pizza
Dharma Yogi Music launch
'ధర్మయోగి'(ది లీడర్‌) పాట‌ల విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

21 October 2016
Hyderaba
d

'రఘువరన్‌ బి.టెక్‌' చిత్రంతో తెలుగులోనూ మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న హీరో ధనుష్‌ తాజాగా 'రైల్‌' చిత్రంతో ఓ డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చారు. ఈ దీపావళికి మరో డిఫరెంట్‌ మూవీతో ధనుష్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆర్‌.ఎస్‌.దురై సెంథిల్‌కుమార్‌ దర్శకత్వంలో తమిళ్‌లో రూపొందిన 'కొడి' చిత్రంలో తొలిసారి ధనుష్‌ ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రం 'ధర్మయోగి'(ది లీడర్‌) పేరుతో తెలుగులో విడుదల కానుంది. శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై యువ నిర్మాత సి.హెచ్‌.సతీష్‌కుమార్‌ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలోని పాట‌ల‌ను హైద‌రాబాద్‌లో శుక్ర‌వారం విడుద‌ల చేశారు. హీరో ధ‌నుష్ పాట‌ల సీడీని విడుద‌ల చేశారు.

నిర్మాత సి.హెచ్‌.సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ - ''ధనుష్‌ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన 'కొడి' చిత్రంపై చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి. తెలుగులో ధనుష్‌కి వున్న ఫాలోయింగ్‌ అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగులో 'ధర్మయోగి' పేరుతో విడుదల చేస్తున్నాం. ఈ చిత్రంలో ధనుష్‌ చేసిన రెండు క్యారెక్టర్స్‌ పూర్తి విభిన్నంగా వుంటాయి. ఈ చిత్రంలో త్రిష, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా, తమిళ్‌ స్టార్‌ హీరో విజయ్‌ తండ్రి ఎస్‌.ఎ.చంద్రశేఖర్‌ ఓ ప్రత్యేక పాత్రను చేయడం విశేషం. . సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 'కబాలి' చిత్రానికి సంగీతాన్ని అందించిన సంతోష్‌ నారాయణన్‌ ఈ చిత్రానికి అద్భుతమైన పాటలు చేశారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి దీపావళి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగులో 500కి పైగా థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తున్నాం. త్రిష ఈ సినిమా నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర‌లో చేస్తోంది. ఈ చిత్రం పెద్ద హిట్‌ అయి మా విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌కి మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను'' అన్నారు.

Glam galleries from the event

మ‌ల్కాపురం శివ‌కుమార్ మాట్లాడుతూ ``ఈ సినిమా నైజాంలో నేనే విడుద‌ల చేస్తున్నాను. మంచి హిట్ అవుతుంద‌ని ఆశిస్తున్నాను`` అని చెప్పారు.

రామ‌జోగ‌య్య‌శాస్త్రి మాట్లాడుతూ ``ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను త‌మిళంలో ధ‌నుష్ పాడారు. తెలుగులో కూడా ఆయ‌నే పాడి ఉంటే బావుండేది`` అని అన్నారు.

ఆర్పీ ప‌ట్నాయ‌క్ మాట్లాడుతూ ``ధ‌నుష్ కొల‌వెరి పాట‌తో క్రేజ్ సంపాదించుకున్నారు. ఆయ‌న ముంబై వెళ్తే జీ వాళ్లు అర‌పూట అక్క‌డివారికి సెల‌వులు ఇచ్చారు. అదీ ధ‌నుష్ స్టామినా. ఆయ‌న సౌత్ ఇండియ‌న్ స్టార్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది`` అని అన్నారు.

దామోద‌ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ ``ధ‌నుష్ సినిమా అన‌గానే స్ట్ర‌యిట్ సినిమా అనే ఫీలింగ్ వ‌చ్చేస్తుంది. ఆయ‌న సినిమాలు ఇక్క‌డ కూడా అంతే క‌లెక్ట్ చేస్తున్నాయి`` అని చెప్పారు.

రాజ్ కందుకూరి మాట్లాడుతూ ``ధ‌నుష్ తెలుగులోనూ ఓ స్ట్ర‌యిట్ చిత్రం చేస్తే బావుంటుంది`` అని అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో సురేష్ కొండేటి, రాజ్ మాదిరాజుతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: వెంకటేష్‌ ఎస్‌., ఎడిటింగ్‌: ప్రకాష్‌ మబ్బు, సంగీతం: సంతోష్‌ నారాయణన్‌, సమర్పణ: శ్రీమతి జగన్మోహిని, నిర్మాత: సి.హెచ్‌.సతీష్‌కుమార్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆర్‌.ఎస్‌.దురై సెంథిల్‌కుమార్‌.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved