21 November 2016
Hyderabad
కావేరి ట్రావెల్స్ సమర్పణలో కావేరి మీడియా బ్యానర్‌పై నవీన్ సంజయ్ హీరోగా నటించిన చిత్రం `జానకి రాముడు`. మౌర్యాని, ప్రియాంక నాయికలు. తమ్మినీడి సతీష్ బాబు దర్శకత్వం వహించారు. యం.పి.నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గిఫ్టన్ ఎలియాస్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ఆడియో విడుదల కార్యక్రమంలో సురేశ్ కొండేటి, వి.ఐ.ఆనంద్, రాజ్ కందుకూరి, నందిత శ్వేత పాల్గొన్నారు. రాజ్ కందుకూరి ఆడియో విడుదల చేశారు. నందిత శ్వేత థియేట్రికల్‌ను విడుదల చేసింది.
వి.ఐ.ఆనంద్ మాట్లాడుతూ ``చాలా హ్యాపీగా ఉంది ఈ ఆడియోకి రావడం. ఈ టీమ్ అంతా కష్టపడ్డారు. ఈ సినిమా ట్రైలర్, పాటలు బావున్నాయి. ట్రైలర్‌ను చూసిన ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. లవ్ స్టోరీ ఉన్న ఏ సినిమా అయినా హిట్ అవుతుంది. పాటలు బావున్నాయి. తప్పకుండా సినిమా హిట్ అవుతుంది`` అని అన్నారు.
రాజ్ కందుకూరి మాట్లాడుతూ ``పాటలు బావున్నాయి. హీరో బావున్నారు. బాగా చేశారు. థియేట్రికల్ ట్రైలర్ చూస్తే ప్రామిసింగ్‌గా ఉంది`` అని అన్నారు.
హీరో మాట్లాడుతూ ``దర్శకుడు చాలా మంచి కథ చెప్పారు. నిర్మాతగారు లొకేషన్‌కు వచ్చి అందరినీ పేరుపేరునా పలకరించారు. ఆయన సపోర్ట్ మర్చిపోలేను`` అని చెప్పారు.
నిర్మాత మాట్లాడుతూ ``సినిమా చాలా బాగా వచ్చింద. తప్పకుండా హిట్ అవుతుంది. దర్శకుడు మాకు చెప్పింది చెప్పినట్టు తీశారు`` అని అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ``నేను జె.డి.చక్రవర్తిగారి దగ్గర పనిచేశాను. సినిమా అంటే హాల్‌లోకి వచ్చిన ప్రేక్షకుడు కళ్లు, చెవులు మాత్రమే పనిచేస్తాయి. చూడ్డానికి ఇంపుగా, కళ్లకు కట్టినట్టు, చెవులకు ఇంపుగా ఉండేలా సినిమా చేయాలని అనుకున్నా. అలాగే ఈ సినిమా చేశాను. నిర్మాతగారు చేసిన సపోర్ట్ మర్చిపోలేను. మా నాన్నగారి జేబులో నుంచి డబ్బులు తీసుకుని ఎలా ఖర్చుపెట్టానో నిర్మాతగారి దగ్గర కూడా అలాగే ఖర్చుపెట్టాను. నేను సినిమాల్లోకి వచ్చి ఏమైపోతానో అని మా ఇంట్లో వాళ్లకి భయంగా ఉండేది. కానీ చాలా ఆనందంగా ఉంది. సినిమా కళామతల్లి పల్లకి మోసే అదృష్టం నాకు ఒక సారి వచ్చింది. నా భుజాల్లో ఇంకా బలం ఉంది. ఇంకా ఇంకా ఆ తల్లి పల్లకిని మోయాలనుకుంటున్నాను`` అని తెలిపారు.
అర్జున్, సుధ, పవిత్ర లోకేష్, శివ కృష్ణ, సూర్య, కమల్, జాకి, సుదర్శన్, గీతాంజలి తారాగణంగా రూపొందుతున్నఈ చిత్రానికి సంగీతం: గిప్టన్ ఎలియాస్, కెమెరా: అనిత్, కూర్పు: నాగేంద్ర అడపా, సాహిత్యం: అనంతశ్రీరామ్, శ్రీమణి, నృత్యాలు: స్వర్ణ, నిక్సన్, స్టంట్స్: నందు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సీతారామయ్య.