నటుడు జయప్రకాష్ గాయకుడుగా మారాడు. తన ఇష్ట దైవం శివునిపై పాటలు రచింప చేసి ఆ పాటలను తనే స్వయంగా పాడాడు. ఈ ఆల్బమ్‌కు 'శివ ప్రకాశం' అనే టైటిల్‌ను పెట్టారు. ఈ ఆల్బమ్‌ను ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యం విడుదల చేసి తొలి సీడీని ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్‌కు అందించారు. ఈ కార్యక్రమంలో ఇంకా డి.సురేష్‌బాబు, ధవళ సత్యం, సంగీత దర్శకుడు వీణాపాణి, కీర్తన మ్యూజిక్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
ఎస్.పి.బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ - ''నేను గాయకుడుగా అందరికీ సుపరిచితుడునే అయినా నాకు సంగీతం రాదంటే ఎవరూ నమ్మరు కానీ నాకు సా..పా..సా లు రావు. ఇక శివ ప్రకాశం ఆల్బమ్ విషయానికి వస్తే శివుడు అంటే అది గురువు. తొలి ఋషీశ్వరుడు, స్వయం శక్తి. అటువంటి భోళా శంకరుడుపై జయప్రకాష్‌గారు తనకు ఇష్టమైన ధోరణిలో పాటలు పాడారు. జొన్నవిత్తులగారు మంచి సాహిత్యాన్ని అందించారు. జయప్రకాష్ చేసిన మంచి ప్రయత్నానికి ఆ దేవుడు ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటున్నాను'' అన్నారు.
డి.సురేష్‌బాబు మాట్లాడుతూ - ''జయప్రకాష్‌రెడ్డిగారు నాకు చాలా కాలంగా నాకు మంచి మిత్రుడు. ఆయనకు నచ్చిన విధంగా పాటలు పాడారు. ఇలాంటి ప్రయత్నం చేసిన ఆయనకు అభినందనలు'' అన్నారు.
కె.విశ్వనాథ్ మాట్లాడుతూ - శివుడుపై పాటలు రాయించుకుని, వాటిని చక్కగా పాడిన జయప్రకాష్‌కు, అతనికి సహకారం అందించిన అందరికీ అభినందనలు'' అన్నారు.
వీణాపాణి మాట్లాడుతూ - ''జయప్రకాష్‌రెడ్డిగారికి శివుడుపై అపారమైన భక్తి భావం ఉంది. తన ఆల్బమ్ గురించిన అభిప్రాయాన్ని తెలియజేసినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది. అందుకే సాహిత్యానికి, గాయకుడుకి మధ్య సంధాన కర్తగా వ్యవహరించి నా వంతు సపోర్ట్ అందించాను'' అన్నారు.