9 January 2017
Hyderabad
విష్ణు మంచు హన్సిక జంటగా ఎం.వి.వి.సినిమా బ్యానర్‌పై గీతాంజలి, త్రిపుర వంటి హర్రర్ ఎంటర్‌టైనర్స్ ను తెరకెక్కించిన దర్శకుడు రాజ్ కిరణ్ దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `లక్కున్నోడు`. అచ్చు, ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డా.మంచు మోహన్‌బాబు బిగ్ సీడీ, ఆడియో సీడీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా...
మంచు మోహన్‌బాబు మాట్లాడుతూ - ``సత్యనారాయణగారు మంచి నిర్మాత, చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వచ్చాడు. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి ఎంతో అవసరం. నాకు విలన్ పాత్ర అంటేనే ఇష్టం. అలాంటి ఒక మంచి విలన్ పాత్రను సత్యనారాయణగారు చక్కగా చేశారు. నా నెక్ట్స్ సినిమాలో సత్యనారాయణగారికి మెయిన్ విలన్ పాత్రను ఇస్తున్నాను. ఇక నేను క్రమశిక్షణతో జీవించాను. ఏ రోజు సెట్‌కు టైం అంటే పది నిమిషాల ముందుగానే ఉండేవాడిని. ఈ క్రమశిక్షణను ఎన్టీఆర్‌గారు, నా గురువుగారు దాసరిగారు నేర్పించారు. అదే క్రమశిక్షణను నా బిడ్డలకు నేర్పించాను. కష్టపడటం నేర్పించాను. లక్కున్నోడు సినిమా అత్యధ్భుతమైన సినిమా. నేను ఢీ సినిమా చూసినప్పుడు ఎలా ఫీలయ్యానో అలా ఫీలయిన సినిమా ఇది. అనేక ట్విస్టుల ఉన్న సినిమా. ఈ మధ్య కాలంలో ఇలాంటి మంచి సినిమా చూడలేదు. కామెడి చేయడం అంత సులువు కాదు. విష్ణు ఈ సినిమాలో చాలా చక్కటి పెర్‌ఫార్మెన్స్ చేశాడు. విష్ణుకైతేనే ఈ కథను ఇస్తానని డైమండ్ రత్నబాబు, మంచి కథ ఉన్న లక్కున్నోడు చిత్రాన్ని ఇచ్చిన రత్నబాబుకు థాంక్స్. మంచి డైలాగ్స్ రాశాడు. ఫిభ్రవరి 3న విడుదలవుతున్న ఈ సినిమా కచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది`` అన్నారు.
విష్ణు మంచు మాట్లాడుతూ - ``నాకు ఈ స్క్రిప్ట్‌ను డైమండ్ రత్నబాబు ఇవ్వడం, ఇంత మంచి నటీనటులతో పనిచేయడం, నా తల్లిదండ్రులను చూసి, పది కోట్ల మందిలో ఇరవై, ముప్పై మంది హీరోలుంటే వారిలో నేను ఒకడైనందుకు, ఇంత మంచి అభిమానులున్నందుకు నేను లక్కున్నోడుగానే భావిస్తున్నాను. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్``
జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ - ``మంచు విష్ణు హీరోగా పద్నాలుగేళ్లు రాణించడం అంటే అంత సులువు కాదు. అందుకు తన హార్డ్ వర్క్ మాత్రమే కారణం. ఇక సత్యనారాయణగారు మంచి సబ్జెక్ట్ సినిమాలను నిర్మిస్తున్నారు. దర్శకుడు రాజ్‌కిరణ్‌కు ఈ సినిమా మంంచి పేరుని సంపాదించాలి`` అన్నారు.
పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ - ``మా పరుచూరి బ్రదర్స్‌ను ఇండస్ట్రీలోకి ఆహ్వానించింది ఎన్టీఆర్‌గారు అయితే సూపర్‌స్టార్ కృష్ణగారు మాకు అన్నప్రాసన చేశారు. మమ్మల్ని ఆలింగనం చేసుకుని అగ్రజ అంటూ ఆదరించింది మోహన్ బాబుగారు. ఆయన తనయుడైన విష్ణు నటించిన లక్కున్నోడు ఈడో రకం-ఆడోరకం సినిమా కంటే పెద్ద హిట్ కావాలి. రత్నబాబు ఎన్నోట్విస్టులతో, మంచి స్క్రీన్‌ప్లే, కామెడితో, సెంటిమెంట్‌తో సాగే చిత్రమిది. పాటలు అద్భుతంగా ఉన్నాయి. సత్యనారాయణగారు గీతాంజలి అనే హార్రర్ చిత్రంతో సక్సెస్ కొట్టాడు. ఇప్పుడు ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ సాధించాలి.ఈ సినిమాను నిర్మించడమే కాదు, ఈ సినిమాలో చక్కని పాత్రలో నటించారు. డైరెక్టర్ రాజ్‌కిరణ్‌గారు అద్భుతమైన స్క్రీన్‌ప్లే రాశారు`` అన్నారు.
కోనవెంటక్ మాట్లాడుతూ - ``హార్డ్‌వర్క్, పట్టుదల, కృషి ఉంటే లక్కు కూడా కుక్కలా వస్తుందని నిరూపించిన వ్యక్తి మోహన్‌బాబుగారు. ఇప్పుడు మంచు విష్ణు, మనోజ్, లక్ష్మిమంచు కూడా తమ కష్టాన్ని నమ్ముకునే ముందు కెళుతున్నారు. సినిమాపై ప్యాషన్‌తో వచ్చిన వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి ఒక వ్యక్తి ఎం.వి.వి.సత్యనారాయణగారు. ఈ టైటిల్‌కు సత్యనారాయణగారు సరిపోతారు. మా విష్ణు వర్తున్నోడు. విష్ణు నటించిన ఢీ చిత్రంతోనే నాకు రైటర్‌గా మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత దేనికైనా రెడీ చిత్రానికి కూడా పని చేశాను. రాజ్‌కిరణ్‌కు లక్కున్నోడు హ్యాట్రిక్ మూవీ. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావలని కోరుకుంటున్నాను`` అన్నారు.
సినిమాటోగ్రఫీ పి.జి.విందా మాట్లాడుతూ - ``మంచు విష్ణు మంచి డేడికేషన్ ఉన్న హీరో. ఆయనతో కలసి ఈ సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. మంచి పాయింట్‌తో రూపొందిన చిత్రం. నిర్మాత సత్యనారాయణగారు విలన్‌గా కూడా అలరిస్తారు. ఈ సినిమా అవకాశం ఇచ్చినందుకు థాంక్స్`` అన్నారు.
డైమండ్ రత్నబాబు మాట్లాడుతూ - ``ఈ సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నిషియన్ లక్కున్నోడు అనే చెప్పాలి. అందరూ సక్సెస్‌ఫుల్ చిత్రంలో పనిచేశామని ఆనందంగా ఉంది. నేను ఫస్ట్ కాపీ చూశాను. సినిమా చాలా సూపర్బ్‌గా ఉంది. పాండవులు పాండవులు తుమ్మెద సినిమా నుండి మంచు విష్ణుతో పనిచేస్తున్నాను. ఈ సినిమా సక్సెస్ మాట్లాడుతుంది. రాజ్‌కిరణ్‌గారు ప్రతి సీన్‌ను అద్భుతంగా తీశారు. తండ్రి కొడుకులు మధ్య నడిచే మంచి సినిమా. ప్రతి ఫ్యామిలీ చూడదగ్గ సినిమా`` అన్నారు.
రాజ్‌కిరణ్ మాట్లాడుతూ - ``కోనవెంకట్‌గారి సపోర్ట్ కారణంగానే నేను డైరెక్టర్ అయ్యాను. మంచు విష్ణులాంటి హీరోను చూడలేదు. ఆయనలాంటి హీరోతో నేను పనిచేయడం నాకు హ్యాపీ. విష్ణుగారితో మరోసారి సినిమా చేయాలనుకుంటున్నాను. ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మంచి ఎమోషన్ ఉంది. నా లైఫ్‌లో జరిగిన సిచ్చువేషన్‌తోనే ఈ కథ రాసుకున్నాను. నేను పుట్టగానే ఆస్థులు పోవడంతో మా నాన్నగారు నన్ను దురదృష్టవంతుడిగా భావించారు. ఆయన పోగొట్టుకున్న ఆస్థులను మళ్లీ సంపాదించాలనుకున్నాను. నేను డైరెక్టర్ అయిన తర్వాత మా నాన్నగారు నా దగ్గర లేరు. ఆ ఎమోషన్‌తోనే ఈ సినిమా చేశాను. తప్పకుండా సినిమా అందరికీ నచ్చే సినిమా అవుతుంది`` అన్నారు.
చిత్ర నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ - ``ఇది నిర్మాతగా నాకు నాలుగో సినిమా. మంచు విష్ణుతో సినిమా చేయడం నిర్మాతగా ఎంతో సంతోషంగా ఉంది. మంచి క్రమశిక్షణ గల నటుడు. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను. డైరెక్టర్ రాజ్‌కిరణ్ నాకు నచ్చిన దర్శకుడు. ప్రతి ఒక ఆర్టిస్టు, టెక్నిషియన్ ఎంతో సపోర్ట్ చేశారు. ఫస్ట్‌కాపీ చూశాం. సినిమా అద్భుతంగా వచ్చింది. డైరెక్టర్‌గారు చెప్పిన కథకు డైమండ్ రత్నబాబుగారు మంచి స్క్రీన్‌ప్లే రాశారు. ఇందులో తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్ అందరికీ నచ్చుతుంది. విష్ణుగారి స్నేహితుడు విజయ్‌గారు ఎంతో సపోర్ట్ చేశారు. 64 డేస్‌లోనే సినిమాను పూర్తి చేశారు. దేనికైనా రెడీ, పాండవులు పాండవులు తుమ్మెద వంటి సక్సెస్ చిత్రాల తర్వాత విష్ణు, హన్సికల కాంబినేషన్ లో రానున్న హ్యాట్రిక్ మూవీ ఈ లక్కున్నోడు. ఇందులో విష్ణు తనదైన లవ్, కామెడితో ప్రేక్షకులను అలరిస్తారు. డైమంగ్ రత్నబాబు, పి.జి.విందా సినిమాటోగ్రఫీ, అచ్చు సంగీతం సినిమా పెద్ద ప్లస్ అవుతాయి. మంచి టీంతో కలిసి పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉంది`` అన్నారు.
ఈ కార్యక్రమంలో రఘుబాబు, పోసాని కృష్ణమురళి, సిల్లీ మాంక్స్ సంజయ్‌రెడ్డి, సత్యం రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
తనికెళ్ళ భరణి, వెన్నెలకిషోర్, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: చిన్నా, సినిమాటోగ్రఫీ: పి.జి.విందా, సంగీతం: అచ్చు, ప్రవీణ్ లక్కరాజు, స్క్రీన్ ప్లే, మాటలు: డైమండ్ రత్నబాబు, సహ నిర్మాత: రెడ్డి విజయ్‌కుమార్, నిర్మాతః ఎం.వి.వి.సత్యనారాయణ, కథ, దర్శకత్వం: రాజ్ కిరణ్,