5 October 2016
Hyderabad
కల్యాణ్‌రామ్ నిర్మించి, హీరోగా నటించిన చిత్రం `ఇజం`. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో బుధవారం రాత్రి జరిగింది. ఈ సినిమా బిగ్ సీడీని నందమూరి హరికృష్ణ విడుదల చేశారు. ఎన్టీఆర్ ఆడియో సీడీలను అందుకున్నారు.
ప్రకాష్‌రాజ్ మాట్లాడుతూ ``అనూప్ సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. రీరికార్డింగ్‌లోనూ నాకు రాజాగారిని గుర్తుచేస్తాడు. ఆర్కస్ట్రైజేషన్ కూడా కొత్తగా ఉంటుంది. నందమూరి కల్యాణ్‌రామ్ నటించిన `ఇజం` చూస్తుంటే అతనిలో ఉన్న ఆకలి తెలుస్తోంది. నాలాంటి నటులకు ఆ ఆకలి అర్థమవుతుంది. వండర్‌ఫుల్‌గా చేశాడు. గొప్ప కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అతను. అయినా కష్టపడుతున్నాడు. ఆయన పడే తపన నాకు తెలుసు. ఎన్టీఆర్ నా దృష్టిలో జెన్యూన్ ఆర్టిస్ట్. నాకు పూరి ఆకలి తెలుసు. విజన్ తెలుసు. కల్యాణ్ సినిమా ఏమాత్రం బావున్నా సూపర్‌డూపర్ హిట్ అవుతుంది. జగ్గు ఈజ్ ఎ స్ట్రీక్. పూరిలాంటి వాడు డక్ అని అన్నా అది బూతు అయినా అతని నోటి ద్వారా పలికితే అది అందంగా వినిపిస్తుంది. ఆ భాష లోని అర్థం కూడా అందంగానే స్ఫురిస్తుంది. స్టైల్, క్లాసిక్, జోనర్, అన్నిట్లోనూ పూరి ఎప్పుడూ అప్‌డేట్‌గా ఉంటారు. మాస్‌కి క్లాస్ టచ్ ఇవ్వగల దర్శకుడు ఆయన. ఎడిటింగ్ ప్యాటర్న్స్ నుంచి ఆయనకు అన్నీ తెలుసు. సినిమా అంతా పాజిటివ్‌గా ఉంది`` అని అన్నారు.
బీవీయస్‌యన్ ఫ్రసాద్ మాట్లాడుతూ ``విజువల్స్ మామూలుగా లేవు. పెద్ద చిత్రమవుతుంది`` అని చెప్పారు.
హేమంత్ మధుకర్ మాట్లాడుతూ ``సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. టీజర్ బావుంది. పాటలు కూడా బావున్నాయి`` అని తెలిపారు.
భాస్కరభట్ల మాట్లాడుతూ ``పూరి జగన్నాథ్‌కి రాయడంలో కంఫర్ట్ ఉంటుంది. నేను ఆయనకు రాస్తున్న 24వ సినిమా ఇది. అనూప్‌తో పనిచేస్తున్న మూడో సినిమా. కల్యాణ్‌రామ్ గారి బ్యానర్‌లో తొలిసారి రాయడం ఆనందంగా ఉంది`` అని చెప్పారు.
దిల్‌రాజు మాట్లాడుతూ ``మా సంస్థకు ఈ ఏడాది బావుంది. ఈ సినిమా పాటలకు ఇప్పటికే మంచి స్పందన వస్తోంది. సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. తొలి సగం గంటా రెండు నిమిషాలుంటే, రెండో సగం గంటా ఐదు నిమిషాల నిడివి ఉంది.. టీజర్ చూస్తే ఇడియట్ గుర్తుకొచ్చింది. ఈ నెల 20న ఈ సినిమా పెద్ద హిట్ సాధించాలి`` అని తెలిపారు.
