శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్, ఇ.సత్తిబాబు కాంబినేషన్‌లో నవీన్‌చంద్ర హీరోగా నిర్మిస్తున్న చిత్రం 'మీలో ఎవరు కోటీశ్వరుడు`. శృతిసోధి, పృథ్వీ, సలోని కీలకపాత్రల్లో నటించారు. డి.జె.వసంత్ సంగీతం అందించిన ఈసినిమా ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. థియేట్రిలక్ ట్రైలర్, బిగ్ సీడీని అల్లరి నరేష్ విడుదల చేశారు. ఆడియో సీడీలను హీరో ఆది విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో....
అల్లరి నరేష్ మాట్లాడుతూ - ``పృథ్వీ తనదైన కామెడితో ఇరగదీస్తున్నాడు. ట్రైలర్, సాంగ్స్ బావున్నాయి. నవీన్ చంద్ర మంచి హార్డ్‌వర్కర్, తనకు మీలో ఎవరు కోటీశ్వరుడు పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. నాతో మడతకాజా, సుడిగాడు సినిమాలకు పనిచేసిన డిజె.వసంత్ ఈ సినిమాకు చాలా మంచి పాటలను అందించాడు.సత్తిబాబు వర్కింగ్ స్టయిల్ చాలా బావుంటుంది. రెండు గంటల పాటు ఆడియెన్స్‌ను నవ్వుల్లో ముంచెత్తే సినిమా ఇది`` అన్నారు.
ఆది మాట్లాడుతూ - ``పాటలు, థియేట్రికల్ ట్రైలర్ చాలా బావున్నాయి. పృథ్వీగారు స్క్రీన్‌పై కనపడగానే మంచి అప్లాజ్ వస్తుంది. రాధామోహన్‌గారి బ్యానర్‌లో ఇది వరకు పనిచేసుండటం వల్ల ఆయనెలాంటి నిర్మాతో తెలుసు. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కారు. సినిమాను అనుకున్న సమయంలో పూర్తి చేసి, విడుదల చేయగలిగే నిర్మాత రాధామోహన్‌గారు`` అన్నారు.
హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ - ``రాధామోహన్‌గారు మంచి టీంను ఫాం చేసి ఈ సినిమాను నిర్మించారు. సినిమా ఎప్పుడు స్టార్టయ్యిందో, పూర్తయ్యిందో తెలియదు. శృతి, సలోని, పృథ్వీగారితో ఈ సినిమాలో యాక్ట్ చేయడం ఆనందంగా ఉంది. సత్తిబాబుగారు సినిమాను అవుటండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తే నిర్మాత రాధామోహన్‌గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను రూపొందించారు`` అన్నారు.
కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ - ``ఈ సినిమా నిర్మాణం మంచి ట్రావెల్‌లా అనిపించింది. నాగేంద్రకుమార్‌గారు చెప్పిన లైన్ నచ్చడంతో సినిమాను నిర్మించడానికి రడీ అయ్యాను. విక్రమ్, క్రాంతి, సత్తిబాబు, వసంత్ సినిమాను చక్కగా రూపొందించారు. వసంత్ చాలా మంచి పాటలను అందించాడు. మీలో ఎవరు కోటీశ్వరుడు అనే టైటిల్ గేమ్ షోకు సంబంధించినది కాదు, సబ్జెక్ట్‌కు తగ్గ టైటిల్. పృథ్వీగారి పాత్ర సినిమాకు పెద్ద ప్లస్ అవుతుంది. ఈ సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేయడానికే నిర్మంచాను. సినిమాలో ఎలాంటి సందేశం లేదు. అవుటండ్ అవుట్ ఎంటర్‌టైనర్ ఇది`` అన్నారు.
దర్శకుడు ఇ.సత్తిబాబు మాట్లాడుతూ - ``మీలో ఎవరు కోటీశ్వరుడు వంటి ఎంటర్‌టైనింగ్ మూవీ చేయడం చాలా హ్యాపీగా ఉంది. నవీన్ చంద్ర మంచి కో ఆపరేట్ చేశాడు. పృథ్వీరోల్ హీరోకు సమానంగా ఉన్నా, సినిమా సక్సెస్ కావాలనే ఉద్దేశంతో చేసిన సినిమా. వసంత్‌గారు చాలా మంచి సంగీతనందించారు. సినిమా ఫుల్ ఎంటర్‌టైనర్. అందరికీ తప్పకుండా నచ్చుతుంది`` అన్నారు.
పృథ్వీ మాట్లాడుతూ - ``ఈ సినిమాలో వేరియేషన్ స్టార్ వీరబాబు పాత్రలో కనపడతాను. సత్తిబాబుగారు సినిమాను తెరకెక్కించిన తీరు చూసి ఇవివిగారు లేని లోటును తీర్చిన దర్శకుడు సత్తిబాబు మాత్రమే అనిపించింది. ఆడియెన్స్ కోరుకునే అన్నీ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయి`` అన్నారు.
డిజె.వసంత్ మాట్లాడుతూ - ``సినిమాలో అన్నీ పాటలు చక్కగా కుదిరాయి. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్`` అన్నారు.
ఈ కార్యక్రమంలో హీరోయిన్స్ శృతిసోధి, సలోని, సినిమాటోగ్రాఫర్ బాల్‌రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొని చిత్రయూనిట్ను అభినందించారు.