27 September 2016
Hyderabad
నవీన్, నిత్య, శ్రావ్య హీరో హీరోయిన్లుగా ఎస్.వి.సి.ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై పి.వి.గిరి దర్శకత్వంలో రాధాకిషోర్.జి, బిక్షమయ్య సంగం నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం'నందిని నర్సింగ్ హోం'. అచ్చు సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్‌స్టార్ కృష్ణ,శ్రీమతి విజయనిర్మల, సూపర్ స్టార్ మహేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్, సీనియర్ నరేష్, రాజ్ కందుకూరి, సుధీర్‌బాబు, ఎం.ఎస్.రాజు, బి.గోపాల్, ఎ.కోదండరామిరెడ్డి, టీన్యూస్ సంతోష్, తదితరులు పాల్గొన్నారు.
బిగ్ సీడీని సూపర్‌స్టార్ కృష్ణ, శ్రీమతి విజయనిర్మల విడుదల చేశారు.
ఆడియో సీడీలను మహేష్ విడుదల చేసి కృష్ణకు తొలి సీడీని అందించారు.
సూపర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ - ''50 సంవత్సరాల క్రితం తేనెమనసులు సినిమాలో ఆదుర్తి సుబ్బారావుగారు నాతో సహా చాలా మంది కొత్తవాళ్ళతో సక్సెస్ ఫుల్ సినిమా చేశారు. తొలి సినిమాలో ఎలా యాక్ట్ చేయాలో కూడా తెలియదు. ఆయన అందరికీ ట్రైనింగ్ ఇచ్చి సినిమా చేశారు. అయితే ఈ జనరేషన్‌లో అందరూ అన్నీ రంగాల్లో ట్రయినింగ్ తీసుకుని సినిమా ఇండస్ట్రీలోకి వస్తున్నారు. అలాగే నవీన్ కూడా ఫైట్స్, డ్యాన్స్‌లతో పాటు వైజాగ్ సత్యానంద్‌గారి వద్ద నటనలో ట్రయినింగ్ తీసుకుని హీరోగా పరిచయం అవుతున్నాడు. తనకు ప్రేక్షకుల ఆశీర్వాదం ఉంటుందని, నవీన్ సక్సెస్‌ఫుల్ సినిమాలు చేయాలని ఈ సినిమా దర్శక నిర్మాతలకు అభినందనలు'' అన్నారు.
సూపర్‌స్టార్ మహేష్ మాట్లాడుతూ - ''నరేష్‌గారు చాలా గర్వంగా ఉన్నారు. సినిమా పెద్ద హిట్ కావాలి. నవీన్ చిన్నప్పట్నుంచి బాగా తెలుసు. పోకిరి, అతడు సినిమా టైంలో తనతో పరిచయం బాగా ఏర్పడింది. తను మంచి ఎడిటర్, కొన్ని సీన్స్ బాగుండాలని తనను కలిశాం కూడా. తన ఎడిటర్‌గా మంచి టాలెంటెడ్ పర్సన్. నవీన్ ఎడిటర్‌గా ఉన్నప్పుడు ఏం కావాలనుకుంటున్నావ్ అని అడిగాను. యాక్ట్ చేయాలనుకుంటున్నాను అన్నా.. అన్నాడు. తను అప్పుడు లావుగా ఉండేవాడు. దాంతో తను జోక్ చేస్తున్నాడా అని అనుకున్నాను. కానీ ఒక సంవత్సరం తర్వాత తనను కలిశాను. తను సన్నబడటమే కాదు, సిక్స్‌ప్యాక్‌తో ఉన్నాడు. తన డేడికేషన్ చూసి షాకయ్యాను. మనం హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ వస్తుందనే విషయాన్ని నేను బాగా నమ్ముతాను. నవీన్‌కి, ఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ - ''నవీన్‌తో నాకు అతడు సినిమా నుండి పరిచయం. అతడు సినిమాకు నవీన్ ట్రైలర్ కట్ చేశాడు. తను మంచి టాలెంటెడ్ టెక్నిషియన్. ఇప్పుడు హీరోగా కూడా జర్నీ స్టార్ట్ చేస్తున్నాడని తెలిసి తనకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా దర్శక నిర్మాతలకు, ఇతర నటీనటులు, టెక్నిషియన్స్‌కు ఆల్ ది బెస్ట్. నవీన్ ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ - ''నేను నవీన్ బెస్ట్ ఫ్రెండ్స్. చిన్నప్పట్నుంచి ఇద్దరం కలిసే పెరిగాం. తన్నులు తినడం నుండి ఇప్పడు సినిమాలు వరకు కలిసే ఉన్నాం. తనకు ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి. మ్యూజిక్ డైరెక్టర్ అచ్చును మేం కోకోనట్ అని పిలుస్తుంటాం. ఈ సినిమాలో మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
Glam galleries from the event |
|
|
నరేష్ మాట్లాడుతూ - ''నవీన్ ఎడిటర్ అయ్యి మంచి టెక్నిషియన్‌గా పేరు తెచ్చుకున్నాడు. సడెన్‌గా వచ్చి ఓ రోజు హీరో అవుతానంటే షాకయ్యాను. పెద్దల ప్రోత్సాహం,నాయనమ్మ కల, ప్రేక్షకుల అభిమానంతో ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. కథ వినగానే మంచి సినిమా అవుతుందని, ఫస్ట్ సిట్టింగ్‌లోనే ఓకే చేశాం. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మూవీ చేశారు. దిల్‌రాజు సినిమా చూసి సినిమా చాలా బావుంది. చివరి ముప్పై నిమిషాలు ఎక్స్‌ట్రార్డినరీగా ఉందని చెప్పాడు. మంచి టీం ఈ సినిమాకు పనిచేశారు. అచ్చు మంచి మ్యూజిక్ ఇచ్చారు'' అన్నారు.
నవీన్ విజయ్‌కృష్ణ మాట్లాడుతూ - ''చిన్నప్పట్నుంచి మహేష్ అన్న అంటే చిన్నప్పట్నుంచి చాలా ఇష్టం. ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా, టైం కేటాయించి ఈ వేడుకకు రావడం ఆనందంగా ఉంది. నాకు ఇన్‌స్పిరేషన్ కూడా మహేష్ అన్నే. మా విజయ్‌కృష్ణమూవీస్ ప్రివ్యూ థియేటర్‌లో తాతగారు, నాన్నమ్మగారు, నాన్న సినిమాలు చూసి పెరిగాను. నేను ఇక్కడ ఉండటానికి కారణం కృష్ణగారు, నాన్నమ్మ, మహేష్ అన్న, నాన్నగారే కారణం. ఇక సినిమా విషయానికి వస్తే గిరిగారు సినిమాను అద్బుతంగా తీశారు. కథను నేరేట్ చేసినప్పుడే కథ బాగా నచ్చింది. నిర్మాతలు రాధాకిషోర్గారు, బిక్షమయ్య సంగంగారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా తీశారు. నిర్మాతలకు థాంక్స్. అచ్చు నా మిత్రుడు. మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అద్భుతమైన ట్రాక్ ఇచ్చాడు. నా సహ నటులు నిత్య, శ్రావ్యలు ఎంతగానో సపోర్ట్ చేశారు. ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసినప్పటి నుండి నాకు వచ్చిన రెస్పాన్స్ చూసి ఆనందమేసింది. సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్'' అన్నారు.
చిత్ర దర్శకుడు పి.వి.గిరి మాట్లాడుతూ - ''నవీన్‌గారు కథ విని ఫస్ట్ సిట్టింగ్‌లోనే ఓకే చేశారు. తను ఏం చెబితే అది చేసేవారు. క్లైమాక్స్‌లో ఓసీన్‌లో తన నటన చసి మహేష్‌బాబుగారు గుర్తుకు వచ్చారు. మహేష్‌బాబు, మహేష్‌బాబు ఫ్యాన్స్‌కు మంచి సినిమా అవుతుంది'' అన్నారు.
రాజ్ కందుకూరి మాట్లాడుతూ - ''నరేష్ నాకు మంచి మిత్రుడు. నవీన్ నా బిడ్డలాంటివాడు. దర్శక నిర్మాతలకు, టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్'' అన్నారు.
కోటి మాట్లాడుతూ - ''నా పిలుపే ప్రభంజనం సినిమాతో కృష్ణగారే మాకు ఇండస్ట్రీలో రావడానికి కారణమయ్యారు. అలాగే విజయ్‌నిర్మలగారి దర్శకత్వంలో కూడా నేను మ్యూజిక్ చేశాను. నరేష్ తనయుడు విజయ్‌కృష్ణ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అచ్చు మంచి సంగీతాన్ని అందించాడు'' అన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు చిత్రయూనిట్ ను అభినందించారు.
షకలక శంకర్, సప్తగిరి, వెన్నెలకిషోర్, జయప్రకాష్ రెడ్డి, జయప్రకాష్, సంజయ్ స్వరూప్ తదితరులు ఇతర తారాగణంగా నటించిన ఈ చిత్రానికి పాటలు: రెహమాన్, మాటలు: పి.వి.గిరి, సురేష్ ఆరపాటి, కొరియోగ్రఫీ: విజయ్, సంగీతం: అచ్చు, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర, ఆర్ట్: ఎస్.హరిబాబు, నిర్మాతలు: రాధాకిషోర్.జి,బిక్షమయ్య సంగం, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పి.వి.గిరి.