17 October 2016
Hyderabad
ఇంటర్నేషనల్ క్లాసికల్ డ్యాన్సర్ హనీష్ హీరోగా, కన్నడ భామ చిరాశ్రీ హీరోయిన్‌గా శ్రీ కనకదుర్గా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ కె.సూర్యనారాయణ దర్శకత్వంలో ఎం.మారుతిప్రసాద్, ఎన్.రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'ఆమె.. అతడైతే`. యశోకృష్ణ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన దర్శకరత్న దాసరి నారాయణరావు ఆడియో సీడీలను విడుదల చేశారు.
సి.కల్యాణ్ మాట్లాడుతూ - ``టైటిల్ బావుంది. మంచి ఫీల్ కనపడుతుంది. ఇలాంటి ప్రయత్నం చేసిన దర్శకుడు సూర్యనారాయణ, నిర్మాతలు మారుతి ప్రసాద్, ఎన్.రాధాకృష్ణలను అభినందిస్తున్నాను`` అన్నారు.
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ - ``సినిమాకు ఏదీ అవసరమో దాన్ని ఇవ్వాలంటూ చెప్పిన వ్యక్తి దాసరి నారాయణరావుగారు. ఆయన సినిమాలు ఏవీ చూసినా సినిమాలకు తగ్గట్టే పాటలు కనపడతాయి. కానీ ఇప్పటి జనరేషన్ కమర్షియల్ సినిమా ట్రెండ్ అంటూ అవసరం ఉన్న లేకపోయినా కొన్ని ఎలిమెంట్స్‌ను జోడిస్తున్నారు. ఇన్ని చేసినా మంచి ఓపెనింగ్స్‌ను సాధించలేకపోతున్నారు. దాసరి నారాయణరావు, కె.విశ్వనాథ్ వంటి దర్శకులు చూపించిన దారిలో ట్రావెల్ అయితే చాలు. డిఫరెంట్ సబ్జెక్ట్‌తో రానున్న ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను.
హనీష్ మాట్లాడుతూ - ``నేను సినిమాలో హీరోగా చేస్తానని అనుకోలేదు. కానీ దర్శక నిర్మాతలు నాపై నమ్మకంతో నాకు ఈ సినిమాలో అవకాశం కల్పించినందుకు వారికి థాంక్స్. ఆడియో, సినిమాలను పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
యశోకృష్ణ మాట్లాడుతూ - ``సుద్దాల అశోక్‌తేజగారు అద్భుతమైన సాంగ్స్‌ను రాశారు. అన్ని సిచ్యువేషన్‌కు తగ్గట్టు ఉంటాయి. ఇందులో నాన్న సాంగ్ చాలా బాగా వచ్చింది. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్`` అన్నారు.
దర్శకుడు సూర్య నారాయణ మాట్లాడుతూ - ``దర్శకరత్న దాసరి నారాయణరావుగారు నేను తొలిసారి డైరెక్ట్ చేసిన సినిమాకు వచ్చి ఆశీర్వదించినందుకు ఆయనకు థాంక్స్. తెలుగు మీడియంలో డిగ్రీ చదువుకున్న ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్ కుర్రాడు కలెక్టర్ కావాలని కలలు కన్న తన తండ్రి ఆశయాన్ని కొడుకు ఎలా నెరవేర్చాడనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాను. తన లక్ష్యం కోసం సిటీకి వచ్చిన ఆ కుర్రాడు, తను అనుకున్న లక్ష్యాన్ని ఎలా సాధించాడు? అనే డిఫరెంట్ పాయింట్‌తో ఫుల్‌లెంగ్త్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. డిఫరెంట్ టైటిల్‌తో కథకి యాప్ట్ అయ్యేవిధంగా ఈ సినిమా వుంటుంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మా నిర్మాతలు మారుతీ ప్రసాద్, రాధాకృష్ణలు ఈ చిత్రాన్ని ఎంతో క్వాలిటీతో నిర్మించారు. క్లాసికల్ డ్యాన్సర్‌గా ఇంటర్నేషనల్ లెవల్‌లో గుర్తింపు పొందిన హనీష్‌ని హీరోగా పరిచయం చేస్తున్నాం. హనీష్ ఫెంటాస్టిక్‌గా నటించాడు. కన్నడలో ఉపేంద్ర, సుదీప్ సరసన హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించిన చిరాశ్రీ మా చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. యశో కృష్ణ కథకి తగ్గట్లుగా మంచి మ్యూజిక్‌ని అందించాడు. సుద్దాల అశోక్‌తేజ ఎక్స్‌లెంట్‌గా పాటల్ని రాశారు.
మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ సూపర్. తప్పకుండా ఈ చిత్రం సక్సెస్ అయి దర్శకుడిగా నాకు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను`` అన్నారు.
డా.దాసరి నారాయణరావు మాట్లాడుతూ - ``బడ్జెట్ సినిమాలు బాగా తీసినా థియేటర్స్ దొరకని కారణంగా తీసేస్తున్నారు.సినిమా బడ్జెట్‌కు రెట్టింపు ఖర్చు పెట్టి రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి బడ్జెట్ సినిమాలను టీవీల్లో కూడా చూడలేకపోతున్నాం. కారణం శాటిలైట్ హక్కులు కూడా అమ్ముడు కావడం లేదు. చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయాలనే ఆలోచన టీవీ యాజమాన్యాలకు లేకపోవడం బాధాకరం. పెద్ద సినిమాల స్థాయిలో బడ్జెట్ సినిమాలు ప్రమోషన్స్‌కు ఖర్చు పెట్టడం లేదు. చిన్న సినిమాల సక్సెస్‌కు కారణం మౌత్ టాక్. కాబట్టి నిర్మాతలు సినిమా పబ్లిసిటీ విషయంలో జాగ్రత్త వహించాలి. మంచి టైటిల్, హీరోకు మంచి బ్రేక్ తెచ్చే సినిమా అవుతుందని భావిస్తున్నాను. పాటలు బావున్నాయి. యశోకృష్ణ మంచి మ్యూజిక్ అందించాడు. నాకు ఇందులో మూడు పాటలు నచ్చాయి. దర్శకుడుఉ సూర్యనారాయణ మంచి హార్డ్ వర్కర్ అని తెలిసింది. పాటలు, వాటి సందర్భాలు చూస్తుంటే తను మంచి టాలెంటెడ్ అని తెలుస్తుంది. సుద్ధాల అశోక్ తేజ చాలా మంచి పాటలు రాశాడు. ఇందులో నాన్న పాటకు నేషనల్ అవార్డ్ రావడం ఖాయం. సినిమా యూనిట్‌ను అభినందిస్తున్నాను`` అన్నారు.
నిర్మాతలు ఎం.మారుతీప్రసాద్, ఎన్.రాధాకృష్ణ మాట్లాడుతూ - ''ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్‌తో దర్శకుడు సూర్యనారాయణ ఈ చిత్రాన్ని రూపొందించాడు. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం వుంటుంది. యశోకృష్ణ సూపర్‌హిట్ ఆల్బమ్ ఇచ్చాడు. ఆడియో, సినిమాను పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాం'' అన్నారు.
భానుచందర్, ఆలీ, తనికెళ్ల భరణి, సుధ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్: ఆరే. వెంకటేష్, పాటలు: సుద్దాల అశోక్‌తేజ, సంగీతం: యశోకృష్ణ, కెమెరా: హను కాక,నిర్మాతలు: ఎం. మారుతీప్రసాద్, ఎన్.రాధాకృష్ణ, కథ- స్క్రీన్‌ప్లే - మాటలు - దర్శకత్వం: కె.సూర్యనారాయణ