శ్వేత క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించిన చిత్రం `మనీ ఈజ్ హని`.ఈ సినిమా సెన్సార్‌సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్ధమైంది. జె.వి.నాయుడు, రోషన్. ఎం.ఆర్, వెంకీ, అభిషేక్, రచనా స్మిత్, రష్మిజా,బాబు పోకల తదితరులు నటించిన ఈ చిత్రానికి జనార్థన్ శివలంకి దర్శకుడు. జాలె వాసుదేవనాయుడు నిర్మాత. జి.వసంత్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగింది. సి.కల్యాణ్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. బిగ్ సీడీ, ఆడియో సీడీలను సి.కల్యాణ్ విడుదల చేయగా తొలి సీడీని రాజ్ కందుకూరి అందుకున్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో సాయి వెంకట్, ఆర్.కె.గౌడ్, జె.వి.నాయుడు, వసంత్, జనార్ధన్ శివలంకి, రోషన్, జి.ఎం.ఆర్, వెంకీ, ఆశిష్, బాల, భద్రమ్, సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
దర్శకుడు జనార్ధన్ శివలంకి మాట్లాడుతూ - ``9 సంవత్సరాల కష్టమే ఈ సినిమా. మంచి కథ తయారు చేసుకున్న తర్వాత నిర్మాత కోసం వెతుకుతుంటే మా గురువుగారైన జాలె వాసుదేవ నాయుడు సినిమా చేస్తానని అన్నారు. నిర్మాతగా ఆయనెంతో అలరించారు. ప్రతి వ్యక్తికి స్నేహితులున్నంత తోడు ఎవరూ ఉండరు. డబ్బే ప్రధానం కాదు, స్నేహం ముఖ్యం అనే పాయింట్‌తో చేసిన సినిమా. ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని భావిస్తున్నాను`` అన్నారు.
రాజ్ కందుకూరి మాట్లాడుతూ - ``టైటిల్లోనే తియ్యదనం, కొత్తదనం ఉంది. పాటలు బావున్నాయి. ఫ్రెండ్‌ఫిప్ అనే పాయింట్‌పై తీసిన ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
నిర్మాత కె.దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ - ``మంచి టైటిల్, కంటెంట్ ఉన్న చిత్రాలు పెద్ద విజయాలు సాధిస్తున్నాయి. ఈ సినిమా కూడా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
Rachana SmithGlam gallery from the event
నిర్మాత జె.వి.నాయుడు మాట్లాడుతూ - ``నెల్లూరు, తిరుపతిల్లో విద్యాసంస్థలను ప్రారంభించాను. జనార్ధన్ శివలంకి నా శిష్యుడు తను చెప్పిన కథ నాకు నచ్చింది. వెంటనే సినిమా చేద్దామని అన్నాను. మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్. నలుగురు స్నేహితుల మధ్య డబ్బు వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయనేది సినిమాలో చూపిస్తున్నాం. వసంత్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకొస్తాం`` అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ జి.వసంత్ మాట్లాడుతూ - ``మంచి మ్యూజిక్ కుదిరింది. సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్`` అన్నారు.
సి.కల్యాణ్ మాట్లాడుతూ - ``కొత్తవాళ్లైనా, చాలా మంచి కథతో చేసిన సినిమా అని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. సిన్సియారిటీ ఉంటే ఇండస్ట్రీలో సక్సెస్ సాధిస్తారు. పరిశ్రమలో కొత్త నటీనటులు, టెక్నిషియన్స్‌ను ఎంకరేజ్ చేయాలి. మనీ కోసం అందరూ ఇబ్బందులు పడుతున్న ఈ రోజుల్లో మనీ నిజంగానే హనీనా లేదా ..చర్చనీయాంశంగా ఉన్న ఇప్పుడు ఈ టైటిల్‌తో ఈ సినిమా వస్తుంది. జర్నలిస్టుల సంక్షేమం కోసం నేను ఎప్పటి నుండో ఓ సంక్షేమ కార్యక్రమాన్ని చేయాలనుకుంటున్నాను. త్వరలోనే ఆ వివరాలను తెలియజేస్తాను`` అన్నారు.
ఈ చిత్రానికి సంగీతంః జి.వసంత్, సినిమాటోగ్రఫీః రాజా చక్రం, సాహిత్యంః గుంజె శ్రీను, ఎడిటర్ః బి.మహీ, నిర్మాతః జాలె వాసుదేవనాయుడు, రచన, దర్శకత్వంః జనార్ధన్ శివలంకి.