నవీన్ గౌతమ్, ప్రియాంక, సరయు, చలపతిరావు, సమీర్ తదితరులు ప్రధాన తారాగణంగా బషీరమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎస్.బాబ్జీ దర్శకత్వంలో ఎస్.కె.రెహమాన్(చంటి) నిర్మించిన చిత్రం `ఎవరో తానెవరో`. ఈ సినిమా ఎస్.శ్రీరాం సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ప్రతాని రామకృష్ణాగౌడ్ ఆడియో సీడీలను విడుదల చేయగా, తొలి సీడీని చలపతిరావు అందుకున్నారు. ఈ సందర్భంగా...
నటుడు చలపతిరావు మాట్లాడుతూ -``చిన్న సినిమాలు ఆడాలని కోరుకునే వాళ్ళలో నేను ఒకడిని. అందుకే నిర్మాత రెహమాన్ అడగ్గానే సినిమా చేయడానికి అంగీకరించాను. టీం అందరూ బాగా కష్టపడి చేసిన సినిమా. రెహమాన్ చాలా కష్టపడి సినిమాను ఈ స్టేజ్‌కు తీసుకువచ్చాడు. సినిమా పాటలు బావున్నాయి. బాబ్జీ కష్టపడి సినిమాను చక్కగా చిత్రీకరించాడు. సినిమా పెద్ద సక్సెస్ కావాలని దర్శకుడు బాబ్జీ, నిర్మాత రెహమాన్‌కు అభినందనలు తెలియజేస్తున్నాను`` అన్నారు.
Sony Charishta Glam gallery from the event
ప్రతాని రామకృష్ణాగౌడ్ మాట్లాడుతూ - ``సినిమా పాటలు, ట్రైలర్ బావుంది. సినిమా కూడా బావుంటుందని ఆశిస్తున్నాను. రెహమాన్ సినిమాను తెరకెక్కించడమే కాదు, ఇందులో కమెడియన్‌గా చక్కటి క్యారెక్టర్ కూడా చేశాడు. సినిమా విడుదలకు థియేటర్స్ విషయంలో నైజాంలో నా వంతు సహకారాన్ని అందిస్తాను`` అన్నారు.
దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ - ``పదకొండేళ్లుగా ఇండస్ట్రీలోనే దర్శకుడు కావాలని ఎంతో కష్టపడ్డాను. రెహమాన్‌గారు దర్శకుడిగా నాకు తొలి అవకాశం ఇచ్చారు. సినిమాను ఈ స్థాయికి తీసుకొచ్చారంటే ఆయన పడ్డ కష్టమెంటో తెలుసు. అందరం కష్టపడి ఓ మంచి సినిమాను చేశామని భావిస్తున్నాం. ప్రేక్షకులు మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. శ్రీరాం మంచి సంగీతానందించారు. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్`` అన్నారు.
నిర్మాత ఎస్.కె.రెహమాన్ మాట్లాడుతూ - ``నాకు సినిమాలంటే ఉన్న ఆసక్తితోనే ఈ సినిమాకు నిర్మాతగా మారడమే కాకుండా ఇందులో చిన్న పాత్రలో నటించాను. హీరో హీరోయిన్లు కొత్త వారైన ఎంతో చక్కగా యాక్ట్ చేశారు. దర్శకుడు బాబ్జీగారు సినిమాను బాగా తీశారు. మా ప్రయత్నాన్ని అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.శ్రీరాం మాట్లాడుతూ - `` ఈ సినిమాలో నాకు మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్`` అన్నారు.
సినిమాతో మంచి గుర్తింపు వస్తుందని హీరో నవీన్ గౌతమ్, హీరోయిన్ ప్రియాంక తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సమీర్ సహా ఇతర చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు.