pizza
WATS Sankranthi 2016
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

23 January 2015
Hyderabad

వాషింగ్టన్ రాష్టంలోని సియాటిల్ ప్రాంతంలోని తెలుగువారికి సాంస్కృతిక, సేవా కార్యక్రమాలను అందించటమే లక్ష్యంగా ఏర్పడిన వాషింగ్టన్ తెలుగు సమితి (WATS) ఆధ్వర్యంలో 2016 సంక్రాంతి సంబరాలు ఎంతో కన్నులపండుగగా జరిగాయి. 1300 మంది పైగా విచ్చేసిన ఈ వేడుకలను వాట్స్ ప్రెసిడెంట్ భాస్కర్ గంగిపాముల అధ్వర్యంలో కార్యనిర్వాహక బృందం రాం కొట్టి, అను గోపాళం, శ్రీధర్ దండాపంతుల, షకీల్ పొగాకు, అనిల్ పన్నాల, దేవేందర్ రెడ్డి విజయవంతంగా నిర్వహించారు. సంక్రాంతి పల్లె వాతావరణం ప్రతిబింబించేలా చేసిన అలంకరణ స్వంత ఊరిని తలపించి ఆహుతులందరినీ ఎంతగానో అలరించింది. ఈ వేడుకలను అమెరికాలోని ఇండియన్ అంబాసడర్ శ్రీ అరుణ్ కె.సింగ్ జ్యోతి ప్రజ్వలణతో ప్రారంభించారు. ఆయనతో పాటుగా బ్రిగెడియర్ అశోక్.కె.ధింగ్ర- మిలిటరీ అటాచే, ఎంబసీ ఆఫ్ ఇండియా, వాషింగ్టన్ డ్.సి, మరియు డా! కె. జె. శ్రీనివాస-డెప్యుటీ కౌన్సెల్ జెనరల్, కౌన్సెలెట్ జెనరల్ ఆఫ్ ఇండియా, శాంఫ్రాన్సిస్కొ కూడా విచ్చేసి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ముగ్గుల పోటీలు మరియ సాంప్రదాయ వస్త్రధారణ పోటీలలో అందరు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. శాస్త్రీయ మరియు సాంప్రదాయ నృత్య గానాలతో సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. అనుకున్న దానికంటే యెక్కువ మంది వచ్చినా ఎక్కడా తడబడక అందరికీ రుచికరమయిన స్నాక్స్ మరియు పసందయిన విందు భోజనం యేర్పాటు చేయగలిగారు రుచి రెస్టారెంట్ వారు. ఇండియా నిండి తెప్పించిన అరిసెలు, పూతరేకులు మరియు జంతికలు లాంటి పండుగ పిండివంటలు అందరికీ పంచి నిజమయిన సంక్రాంతి సందడి చేసింది WATS. 2015 కార్యనిర్వాహక సభ్యులు- వంశీ కంచరకుంట్ల, సాయిబాబ తాళ్ళూరి, నాగరాజు గౌరిశెట్టి లను 2016 బోర్డ్ ఘనంగా సత్కరించి వారి సహకారానికి కృతఙతలు తెలిపారు. భోజన విరామంలో నిర్వహించిన తెలుగు క్విజ్ లో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ పాల్గొని పండుగ సందడి తీసుకుని వచ్చారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరపటానికి సహకరించిన ప్రతి ఒక్క వాలంటీరుకు వాట్స్ బోర్డ్ తరపున కృతఙతలు తెలుపుకుంటున్నాము. మా భవిష్యత్తు కార్యక్రమాల్లో ఎవరయినా వాలంటీరు చేయదలచుకుంటే [email protected] ని సంప్రదించగలరు.

 

 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved