pizza
Gautam Nanda music launch
`గౌత‌మ్ నంద‌` పాట‌ల వేడుక‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

16 July 2017
Hyderabad

హీరో గోపీచంద్, హ్యాట్రిక్ డైరెక్టర్ సంపత్ నందిల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సూపర్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ "గౌతమ్ నంద". హన్సిక, కేతరీన్ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూలై 28న విడుదలవుతుంది. ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం ఆదివారం హైద‌రాబాద్‌లో విడుద‌లైంది. ఆడియో సీడీల‌ను హీరోయిన్ క్యాథ‌రిన్ విడుద‌ల చేసి తొలి సీడీని గోపీచంద్‌కు అందించింది.

ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్ మాట్లాడుతూ - ``గౌత‌మ్ నంద సినిమా ష్యూర్‌గా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవుతుంది. అంద‌రికీ స‌క్సెస్ ఇంపార్టెంట్‌. గౌత‌మ్ నంద క్యారెక్ట‌ర్స్ ఎలా తెర‌పై ఉండ‌బోతుంద‌నే ఎగ్జ‌యిట్‌మెంట్ ఉంది. సౌంద‌ర్‌రాజ‌న్ సినిమాటోగ్ర‌ఫీ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అద్భుతమైన విజువ‌ల్స్ ఇచ్చాడు. సంప్ నంది ఎక్స్‌ట్రార్డినరీగా మ్యూజిక్‌ను రాబ‌ట్టుకున్నారు. గోపీచంద్‌తో ర‌ణం, ఆంధ్రుడు సినిమాల‌కు కీ బోర్డ్ ప్లేయ‌ర్‌గా ప‌నిచేశాను. శంఖం సినిమా త‌ర్వాత గోపీచంద్‌తో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా చేసిన మూవీ ఇది. సంప‌త్ స‌క్సెస్ ఫుల్ మూవీ చేశాడ‌ని క‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌ను. టీంకు అభినంద‌న‌లు`` అన్నారు.

బ్ర‌హ్మ క‌డలి మాట్లాడుతూ - ``సినిమాను చాలెంజింగ్‌గా తీసుకుని వ‌ర్క్ చేశాను. అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.

క్యాథ‌రిన్ మాట్లాడుతూ - ``థ‌మ‌న్ అద్భుత‌మైన సంగీతం అందించాడు. ప్ర‌తి సాంగ్ చాలా డిఫ‌రెంట్ గా ఉంది. యూనివ‌ర్స‌ల్ పాయింట్‌తో సంప‌త్ నందిగారు సినిమాను తెర‌కెక్కించారు. ఈ సినిమాలో నాకు కూడా అవ‌కాశం ఇచ్చినందుకు ఆయ‌న‌కు థాంక్స్. గోపీచంద్‌తో తొలిసారి వర్క్ చేశాను. త‌ను న‌టించిన సినిమాలు చాలానే చూశాను. స్టైలిష్ లుక్‌లో క‌న‌ప‌డ‌తాడు. ఇంత‌కు ముందు ఏ సినిమాలో క‌న‌ప‌డ‌ని విధంగా గోపీచంద్ క‌న‌ప‌డ‌తాడు. భ‌గ‌వాన్‌, పుల్లారావుల‌కు థాంక్స్‌`` అన్నారు.

నిర్మాత భ‌గ‌వాన్ మాట్లాడుతూ -థ‌మ‌న్ చాలా అంద‌మైన సంగీతాన్ని అందించారు. సౌంద‌ర్ రాజ‌న్ అద్భుత‌మైన సినిమాటోగ్ర‌ఫీ అందించారు. సంప‌త్ నందిగారు చెప్పిన క‌థ అంద‌రికీ న‌చ్చింది. ముందు ఒక బ‌డ్జెట్ అనుకుని సినిమా స్టార్ట్ చేశాం. తొలి షెడ్యూల్ పూర్త‌యిన త‌ర్వాత మాకు న‌మ్మ‌కం పెరిగింది. దాంతో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను తెర‌కెక్కించాం. సినిమాను చూశాం. డెఫ‌నెట్‌గా మూవీ పెద్ద హిట్ అవుతుందని కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. 90 రోజుల్లో సినిమాను పూర్తి చేయాల‌నుకున్నాం. కానీ 115 రోజులు ప‌ట్టింది. కానీ గోపీచంద్‌గారు ఎంతో బాగా స‌పోర్ట్ చేశారు`` అన్నారు.

Glam galleries from the event

 

సంప‌త్ నంది మాట్లాడుతూ - ``భ‌గ‌వాన్ శ్రీ ర‌మ‌ణ మ‌హ‌ర్షి అక్ష‌రాల్లోని ఒక ఐడియాను తీసుకుని, క‌మ‌ర్షియ‌ల్‌గా ఈ సినిమా క‌థ‌ను త‌యారు చేసుకున్నాం. మన ఇండియాలో ఓ ఏడాదిలో అన్ని సినిమాలు క‌లిపి దాదాపు 700 సినిమాలు విడుద‌ల‌వుతాయి. ఇన్ని సినిమాల్లో గౌత‌మ్ నంద క‌లెక్ష‌న్స్ ప‌రంగా ఏ స్థానంలో ఉంటుందో నాకు తెలియ‌దు కానీ, త‌ప్ప‌కుండా టాప్ ట‌న్ మంచి సినిమాల్లో గౌత‌మ్ నంద ఉంటుంది. క‌థ‌ను న‌మ్మిఇంత ధైర్యంగా చెబుతున్నాను. ఇంత‌కు ముందు నాకు పెద్ద హిట్స్ వ‌చ్చినా, క‌థల రూపంలో ఈ సినిమా ఇచ్చినంత న‌మ్మ‌కాన్ని మ‌రే సినిమా ఇవ్వ‌లేదు. ఈ క‌థ విన‌గానే, ఒక అక్ష‌రం కూడా మార్చకుండా ఎలా చెబితే అలా సినిమా తీస్తే చాలని హీరో గోపీచంద్ అన్నారు. గోపీచంద్ అభిమానులంద‌రూ, చాలా రోజులు త‌ర్వాత గోపీచంద్‌గారి విశ్వ‌రూపం చూస్తారు. సౌంద‌ర్‌రాజ‌న్‌గారు కూడా ఈ క‌థ విన్న త‌ర్వాత నాతో పాటు ట్రావెల్ అయ్యారు. థ‌మ‌న్‌, సౌండ్ గొప్ప‌త‌న‌మేంటో ఈసినిమాలో చూపించాడు. అద్భుత‌మైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. హ‌న్సిక‌, క్యాథ‌రిన్‌లు ఎంతో చ‌క్క‌గా న‌టించారు. ఈ సినిమాలో ప్ర‌తి షాట్‌లో మా నిర్మాత‌లే క‌న‌ప‌డ‌తారు. బ్యాంకాక్ షెడ్యూల్ త‌ర్వాత క‌థ‌ను న‌మ్మాం, కాబ‌ట్టి బ‌డ్జెట
్ విష‌యంలో కాంప్ర‌మైజ్ కాలేదు. అంత మంచి నిర్మాత‌లు భ‌గ‌వాన్‌, పుల్లారావు. జూలై 28న విడుద‌ల‌వుతున్న ఈసినిమా అంద‌రినీ ఎంట‌ర్ టైన్ చేస్తుంద‌ని భావిస్తున్నాను`` అన్నారు.

హీరో గోపీచంద్ మాట్లాడుతూ - ``చాలా రోజుల త‌ర్వాత చాలా మంచి సినిమా చేశాను. తృప్తిగా ఉంది. రామ్ ల‌క్ష్మ‌ణ్ మాస్ట‌ర్స్ కిక్ ఉన్న పైట్స్ కంపోజ్ చేశారు. నిర్మాత‌లు పుల్లారావు, భ‌గ‌వాన్‌ మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. క‌థ‌ను న‌మ్మి సినిమా చేశారు. వీరితో మ‌రో సినిమా చేయాల‌నుంది. సౌంద‌ర్‌రాజ‌న్, నేను పని చేసిన సినిమాటోగ్రాఫ‌ర్స్‌లో ది బెస్ట్ సినిమాటోగ్రాఫ‌ర్‌. అలాగే శంఖం త‌ర్వాత థ‌మ‌న్‌తో వ‌ర్క్ చేసిన సినిమా ఇది. సూప‌ర్బ్ సాంగ్స్‌. అంత కంటే గొప్ప బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. సంప‌త్‌గారు క‌థ చెప్పిన‌ప్పుడు, సంప‌త్ నందిని హ‌గ్ చేసుకోవాల‌నిపించింది. త‌ను కథ ఏదైతే చెప్పాడో, దాన్ని అదేవిధంగా తెర‌కెక్కించాడు. సంప‌త్ డేడికేష‌న్ ఉన్న డైరెక్ట‌ర్‌. త‌న‌తో ఎప్పుడైనా చేయ‌డానికి నేను రెడీ. సంత‌ప్ ఆలోచ‌న‌లు, విజ‌న్ సూప‌ర్బ్‌గా ఉన్నాయి. డెఫ‌నెట్‌గా హిట్ అవుతుంద‌ని గుండెపై చేయి వేసుకుని చెబుతున్నాను. చాలా రోజుల త‌ర్వాత నేను చ‌క్క‌గా యాక్ట్ చేశాన‌ని తృప్తి నిచ్చిన సినిమా ఇది. రేంజ్ నాకు తెలియ‌దు కానీ, త‌ప్ప‌కుండా డిస‌ప్పాయింట్ కార‌ని చెప్ప‌గ‌ల‌ను`` అన్నారు. గోపీచంద్, హన్సిక, కేతరీన్, నికితన్ ధీర్, తనికెళ్లభరణి, వెన్నెల కిషోర్, అజయ్, ముఖేష్ రుషి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వర్రావు, స్క్రిప్ట్ కోఆర్డినేటర్: సుధాకర్ పవులూరి, కళ: బ్రహ్మ కడలి, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, ఎడిటింగ్: గౌతమ్ రాజు, సినిమాటోగ్రఫీ: ఎస్.సౌందర్ రాజన్, నిర్మాతలు: జె.భగవాన్-జె.పుల్లారావు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: సంపత్ నంది.Photo Gallery (photos by G Narasaiah)

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved