నారా రోహిత్, శ్రీ విష్ణు, తాన్యా హోప్ తారాగణంగా ఆరన్ మీడియా వర్క్స్ బ్యానర్‌పై సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో ప్రశాంతి, కృష్ణ విజయ్ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం `అప్పట్లో ఒకడుండేవాడు`. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో నారారోహిత్, శ్రీవిష్ణు, సత్య, బ్రహ్మాజీ, అజయ్, దర్శకుడు సాగర్ కె.చంద్ర, తాన్యా హోప్, ప్రభాస్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ
సందర్భంగా....
నిర్మాతలు మాట్లాడుతూ - ``కొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం. వెయ్యి సినిమాల్లో ఒకటిగా ఉండే చిత్రమిది. ఇలాంటి డిఫరెంట్ చిత్రాలు అరుదుగా వస్తుంటాయి.నారా రోహిత్‌గారు మంచి సపోర్ట్ అందించారు. అలాగే మిగిలిన నటీనటులు, టెక్నిషియన్స్ అందరూ చక్కగా సహకారంతో సినిమాను పూర్తి చేయగలిగాం. ప్రేక్షకులు ఈ కొత్త ప్రయత్నాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
బ్రహ్మాజీ మాట్లాడుతూ - ``చాలా డిఫరెంట్ సినిమా. నేను కూడా ఇలాంటి సినిమాల్లో యాక్ట్ చేయడం ఇదే ఫస్ట్‌టైమ్. ఇలాంటి సినిమాలు సక్సెస్ అయితే మరిన్ని కొత్త కాన్సెప్ట్ చిత్రాలు వస్తాయి. ఈ సినిమాలో కొత్త పాత్రలో కనపడతాను`` అన్నారు.
Tanya Hope Glam gallery from the event
అజయ్ మాట్లాడుతూ - ``నారా రోహిత్ నాకు ఫోన్ చేసి మంచి పాత్ర ఉంది చేస్తావా అన్నారు. ఇలాంటి సినిమాలో మరో రెండు సీన్స్‌లో నటించే ఉంటే బావుండేదనిపించింది. సినిమా కొత్తగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్ టు టీం`` అన్నారు.
నారా రోహిత్ మాట్లాడుతూ - ``ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను. సాయికార్తీక్ మంచి సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. కొత్త సబ్జెక్ట్. నా కెరీర్‌లో మరచిపోని చిత్రంగా నిలిచిపోతుంది. అందరి సపోర్ట్ మరచిపోలేం. అందరికీ థాంక్స్`` అన్నారు.
దర్శకుడు సాగర్ కె.చంద్ర మాట్లాడుతూ - ``ఈ సినిమా 1990 బ్యాక్ డ్రాప్‌లో సాగుతుంది. కొంత నక్సల్ నేపథ్యంలో కూడా ఉంటుంది. అప్పట్లో జరిగిన రియల్ ఘటనను బేస్ చేసుకుని కథ రాసుకున్నారు. లవ్, యాక్షన్, కామెడి సహా అన్నీ ఎలిమెంట్స్ ఉండే సినిమా. 1990 బ్యాక్‌డ్రాప్, ప్రస్తుతం పీరియడ్ చూపిస్తూ సాగే సినిమా. నారా రోహిత్ గారు పోలీస్ పాత్రలో కనపడతారు. రోహిత్‌గారి సపోర్ట్‌తోనే సినిమాను అనుకున్న విధంగా పూర్తి చేయగలిగాం`` అన్నారు.
ఈ చిత్రానికి ఎడిటింగ్ః కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీః నవీన్ యాదవ్, సంగీతంః సాయికార్తీక్, నిర్మాతలుః ప్రశాంతి, కృష్ణ విజయ్, రచన, దర్శకత్వంః సాగర్ కె.చంద్ర.