pizza
Jai Simha music launch
`జై సింహా` ఆడియో విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
 
Follow Us

24 December 2017
Hyderaba
d

నంద‌మూరి బాలకృష్ణ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘జై సింహా’. కె.ఎస్.రవికుమార్ దర్శకుడు. సి.కె.ఎంటర్‌ైటెన్‌మెంట్స్ పతాకంపై సి.కల్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం విజయవాడలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయతీ శాఖ మంత్రి నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ, దేవినేని ఉమ, మురళీమోహన్, మండలి ప్రసాద్, అంబికా కృష్ణ, కేశినేని నాని, వర్ల రామయ్య, కామినేని శ్రీనివాసరావు, బొండా ఉమ, కె.ఎస్.రవికుమార్, చిరంతన్‌భట్, సి.కల్యాణ్, కొల్లి రవీందర్, గద్దె రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. బిగ్ సీడీ, ఆడియో సీడీలను నారా లోకేష్ విడుదల చేశారు. తొమ్మిది సీడీలను చిత్రంలో తొమ్మిది మందికి అందచేశారు. అందులో తొలి సీడీని నందమూరి బాలకృష్ణ అందుకోగా, మిగిలిన సీడీలను కె.ఎస్.రవికుమార్, సి.కల్యాణ్, హరిప్రియ, నటాషా దోషి, చిరంతన్ భట్, సినిమాటోగ్రాఫర్ రాంప్రసాద్, ఎం.రత్నం, రామ్ లక్ష్మణ్‌లు అందుకున్నారు.

నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ - ‘‘నాన్నగారు 1955లో అప్పట్లో ‘జయసింహ’ చిత్రాన్ని నిర్మిస్తే అది ఘన విజయం సాధించింది. ఇప్పుడు ‘జెసింహా’ను రూపొందడంలో ముఖ్య భూమికలు పోషించిన కె.ఎస్.రవికుమార్, కల్యాణ్, చిరంతన్‌భట్, హరిప్రియ,నటాషా, రత్నం, రాంప్రసాద్, మురళీమోహన్, రవిప్రకాష్, రామ్ లక్ష్మణ్ సహా అందరికీ థాంక్స్. ఎన్టీఆర్‌గారు, ఏఎన్నార్‌గారు ఇండస్ట్రీకి రెండు కళ్లు. నాన్నగాైరెన ఎన్టీఆర్‌గారి నుండి క్రవుశిక్షణ నేర్చుకుంటే, ఏఎన్నార్‌గారి నుండి పొగడ్తలకు దూరంగా ఉండటం నేర్చుకున్నాను. కాబట్టి నేను కూడా పొగడ్తలకు దూరంగానే ఉంటాను. ఎన్నో విలక్షణైమెన సినిమాలు చేయగలిగిన వ్యక్తి రామారావుగాైరెతే, ఆ తర్వాత అన్ని తరహా సినిమాలు చేయుగల లక్షణం నాకు అబ్బింది. అందుకే ఆయన బయోపిక్‌ను నేను చేస్తున్నాను. అలాగే నేను ఎన్నో నేపథ్యాలున్న సినిమాలు చేసినా ప్రేక్షకులు ఆదరించారు. నేను పనిచేస్తున్న బృందమంతా ఎన్‌సైక్లోపిడియా. ఇప్పటికీ నేను నిత్య విద్యార్థినే. ఒక సినిమాలో సంగీతం హిట్‌ అయితే ఆ సినిమా సగం హిట్‌ అయినట్టే. కె.ఎస్‌.రవికుమార్‌కు నేను పెద్ద ఫ్యాన్‌ను. ఎనిమిదేళ్ల నుంచి ఆయనతో పనిచేయాలని చూస్తున్నా. ఈ టైటిల్‌ కోసమే మేము ఇంతకాలం ఆగామేమో. ఆంధ్రప్రదేశ్‌లో కూడా చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలి. నా సినిమాల్లో సందేశం కూడా ఉండేలా చూసుకుంటా. అది నాపూర్వ జన్మ సుకృతం. ఎన్టీఆర్‌ కేవలం తెలుగు జాతి గుర్తుపెట్టుకోవాల్సిన నటుడు మాత్రమే కాదు.. ముఖ్యమంత్రిగానూ విప్లవాత్మక పథకాలను తీసుకొచ్చారు. ఆయన పెట్టిన భిక్షే తెలుగుదేశం పార్టీ. నేను చాలా పాత్రలు చేశా. వాటికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి నన్ను పెంచి పోషించి ఇంత వాడిని చేసిన వారు అభిమానులు.సంక్రాతి సందర్భంగా సినిమా విడుదలవుతుంది’’ అన్నారు.

నారా లోకేష్ మాట్లాడుతూ - ‘‘సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలున్నా..మ‌నసులో మాటను డైరెక్ట్‌గా చెప్పే ఏకైక హీరో బాలకృష్ణగారే. అలాగే హీరో కోసం ప్రాణత్యాగం చేసే ఫ్యాన్స్ కూడా బాలయ్యబాబుకే ఉంటారు. 1955లో స్వర్గీయ ఎన్టీఆర్‌గారు నటించిన ‘జయసింహ’ చిత్రం విజయవాడలో 165 రోజుల ప్రదర్శింపబడి చరిత్ర సృష్టిస్తే..ఇప్పుడు ఈ `జై సింహా` ఆ చరిత్రను తిరిగి రాయుబోతుంది. మీసాలు తిప్పినా, తొడగొట్టినా బాలయ్యబాబుకే చెందుతుంది. ఒక సమర సింహారెడ్డి, ఓ నరసింహనాయుడు, ఒక సింహ, ఒక లెంజెడ్, ఒక గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలతో చరిత్ర సృష్టించాలన్నా, దాన్ని తిరగరాయాలన్నా బాలయ్యబాబుకే సాధ్యం. ఈ సంద‌ర్భంగా డైరెక్టర్ రవికుమార్‌గారికి, కల్యాణ్‌గారికి, చిరంతన్‌భట్‌గారికి అభినందనలు’’ అన్నారు.

కె.ఎస్.రవికుమార్ మాట్లాడుతూ - ‘‘ఈ సినిమా డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చిన బాలకృష్ణ, కల్యాణ్‌గారికి థాంక్స్. రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ, చిరంతన్‌భట్ వంటి వండర్ ఫుల్ యూనిట్‌ను ఇచ్చారు. ఇక నటీనటుల పరంగా నటాషా, హరిప్రియ, నయునతార, ప్రకాష్ రాజ్ సహా అందరికీ థాంక్స్. సినిమా గురించి చెప్పాలంటే సెంటిమెంట్, యాక్షన్, లవ్, కామెడీ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులు చూసే చిత్రమిది’’ అన్నారు.

సి.కల్యాణ్ మాట్లాడుతూ - ‘‘సంక్రాంతికి రానున్న ఈ `జైసింహా` వాట్ ఈజ్ సి.కె.ఎంటర్ టైన్‌మెంట్స్, వాట్ ఈజ్ కె.ఎస్.రవికుమార్, వాట్ ఈజ్ రాంప్రసాద్, వాట్ ఈజ్ చిరంతన్‌భట్ అని రుజువు చేస్తుంది. సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ చూసి ఇప్పుడు ఆడియెన్స్ ఎంతలా చప్పట్లు కొడుతున్నారో..రేపు సినిమా విడుదల తర్వాత సినిమాలో ఎమోషన్‌కు కన్నీళ్లు పెట్టుకుని, చప్పట్లు కొడుతూ ఆడియెన్స్ బయటకు వస్తారు. డెఫెనెట్‌గా సంక్రాంతికి ఈ సింహం పవరేంటో చూపిస్తుంది. ఎంటైర్ సినిమాను నేనే రిలీజ్ చేస్తున్నాను. అందులో వచ్చే ఆదాయంతో..ఆయన నిర్వహిస్తున్న క్యాన్సర్ హాస్పిటల్‌కు ఫండింగ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. జనవరి 12న సంక్రాంతి సింహం వస్తుంది’’ అన్నారు.

చిరంతన్ భట్ మాట్లాడుతూ - ‘‘కల్యాణ్‌గారికి, కె.ఎస్.రవికుమార్‌గారికి, బాలకృష్ణగారికి థాంక్స్. గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత నాపై నమ్మకంతో బాలకృష్ణగారు నాకు అవకాశం ఇచ్చారు’’ అన్నారు.

దేవినేని అవినాష్ మాట్లాడుతూ ‘‘జై సింహా’ సినిమా వంద రోజులు ఆడాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో బాలకృష్ణగారు నవ యువ కథానాయుకులకు అందంలో పోటీనిస్తున్నారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

మురళీ మోహన్ మాట్లాడుతూ - ‘‘ఓ క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలు విజయువాడ ప్రజలకు ఒకేసారి వచ్చినట్లుగా ఉంది. నేను 1973లో సినిమాలు మొదలు పెడితే..అన్నయ్య ఎన్టీఆర్, బాలయ్యతో కలిసి `అన్నదమ్ముల అనుబంధం` సినిమా చేశాను. అప్పటి నుండి వారి కుటుంబ సభ్యుడిగానే ఫీలవుతున్నాను. ఈ సినిమాలో ఓ కీలకైమెన పాత్రను బాలకృష్ణగారే ఫోన్ చేసి చేయుమని అన్నారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నారు’’ అన్నారు.

కేశినేని నాని మాట్లాడుతూ - ‘‘విజయవాడలో జైసింహా ఆడియో వేడుక చేసుకోవడం ఆనందంగా ఉంది. ఎన్టీఆర్‌గారి నటవారసుడిగా వచ్చిన బాలకృష్ణగారు నటించిన 102వ చిత్రమిది. నిర్మాత కల్యాణ్, రవికుమార్‌గారికి సినిమా సూపర్‌హిట్ అయ్యి అందరికీ మంచి పేరు తేవాలి’’ అన్నారు.

 


 
Photo Gallery (photos by G Narasaiah)
 

 

 


 

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved