pizza
Mande Suryudu music launch
`మండే సూర్యుడు` ఆడియో ఆవిష్క‌ర‌ణ‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

22 January 2017
Hyderaba
d

ఆర్య‌, హ‌న్సిక జంట‌గా రూపొందిన చిత్రం `మేఘ‌మాన్‌`. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ సూర్య సాకేత్ పిక్చ‌ర్స్‌, స‌ర‌ల ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్స్‌పై తెలుగులో `మండేసూర్యుడు` అనే పేరుతో విడుద‌ల చేస్తున్నారు. మ‌గిల్ తిరుమ‌నేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం ఆదివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. సి.క‌ల్యాణ్ ఆడియో సీడీల‌ను విడుద‌ల చేసి హీరో ఆర్య‌కు సీడీల‌ను అందించారు. ఈ సంద‌ర్భంగా...

హీరో ఆర్య మాట్లాడుతూ - ``నేను చేసిన సినిమాల్లో బాగా ఇష్టమైన సినిమా. త‌మిళంలో సినిమా మంచి విజ‌యాన్ని సాధించింది. ద‌ర్శ‌కుడు మ‌గిల్ తిరుమ‌నేని సినిమా అద్భుతంగా తెర‌కెక్కించారు. పాట‌లు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బావుంటాయి. తెలుగు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా అన్నీ క‌మ‌ర్షియ‌ల్ హంగులు సినిమాలో ఉన్నాయి. సినిమాను ఆద‌రిస్తార‌ని భావిస్తున్నాను`` అన్నారు.

సి.క‌ల్యాణ్ మాట్లాడుతూ - ``నిర్మాత‌ల కోసం ఆర్య సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఇక్క‌డ‌కు రావ‌డం ఎంతో ఆనందంగా ఉంది. డ‌బ్బులు తీసుకుని అంత‌టితో ప‌ని అయిపోయింద‌ని అనుకోకుండా ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొంటున్న ఆర్య‌కు థాంక్స్‌. ఈ సినిమా పెద్ద విజ‌యాన్ని సాధించి ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు మంచి పేరు తేవాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో కె.ఎల్‌.దామోద‌ర్ ప్ర‌సాద్‌, ఎల్లారెడ్డి, నిర్మాత వెంక‌టేశ్వ‌ర్లు, అడ్డాల చంటి, గ‌ణేష్ యాద‌వ్ త‌దిత‌రులు పాల్గొని సినిమాను ఆద‌రించాల‌ని ప్రేక్ష‌కుల‌ను కోర‌కున్నారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved