సూపర్‌గుడ్ ఫిలింస్(ఆర్.బి.చౌదరి) సమర్పణలో లెజెండ్ సినిమా బ్యానర్‌పై శ్రీనివాస్ రవీంద్ర దర్శకత్వంలో ప్రద్యుమ్న, గణేష్ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'ద్వారక`. సాయికార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి.చౌదరి, పారస్ జైన్, ఆదిత్య మ్యూజిక్ ఉమేష్ గుప్తా, నిర్మాతలు ప్రద్యుమ్న, గణేష్, హీరో విజయ్ దేవరకొండ, రాజ్‌కందుకూరి, నందినీ రెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ, ఆర్.పి.పట్నాయక్, వంశీ పైడిపల్లి, పరుచూరి ప్రసాద్, ఎన్.వి.ప్రసాద్, శ్రీనివాసరెడ్డి, మారుతి, ఉత్తేజ్, పృథ్వీ, భరత్ పిక్చర్స్ భరత్, కె.పి.చౌదరి, శ్రీవాస్, కె.దశరథ్ తదితరులు పాల్గొన్నారు.
వంశీ పైడిపల్లి, శ్రీవాస్, కె.దశరథ్ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.
బిగ్‌సీడీ, ఆడియో సీడీలను సూపర్ గుడ్ పిలింస్ అధినేత ఆర్.బి.చౌదరి విడుదల చేశారు.
రాజ్ కందుకూరి మాట్లాడుతూ - ``విజయ్ దేవరకొండకు ద్వారక టైటిల్ చాలా యాప్ట్‌గా ఉంది. విజయ్ మంచి వ్యక్తే కాదు..మంచి హార్డ్ వర్కర్. సబ్జెక్ట్స్ సెలక్షన్ విషయంలో సెలక్టెడ్‌గా ఉన్నాడు. పెళ్లిచూపులు తర్వాత విజయ్‌పై చాలా మంది చాలా నమ్మకంగా ఉన్నారు. ఆ నమ్మకం తగ్గని విధంగా సినిమా ఉంటుంది. ఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్`` అన్నారు.'
నందినీ రెడ్డి మాట్లాడుతూ - ``సాయికార్తీక్‌కు ఆల్ ది బెస్ట్. `ద్వారక`కు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. విజయ్ ఈ సినిమాతో మరో సక్సెస్‌ను అందుకున్నాడు. `పెళ్లిచూపులు` తర్వాత విజయ్‌కు `ద్వారక` మరో మంచి సక్సెస్ అవుతుంది. నిర్మాతలకు ఈ సినిమా మంచి లాంచ్ అవుతుందని భావిస్తున్నాను`` అన్నారు.
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ - ``నిర్మాత ప్రద్యుమ్నను చూస్తుంటే సినిమాను ఎలా సక్సెస్ చేసుకోవాలో బాగా తెలిసిన వ్యక్తిగా కనపడుతున్నాడు. సాయికార్తీక్ క్రేజీ మ్యూజిక్ అందించాడు. దర్శకుడు ఎం.ఎస్.ఆర్ ఐదేళ్ళ నుండి ఈ సినిమాను తయారుచేసుకున్నాడు. మంచి సబ్జెక్ట్. నా ఆఫీస్‌లో పుట్టింది. సూపర్‌గుడ్ సమర్పణలో రానున్న ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది`` అన్నారు.
ఆర్.పి.పట్నాయక్ మాట్లాడుతూ - ``నిర్మాత ప్రద్యుమ్న గురించి నాకు బాగా తెలుసు. విజయ్ లాంటి సక్సెస్‌ఫుల్ హీరోతో చేస్తున్న ద్వారక సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది. దర్శకుడు ఎం.ఎస్.ఆర్ కు, సాయికార్తీక్ మంచి మ్యూజిక్ అందించాడు.టీంకు ఆల్ ది బెస్ట్`` అన్నారు.
ఎన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ - ``చిరంజీవిగారి చేతుల మీదుగా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశాం. సినిమా పెద్ద సెన్సేషనల్ హిట్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
పరుచూరి ప్రసాద్ మాట్లాడుతూ - ``పాటలు చాలా బావున్నాయి. సాయికార్తీక్ మంచి మ్యూజిక్ అందించాడు. ప్రద్యుమ్న నాకు మంచి మిత్రుడు. సినిమా పెద్ద హిట్ సాధించాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
మారుతి మాట్లాడుతూ - ``దర్శకుడు ఎం.ఎస్.ఆర్ గారు మంచి క్రేయేటివ్ ఉన్న వ్యక్తి. విజయ్, ఎం.ఎస్.ఆర్‌కు సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
శ్రీవాస్ మాట్లాడుతూ - ``ఈ సినిమాకు, నాకు దగ్గర సంబందం ఉంది. ద్వారక చిత్ర దర్శకుడు, నిర్మాతలు నాకు బాగా కావాల్సిన వ్యక్తులు. దర్శకుడు ఎం.ఎస్.ఆర్‌కు నేను చేసిన సినిమాలతో మంచి అనుబంధం ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తను సినిమా చేయాలనుందని అంటుండేవాడు. ఒకసారి ఓ పాయింట్ చెప్పాడు. ఆ పాయింట్ నచ్చింది. ఈ పాయింట్‌ను వినమని ప్రద్యుమ్నకు చెప్పాను. ఆ పాయింట్ ప్రద్యుమ్నకు కూడా నచ్చడంతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. పెళ్లిచూపులు సినిమాకంటే ముందే ఈ సినిమాను గ్రాండ్‌గా చేయడానికి ప్లాన్ చేశారంటే కథపై దర్శక నిర్మాతలకు ఉన్న నమ్మకం ఏంటో తెలుస్తుంది. వీరి ప్రయత్నానికి ఆర్.బి.చౌదరిగారి ఆశీస్సులు దొరకడం అదృష్టం. ఎం.ఎస్.ఆర్ సినిమాను బాగా తీశాడు. భవిష్యత్‌లో ఈ టీం మరిన్ని మంచి సినిమాలు చేయాలి. సాయికార్తీక్ మంచి మ్యూజిక్ ఇవ్వగా, సినిమాటోగ్రాఫర్ మంచి క్వాలిటీ సినిమాటోగ్రఫీని అందించాడు`` అన్నారు.
కె.దశరథ్ మాట్లాడుతూ - ``ప్రద్యుమ్న ఆర్టిస్ట్ కావాలనుకుని వచ్చి నిర్మాత అయ్యాడు. `ద్వారక` వంటి మంచి సినిమాతో ప్రద్యుమ్న నిర్మాత అవుతున్నందుకు తనకు అభినందనలు. ఎం.ఎస్.ఆర్ దర్శకుడు కాకముందు నా సినిమాలకు కూడా వర్క్ చేశాడు. కమర్షియల్‌గా ఉంటూనే కొత్త ఆలోచనతో ఉన్న సినిమాను చేశాడు ఎం.ఎస్.ఆర్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సాయికార్తీక్ చాలా మంచి సంగీతానందించాడు. `పెళ్లిచూపులు` చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న విజయ్ దేవరకొండకు ద్వారక పెద్ద సక్సెస్ తెచ్చిపెడుతుంది. అలాగే హీరోయిన్ పూజా జవేరి సహా యూనిట్‌కు కంగ్రాట్స్`` అన్నారు
వంశీ పైడిపల్లి మాట్లాడుతూ - ``సాయికార్తీక్ చాలా మంచి మ్యూజిక్ అందించాడు. దర్శకుడు ఎం.ఎస్.ఆర్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. శ్యామ్ కె.నాయుడు, ఎడిటర్ ప్రవీణ్‌పూడి, బ్రహ్మకడలి వంటి మంచి టెక్నిషియన్స్ ఈ సినిమాకు పనిచేశారు. నా జీవితంలో ద్వారక ఎలాంటి మార్పు తెచ్చిందో ఈ `ద్వారక` సినిమా యూనిట్‌కు అంత మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
సాయికార్తీక్ మాట్లాడుతూ - ``నేను మాస్ సాంగ్స్ నే బాగా కంపోజ్ చేస్తానని చాలా మంది అనుకుంటుంటే నాకు `ద్వారక` సినిమాతో మెలోడి మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. అన్నీ వేరియేషన్స్ ఉన్న సాంగ్స్ చేశాను. మ్యూజిక్ విషయంలో నన్ను సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్. పెళ్లిచూపులు తర్వాత ద్వారక సినిమా విజయ్‌కు మంచి పేరు తెస్తుంది`` అన్నారు.
దర్శకుడు ఎం.శ్రీనివాస్ రవీంద్ర మాట్లాడుతూ - `` ద్వారక అంటే శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడంటే ప్రేమ. ఈ సినిమాలో హీరో ఒక దొంగ. ఒక అమ్మాయిని ప్రేమిస్తే, అతని లైఫ్‌లో వచ్చిన మార్పేంటనేదే కథ. నిర్మాతలు ప్రద్యుమ్న, గణేష్‌లుకథను మాత్రమే నమ్మి సినిమా చేశారు. ఆర్.బి.చౌదరిగారు అండగా నిలబడ్డారు. విజయ్‌లో నటనలో కొత్త కోణాన్ని చూపించే చిత్రం హీరోయిన్ పూజా చక్కగా నటించింది. సాయికార్తీక్ టాలెంట్‌కు రావాల్సిన పేరైతే రాలేదని అనుకుంటున్నాను. ఈ సినిమా విషయంలో సాయికార్తీక్ సంగీతానికి చాలా మంచి పేరు వస్తుంది. శ్యామ్ కె.నాయుడు, ప్రవీణ్ పూడి, బ్రహ్మకడలి, లక్ష్మీభూపాల్ సహా అందరూ బాగా సపోర్ట్ చేశారు.
ఆర్.బి.చౌదరి మాట్లాడుతూ - ``మా సూపర్‌గుడ్ ఫిలింస్ బ్యానర్‌లో చాలా మంది కొత్త దర్శకులను, నిర్మాతలను పరిచయం చేశాం. అదేవిధంగా `ద్వారక` సినిమాతో ప్రద్యుమ్న, గణేష్‌లను నిర్మాతలుగా పరిచయం చేయడం ఆనందంగా ఉంది. అలాగే దర్శకుడు ఎం.శ్రీనివాస్ రవీంద్రను కూడా పరిచయం చేయడం సంతోషంగా ఉంది. హీరో విజయ్, హీరోయిన్ పూజా, సాయికార్తీక్ సహా టీం అందరికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు.
నిర్మాత ప్రద్యుమ్న మాట్లాడుతూ - ``చాలా ఎమోషనల్‌గా ఉంది. మెగాస్టార్ చిరంజీవిగారిని కలిసి మేం `ద్వారక` అనే చిన్న సినిమా చేశాం. మా ప్రయత్నానికి మీ ఆశీర్వాదం కావాలని కోరగానే, చిరంజీవిగారు ఏమాత్రం కాదనకుండా మోషన్ పోస్టర్‌ను విడుదల చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. ప్రొడక్షన్ విషయంలో ఆర్.బి.చౌదరిగారు ఓ టీచర్‌లా నన్ను గైడ్ చేశారు. `ద్వారక` సినిమా నా లైఫ్‌లో చౌదరిగారు ఇచ్చిన గొప్ప వరం. శ్యామ్‌గారు సినిమాటోగ్రఫీనే కాకుండా ప్రొడక్షన్ బాధ్యతలను కూడా భుజానేసుకున్నారు. సినిమా ఇంత బాగా రావడానికి శ్యామ్ కె.నాయుడు కారణం. సాయికార్తీక్ డిఫరెంట్ మ్యూజిక్ అందించాడు. దర్శకుడు ఎం.ఎస్.ఆర్‌గారు అద్భుతమైన కథనందించారు. అలాగే విజయ్, పూజా, ప్రకాష్ రాజ్‌గారు, ప్రవీణ్ పూడి సహా అంరదూ బాగా సపోర్ట్ చేశారు, అందరికీ థాంక్స్`` అన్నారు.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ - ``ముందు నాకు నచ్చిన యాక్టింగ్ చేసుకూంటూ సినిమాల్లో అవకాశాలు కోసం తిరిగే నాకు సినిమా హీరోగా అవకాశాలు రావేమో అనుకుని అసిస్టెంట్ డైరెక్టర్‌గానో, డైరెక్టర్‌గానో సినిమాలు చేద్దామనిపించి స్క్రిప్ట్స్ రాసుకుంటున్నాను. కానీ రెండేళ్లలో పరిస్థితి మారిపోయింది. ఆర్.బి.చౌదరి గారు సహా పెద్ద పెద్దవాళ్లు నా గురించి మాట్లాడుతున్నారు. శ్యామ్ తన సినిమాటోగ్రఫీతో మ్యాజిక్ చేశారు. అలాగే సాయికార్తీక్‌గారు డ్యాన్సింగ్ చేసే మ్యూజిక్ అందించాడు. ఎం.ఎస్.ఆర్‌గారు అద్భుతమైన కథను రాస్తే..ఆర్.బి.చౌదరిగారు, ప్రద్యుమ్నగారు సినిమాకు అండగా నిలబడ్డారు. అందరికీ నచ్చే సినిమా అవుతుందని నమ్ముతున్నాను`` అన్నారు.
విజయ్ దేవరకొండ, పూజ జవేరి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, మురళీ శర్మ, పృథ్వీ, రఘుబాబు, ప్రభాకర్, కృష్ణభగవాన్, షకలక శంకర్, ఉత్తేజ్, నవీన్, గిరిధర్ తదితరులు ఇతర తారాగణంగా నటించిన ఈ చిత్రానికి మాటలు: లక్ష్మీభూపాల్,చ ఫైట్స్: విజయ్, ఆర్ట్: బ్రహ్మకడలి, ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి, సినిమాటోగ్రఫీ: శ్యామ్.కె.నాయుడు, సంగీతం: సాయికార్తీక్, నిర్మాతలు: ప్రద్యుమ్న, గణేష్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాస్ రవీంద్ర(ఎం.ఎస్.ఆర్).