అలీ మాట్లాడుతూ ``కల్యాణ్‌రామ్ మంచి మనసున్న హీరో. ఎక్కడా గర్వం అనేది ఉండదు`` అని చెప్పారు.
తనికెళ్ల భరణి మాట్లాడుతూ ``శ్రావణీ సుబ్రమణ్యం నుంచి నాకు పూరి జగన్నాథ్‌తో పరిచయం ఉంది. ఈ చిత్రం క్లైమాక్స్ చూస్తే నాకు కళ్లనీళ్లొచ్చాయి. ఏడు నిమిషాల పెర్ఫార్మెన్స్ ను కల్యాణ్ రామ్ ఇరగదీశాడు.`` అని చెప్పారు.
అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ ``కల్యాణ్‌రామ్‌గారితో నేను చేస్తున్న తొలి సినిమా ఇది. పాటలకు మంచి స్పందన వస్తోంది`` అని అన్నారు.
అదితి మాట్లాడుతూ ``ముందు కల్యాణ్‌రామ్ గారిని చూసి పెద్ద కుటుంబం నుంచి వచ్చారు ఆరోగెంట్‌గా ఉంటారేమోనని అనుకున్నా. అయితే చాలా సాఫ్ట్ గా అనిపించారు. పూరి గారి ఇతర నాయికలందరూ చాలా ఎత్తుకు ఎదిగారు. ఆ కోవలోకి నేను కూడా చేరాలని అనుకుంటున్నాను`` అని తెలిపారు.
Aditi Arya Glam gallery from the event |
|
|
|
పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ``ఇజమ్ టీజర్ హరికృష్ణగారికి నచ్చి నాకు రెండు పావురాలను ఇచ్చారు. అవి గుడ్లు కూడా పెట్టాయి. టీజర్ చూసి ఏంటయ్యా నా కొడుకు ఇట్టా ఉన్నాడు అని అన్నారు. మూడు నెలల్లో కల్యాణ్‌రామ్ 30 కిలోలు తగ్గారు. అది మామూలు విషయం కాదు. తన యాక్టింగ్ చూసి చాలా గర్వంగా అనిపించింది. తప్పకుండా చూసిన వాళ్లందరూ కూడా అది ఫీలవుతారు. కోర్టు సీనులన్నీ నందమూరి వారి అకౌంట్‌లోనే ఉన్నాయి. ఈ సినిమాలోనూ ఓ కోర్టు సీను ఉంది. చాలా బాగా చేశాడు. ఆ సీను చూసి తారక్ యాహూ అని అరిచాడు. అనూప్ నాకు ఈ సినిమాలో ఓ పాటను రాసే , పాడే అవకాశాన్నిచ్చాడు. పాట రాయడం ఎంత కష్టమో అర్థమైంది. దానికి బదులు ఓ కథ రాసుకోవచ్చనిపించింది. `` అని చెప్పారు.
హరికృష్ణ మాట్లాడుతూ ``ఇపుడు నా వయసు 60. ఈ జీవితంలో ఎవరూ పొందలేని, అనుభవించలేని ఆనంద సమయాలను చూశాను. నందమూరి రామారావు గారి దగ్గర 30 ఏళ్లు పనిచేశా. ఆయనతో నాకున్న అనుభవాలు హిమాలయ శిఖరాలను మించాయి. సినిమా రంగంలో ఆయనతో ఎన్నో విజయాలు చూశాను. రాజకీయాల్లో పార్టీ పెట్టి పోరాటం చేసి గెలిచాం. వెలకట్టలేని వీరాభిమానులు ఇవాళ మా సొంతం. ఎవరూ తస్కరించలేనిది అభిమానం. ఆంధ్రరాష్ట్ర ప్రజలు నా బిడ్డలకు ఆ అభిమానాన్ని పంచుతున్నారు. నా 59వ ఏట జూనియర్ టెంపర్ హిట్ ఇచ్చాడు. కల్యాణ్‌రామ్ పటాస్ ఇచ్చాడు. నా 60వ ఏట జూనియర్ జనతాగ్యారేజ్ హిట్ ఇచ్చాడు. కల్యాణ్ ఇప్పుడు ఇజంతో ముందుకు రాబోతున్నాడు. హిట్ కొడతాడనే నమ్మకం ఉంది. మా నాన్న కడుపున పుట్టడమే నేను చేసుకున్న మహద్భాగ్యం. ఆయన ఆశీస్సులు పిల్లలకున్నాయి. కృషితో నాస్తి దుర్భిక్షం అనే మాటను నా ఇద్దరు పిల్లలూ గుర్తుంచుకున్నారు. నా పెద్ద కుమారుడు తన తమ్ముళ్లు తప్పకుండా హిట్లు తీస్తారని నాతో చెప్పేవాడు. అతను లేకపోయినా అతను నమ్మిన మాట ఉంది. ఆ మాట ప్రకారం పిల్లలిద్దరూ హిట్లు కొట్టారు. పై నుంచి మా నాన్న, నా పెద్ద కుమారుడు వీళ్లను ఆ
శీర్వదిస్తున్నారు`` అని అన్నారు.
కల్యాణ్ రామ్ మాట్లాడుతూ ``ఫిబ్రవరి 4న ఈ సినిమాను ఒప్పుకున్నాను. నేనింత వరకు పనిచేసిన వాళ్లలో ఇజమ్ టీమ్ ద బెస్ట్ టీమ్. అనూప్ మంచి పాటలిచ్చారు. పూరి జగన్నాథ్‌గారు చాలా ఉత్సాహాన్నిచ్చారు. నా కెరీర్‌లో బెస్ట్ డైరక్టర్ ఆయన. లవబుల్ పర్సన్. ప్రతి వ్యక్తిలోనూ ఉత్సాహాన్ని నింపి పనిచేయించుకున్నారు`` అని చెప్పారు.
ఎన్టీఆర్ మాట్లాడుతూ ``అనూప్ చాలా మంచి సంగీతాన్నిచ్చారు. ఇప్పుడున్న వాళ్లలో మెలోడీలను అత్యద్భుతంగా చేయగలిగింది అనూప్. నాకు జగన్ భయ్యా ఒకరోజు పిలిచి కల్యాణ్‌రామ్ అన్నయ్యతో ఓ సినిమా చేయబోతున్నట్టు చెప్పారు. చాలా హ్యాపీగా అనిపించి అప్పుడే ఫోన్ చేసి చెప్పా. జగన్‌గారితో అన్నయ్య ఓ సినిమా చేస్తే బావుంటుందని నాకు ఎప్పటినుంచో అనిపించేది. ఎందుకంటే టెంపర్ చేయకముందు నేను వేరు. అది చేసిన తర్వాత నేను వేరు. ఎందుకంటే నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. అలాగే అన్నయ్య కూడా ఓ సినిమా చేస్తే బావుంటుందనుకున్నా. ఈ టీజర్ చూశాక అది నిజమనిపించింది. అన్నయ్యలోని వేరే యాటిట్యూడ్‌ని తెరపై చూపించారు పూరి భయ్యా. ఎందుకంటే అన్నయ్య పడ్డకష్టం నాకు తెలుసు. నటుడిగా ఆయన తపన నాకు తెలుసు. ఎందుకంటే ఆయన నాకు ఫిలాసఫర్. గైడ్, కొన్ని సమయాల్లో గర్ల్ ఫ్రెండ్ కూడా. ఆయన పడ్డ కష్టాన్ని ప్రత్యక్షంగా చూశాను. జెన్యూన్ కష్టానికి ఎప్పుడూ విజయం ఉంటుంది. ఆయన కెరీర్‌లో ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది. కలం బలం గురించి ఇంకోసారి గుర్తుచేసే సినిమా ఇది`` అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో రామకృష్ణతో పాటు..ఆదిత్య నిరంజన్ తదితరుల పాల్గొన్నారు. .ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైంది.