pizza
Gunturodu music launch
`గుంటూరోడు` ఆడియో విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

29 January 2017
Hyderaba
d

క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై రాకింగ్ స్టార్ మంచు మ‌నోజ్ హీరోగా, బ్యూటిఫుల్ ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్ గా, ఎస్‌.కె.సత్య ద‌ర్శ‌క‌త్వంలో వ‌రుణ్ అట్లూరి నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `గుంటూరోడు`. శ్రీ వ‌సంత్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం ఆదివారం హైద‌రాబాద్‌లో విడుద‌లైంది.

ఈ కార్య‌క్ర‌మంలో డా.మంచు మోహ‌న్‌బాబు, మంచు విష్ణు, మంచు మ‌నోజ్‌, శ‌ర్వానంద్‌, సాయిధ‌ర‌మ్ తేజ్ విజ‌య్ ఏసుదాసు, ప్ర‌గ్యా జైశ్వాల్‌, సుర‌భి, జెమినికిర‌ణ్‌, కాశీవిశ్వ‌నాథ్‌, డైరెక్ట‌ర్ ప‌రుశురాం, కొండా విజ‌య్‌కుమార్‌, అట్లూరి బాల‌ప్ర‌సాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు. బిగ్ సీడీ, ఆడియో సీడీల‌ను డా.మంచు మోహ‌న్‌బాబు విడుద‌ల చేశారు.

డా.మంచు మోహన్‌బాబు మాట్లాడుతూ - ``డైలాగ్స్‌, ట్రైల‌ర్ చూస్తుంటే అద్భుతంగా ఉంది. ద‌ర్శ‌కుడు చాలా బాగా రాశాడు. నిర్మాత చాలా బాగా ఖ‌ర్చు పెట్టి సినిమాను నిర్మించాడు. మంచి కథ అని మనోజ్ చెప్పాడు. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి నిర్మాత‌ల‌కు మంచి లాభాల‌ను తేవాల‌ని కోరుకుంటున్నాను. నా బ్యాన‌ర్‌లో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన సత్యంగారి మ‌న‌వ‌డు శ్రీవ‌సంత్ ఈ సినిమాకు సంగీతం అందించ‌డం ఆనందంగా ఉంది. గుంటూరోడు సినిమా పెద్ద విజ‌యం సాధించాల‌ని కోర‌కుంటూ యూనిట్ అంద‌రికీ అభినంద‌న‌లు`` అన్నారు.

మంచు మ‌నోజ్ మాట్లాడుతూ - ``రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేయాల‌ని న‌న్ను సోష‌ల్ మీడియా ద్వారా అడుగుతుంటారు. నేను ప‌దకొండేళ్ళ వ‌య‌సులో న‌టించాను. 2004లో హీరోగా ప‌రిచ‌యం అయ్యాను. ప‌ద‌మూడేళ్ల ఈ జ‌ర్నీలో 18 సినిమాలు చేశాను. కానీ మా నాన్న‌గారు ఆత్మ‌గౌర‌వం, ఆత్మ‌మాభిమానం, సంతృప్తి అనేవి న‌టుడుకి చాలా ముఖ్య‌మ‌ని చెబుతుంటారు. స‌క్సెస్ ఫెయిల్యూర్‌లో వ‌ర్క్‌ను ఎంజాయ్ చేయ‌మ‌ని అంటుంటారు. అందుకే ఇప్ప‌టి వ‌ర‌కు నేను చేసిన సినిమాల్లో ఒక మంచి పాత్ర చేయాల‌ని ప్ర‌య‌త్నించాను. న‌టుడిగా నిరూపించుకోవాల‌నే వ‌చ్చాను త‌ప్ప‌, ఏదో పెద్ద హీరో అయిపోవాల‌ని రాలేదు. నాకు వ్యాపారాలు రావు. అంద‌రికీ న‌చ్చేలా న‌టించ‌డ‌మే నాకు వ‌చ్చు. నేను చేసిన పాత్ర‌లు నాకు సంతృప్తినిచ్చాయి. అయితే ఏ సంబంధం లేకుండా న‌న్ను న‌డిపించే అభిమానుల‌కు నా వంద‌నం. నేను చేసిన సినిమాల‌న్నీ న‌టుడుగా న‌న్ను ముందుకు తీసుకెళ్లాయి. నేనేదో సూప‌ర్‌స్టార్ అయిపోవాల‌నుకోవ‌డం లేదు. నాకు న‌చ్చిన పాత్ర‌లే చేశాను, ఇక‌పై కూడా అలాగే చేస్తాను. ఇన్ని సంవ‌త్స‌రాలు నుండి అబిమానులు అడుగుతున్నారు కాబ‌ట్టి, కొత్త‌ద‌నం ఉన్న సినిమాల‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు కూడా చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాను. అందులో భాగంగా గుంటూరోడు సినిమాతో మీ ముందుకు వ‌స్తున్నాను. అలాగే నేను లావ‌య్యానని కూడా చాలా మంది అంటున్నారు. కానీ ఒక్క‌డు మిగిలాడు అనే సినిమాలో ఎల్‌.టి.టి.ఇ కు చెందిన క్యారెక్ట‌ర్ చేశాను. 1990కు చెందిన గెట‌ప్‌, స‌ముద్రంలో ఓ గెట‌ప్ , 2017లో ఓ గెట‌ప్ ఇలా వేరియేష‌న్స్ క‌న‌ప‌డ‌తాయి. అందుక‌నే ఆ సినిమా మ‌ధ్య‌లో వ‌చ్చిన సినిమాల్లో నేను అలా క‌న‌ప‌డ్డాను. మ‌రో మూడు నెలల్లో ఒక్క‌డు మిగిలాడు సినిమాతో మీ ముందుకు వ‌స్తున్నాను. ఆ సినిమాలో నా డేడికేష‌న్ మీకు క‌న‌ప‌డుతుంది. ద‌ర్శ‌కుడు స‌త్య క‌థ చెప్పిన‌ప్పుడు హ్యాట్సాఫ్ అనిపించింది. ద‌ర్శ‌కుడు స‌త్య‌కు థాంక్స్‌. వ‌రుణ్ న‌న్ను న‌మ్మి ఇంత బాగా ఖ‌ర్చు పెట్టి సినిమా చేశాడు. వసంత్‌గారు అద్భుత‌మైన ట్యూన్స్ ఇచ్చారు. వెంక‌ట్ చాలా బాగా ఫైట్స్ కంపోజ్ చేశాడు. నా టీంలో ప్ర‌తి ఒక్క‌రికీ థాంక్స్‌`` అన్నారు.

నిర్మాత వ‌రుణ్ అట్లూరి మాట్లాడుతూ - ``మా బ్యాన‌ర్‌లో వ‌స్తున్న తొలి సినిమా గుంటూరోడు. ద‌ర్శ‌కుడు స‌త్య అమేజింగ్ టాలెంట్ చూసి థ్రిల్ అయ్యాను. అద్భుతమైన క‌థ రాసి చ‌క్క‌గా తెర‌కెక్కించాడు. మ‌నోజ్ నేచుర్‌కు యాప్ట్ అయ్యే క్యారెక్ట‌ర్‌ను మ‌నోజ్ చేశాడు. ప్ర‌గ్యా మంచి రోల్‌లో న‌టించింది. కోట‌శ్రీనివాస‌రావు, రావు రమేష్‌, సంప‌త్ స‌హా మంచి టీంతో వ‌ర్క్ చేశాను. శ్రీవ‌సంత్ క‌థ‌నంతా తెలుసుకుని డెప్త్ ఫీల్ ఉన్న సంగీతం కుదిరింది. సినిమా చేయ‌డం అనేది అంత సులువైన విష‌యం కాదు. ఒక మంచి సినిమా తీయ‌గ‌లిగాం. ఫిబ్ర‌వ‌రి రెండో లేదో మూడో వారంలో సినిమాను విడుదల చేయాల‌నుకుంటున్నాం`` అన్నారు.

Glam galleries from the event

ద‌ర్శ‌కుడు ఎస్‌.కె.స‌త్య మాట్లాడుతూ - ``శ్రీవ‌సంత్ ఎక్స్‌ట్రార్డిన‌రీ మ్యూజిక్ ఇచ్చాడు. డైరెక్ట‌ర్ టెస్ట్‌ను బ‌ట్టి మ్యూజిక్ ఇవ్వ‌గ‌ల సంగీత ద‌ర్శ‌కుడు భాస్క‌ర‌భ‌ట్ల‌, రామ‌జోగ‌య్య‌గారు మంచి సాహిత్యం అందించారు. సిద్ధార్థ్ మంచి సిమాటోగ్ర‌ఫీ అందించారు. సినిమా చాలా బాగా వ‌చ్చింది. వెంక‌ట్ మంచి ఫైట్స్ కంపోజ్ చేశాడు. ప్ర‌గ్యా ఈ సినిమాలో చాలా మంచి రోల్ చేసింది. త‌నను ఈ సినిమాలో చూసిన త‌ర్వాత అంద‌రూ ల‌వ్‌లో ప‌డ‌తారు. మ‌నోజ్ ద‌గ్గ‌ర‌కు క‌థ చెప్ప‌డానికి వెళ్ళ‌గానే పాయింట్ కొత్త‌దా అన్నారు. కాదండి రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ మూవీ. కానీ మీరు చేస్తే కొత్త‌గా ఉంటుంద‌ని అన‌గానే ఆయ‌న విని ఎగ్జ‌యిట్ అయ్యారు. సినిమా ప్రారంభం నుండి అదే ఎగ్జ‌యిట్‌మెంట్‌తో వ‌ర్క్ చేశారు. సినిమా బాగా రావాల‌ని క‌ష్ట‌ప‌డి కేర్ తీసుకునే హీరో. గుంటూరోడు హీరో క్యారెక్ట‌రైజేష‌న్ బేస్ మీద న‌డిచే సినిమా. క్యారెక్ట‌ర్‌కు హండ్రెడ్ ప‌ర్సెంట్ మ‌నోజ్ న్యాయం చేశారు. మంచి ఎంట‌ర్‌టైన‌ర్‌.నిర్మాత వరుణ్ నన్ను నమ్మి బాగా ఖర్చు పెట్టి ిసినిమా చేశారు. గన్ షాట్ హిట్ మూవీ అవుతుందని నమ్ముతున్నాను. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్`` అన్నారు.

శ్రీవసంత్ మాట్లాడుతూ - ``అందరి కంటే ఈ క‌థ వింది నేనే. డైరెక్ట‌ర్ స్య‌త్య లైన్ చెప్ప‌గానే నాకు బాగా న‌చ్చింది. నిర్మాత వ‌రుణ్‌, హీరో మ‌నోజ్‌కు నా ట్యూన్స్ న‌చ్చ‌గానే ఈ సినిమా పరంగా నా జ‌ర్నీ స్టార్ట్ అయ్యింది. అన్నీ క‌థ‌లో నుండి పుట్టిన సాంగ్స్‌. క‌థ‌లో ఇన్‌వాల్వ్ కావ‌డం వ‌ల్ల పాట‌లు బాగా వ‌చ్చాయి. మా అంద‌రికీ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది`` అన్నారు.

చిత్ర స‌మ‌ర్ప‌కుడు అట్లూరి బాల‌ప్ర‌సాద్ మాట్లాడుతూ - ``నాకు మోహ‌న్‌బాబుగారితో ప‌రిచ‌యం ఉంది. కానీ నా కొడుకు వ‌రుణ్ ఈ సినిమాను మ‌నోజ్‌తో చేస్తున్న‌ట్లు నాకు ముందు చెప్పనేలేదు. మొన్న‌నే చెప్పాడు. మోహ‌న్‌బాబుగారిలో ఉన్న హార్డ్ వ‌ర్క్ వారి పిల్ల‌ల్లో కూడా ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంద‌ని భావిస్తున్నాను`` అన్నారు.

మంచు విష్ణు మాట్లాడుతూ - ``మా నాన్న‌గారిలా నా కంటే మ్యూజిక్ గురించి మ‌నోజ్‌కు మంచి అవ‌గాహ‌న ఉంది. నిర్మాత వ‌రుణ్‌కు, ద‌ర్శ‌కుడు స‌త్య‌కు ఆల్ ది బెస్ట్‌. పాటలు చాలా బావున్నాయి. టీంకు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

శర్వానంద్ మాట్లాడుతూ - ``నిర్మాత వ‌రుణ్, నేను క్లాస్‌మేట్స్‌. ఈ సినిమా చేస్తున్నాన‌ని చెప్ప‌గానే సంతోషించాను. అలాగే దర్శ‌కుడు స‌త్యతో కూడా మంచి ప‌రిచ‌యం ఉంది. సినిమాను చ‌క్క‌గా తీసుంటాడ‌ని అర్థ‌మ‌వుతుంది. శ్రీవంస‌త్ పాటలు బావున్నాయి. మ‌నోజ్‌, ప్ర‌గ్యా జంట చూడ‌టానికి బావుంది. సినిమా త‌ప్ప‌కుండా పెద్ద స‌క్సెస్ అవుతుంది`` అన్నారు.

సాయిధ‌ర‌మ్ తేజ్ మాట్లాడుతూ - ``నేను మోహ‌న్‌బాబుగారి న‌ట‌న‌కు పెద్ద అభిమానిని. అలాగే మ‌నోజ్‌తో నా స్నేహం చాలా కాలంగా ఉంది. ఒక‌ప్పుడు మేం ఇద్ద‌రం క‌లిసి క్రికెట్ ఆడేవాళ్ళం. మ‌నోజ్ ఏమో హీరోగా చాలా జ‌ర్నీ చేశాడు. నేనేమో ఇప్పుడిప్పుడో సినిమా చేస్తున్నాను. మ‌నోజ్‌, ప్ర‌గ్యాలు స‌హా టీంకు ఈ సినిమా మంచి పేరు తెచ్చే చిత్రం కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.
ఆడియో వేడుకకు వచ్చిన అతిథులు చిత్రయూనిట్ ను అభినందించారు.

మంచు మ‌నోజ్, ప్ర‌గ్యా జైస్వాల్ ముఖ్య పాత్రలలో న‌టిస్తున్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, కోటశ్రీనివాసరావు, రావు రమేష్ , సంపత్, పృథ్వి ,ప్రవీణ్, సత్య, జెమినీ సురేష్, కాశీ విశ్వనాథ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీ వసంత్, సినిమాటోగ్రఫి : సిద్దార్ధరామస్వామి, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్టర్: సత్య శ్రీనివాస్, ఫైట్స్ : వెంకట్ , కొరియోగ్రాఫర్ : శేఖర్, లిరిక్స్ : రామజోగయ్య శాస్త్రి , భాస్కరభట్ల, శ్రీ వసంత్,

కో– డైరెక్టర్ T. అర్జున్,ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: బుజ్జి, సురేష్ రెడ్డి , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రభు తేజ, నిర్మాత : శ్రీ వరుణ్ అట్లూరి, కధ, స్క్రీన్ ప్లే , మాటలు, దర్సకత్వం : S.K. సత్య.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved