు అమ్మవారి కుంకుమ.
కళ్యాణ ప్రాంగణము నందు ఎటువంటి అసౌకర్యము లేకుండా అన్ని వసతులు కల్పించడానికి శ్రీనివాస కళ్యాణ కార్యవర్గం కృషి చేస్తోంది. సుప్రభాత సేవ, తోమాల సేవ, వేదం మంత్రోచారణ, గోవింద నామస్మరణ, వేంకటేశ్వరుని కళ్యాణ ప్రాంగణం సాక్షాత్తూ ఆనంద నిలయాన్ని తలపించనుంది. దాతలు గృహస్తులు అయినచో కల్యాణాన్ని వారి చేతులతో జరుపగలరు.
భక్తులు అత్యధిక సంఖ్యలో వీచేసి ఆ దేవదేవుని కృపకు పాత్రులు అవ్వగలరని విజ్ఞ్యాప్తి. ఈ అరుదైన దైవ కార్యక్రమం మీకు అందిస్తున్నది తిరుమల తిరుపతి దేవస్థానం మరియు సనాతన ధర్మ ఫౌండేషన్.
మరిన్ని వివరాలకు మరియు పోషక వివరాలకు: www.sdfglobal.org వీచేయగలరు.
తేది: July 12th, 2015
సం: ఉదయం 8.00 నుండి మధ్యానం 3.00 వరకు
ప్రాంగణం: Dr. Pepper Arena
2601 Avenue of the Stars
Frisco, TX 75034
- Srinivasa Kalyanam Organizing Committee