7 December 2016
Hyderabad
రావు రమేష్, హెబ్బా పటేల్, తేజస్వి మడివాడ, అశ్విన్, పార్వతీశం, నోయెల్ సేన్ ప్రధాన తారాగణంగా లక్కీమీడియా బ్యానర్‌పై భాస్కర్ బండి దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్`. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగింది.ఆడియో సీడీలను హీరో నాని విడుదల చేసి సీడీలను దిల్ రాజు, శిరీష్,లక్ష్మణ్ కు అందించారు. ఈ సందర్భంగా....
దర్శకుడు భాస్కర్ బండి మాట్లాడుతూ - ``వినాయక్‌గారు, చోటాగారి వద్ద చాలా విషయాలు తెలుసుకున్నాను. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు. సాయికృష్ణ మంచి కథ అందిస్తే, ప్రసన్న మంచి డైలాగ్స్ అందించారు. శేఖర్ చంద్రగారు మంచి ట్యూన్స్‌తో పాటు మంచి ఆర్.ఆర్. ఇచ్చారు. అలాగే బెక్కం వేణుగోపాల్‌గారు కథను నమ్మి సినిమా డైరెక్టర్‌గా అవకాశం అందించారు.మంచి ప్రాజెక్ట్ రావడానికి అందరూ సపోర్ట్ చేశారు. దిల్‌రాజుగారు సినిమా చూసి బావుందని అప్రిసియేట్ చేయడమే కాకుండా సినిమాను విడుదల చేస్తున్నారు. దిల్‌రాజుగారి వల్ల మా సినిమా మరో స్టెప్ ఎదిగింది. హెబ్బా, తేజస్విని, నోయెల్, అశ్విన్‌బాబు, పార్వతీశం అందరూ సినిమా కోసం చక్కగా పనిచేశారు`` అన్నారు.
మాటల రచయిత ప్రసన్నకుమార్ మాట్లాడుతూ - ``ఆరు నెలల క్రితం గోపిగారు ఈ కథను నాకు వినిపించారు. కథలో నాన్న అనే క్యారెక్టర్ సినిమాను చాలా ముందుకు నడిపించింది. సినిమా చూసిన తర్వాత ప్రతి కూతురు తండ్రి చేయిని ప్రేమగా పట్టుకుంటుంది. రెండు గంటల పాటు పూర్తిగా నవ్విస్తుంది. చివరి ఇరవై నిమిషాలు హార్ట్ టచింగ్‌గా ఉంటుంది. హీరో హీరోయిన్లుగా కథనన నమ్మి వర్క్ చేశారు`` అన్నారు.
మారుతి మాట్లాడుతూ - ``టీజర్ దగ్గర నుండి సినిమాపై మంచి క్రేజ్ వచ్చింది. హెబ్బా లక్కి, లక్కి మీడియాపై వస్తున్న ఈ చిత్రం ఈ సీజన్‌లో పెద్ద హిట్ చిత్రమవుతుంది. భాస్కర్‌కు అండ్ టీంకు ఆల్ ది బెస్ట్`` అన్నారు.
బి.వి.ఎస్.రవి మాట్లాడుతూ - ``బెక్కం వేణుగోపాల్ నాకు బాల్యమిత్రుడు. చాలా కాలంగా ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం. నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్ అనే సినిమాలో పెద్ద కథ ఉంది. ప్రతి యువకుడికి, తండ్రులకు కనెక్ట్ అయ్యే కథ. పార్వతీశం, నోయెల్, అశ్విన్, హెబ్బా, తేజస్విని యూనిట్‌కు ఆల్ ది బెస్ట్`` అన్నారు.
జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ - ``గోపి ఈ సినిమా తర్వాత పెద్ద ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకుంటాడు. కంటెంట్ స్ట్రాంగ్‌గా ఉంది. మ్యూజిక్, డైలాగ్స్ బావున్నాయి. ప్రతి ఫ్రేమ్ చాలా బావుంది. డైరెక్టర్ సినిమాను పదహరేళ్ల కుర్రాడిలా తెరకెక్కించాడు. యూనిట్‌కు ఆల్ ది బెస్ట్`` అన్నారు,.
మధుర శ్రీధర్ మాట్లాడుతూ - ``గోపి ఈ సినిమాతో పెద్ద సక్సెస్ కొడతారు. టీం అందరికీ మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ - ``సినిమాను నమ్మి సినిమా చేసే నిర్మాతలు చాలా తక్కువ మంది ఉన్నారు. అటువంటి తక్కువ మందిలో దిల్‌రాజు ఒకడైతే, బెక్కం వేణుగోపాల్ మరో నిర్మాతలు. వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమా కాబట్టి సినిమా తప్పకుండా మంచి హిట్ అవుతుంది. డైలాగ్ రైటర్ ప్రసన్నలో మంచి ఫ్యూచర్ రైటర్ కనపడ్డాడు. హెబ్బా ప్రూవ్‌డ్ హీరోయిన్. డైరెక్టర్‌కి అండ్ టీంకు నా అభినందనలు`` అన్నారు.
డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ - ``యూనిట్‌కు ఆల్ ది బెస్ట్`` అన్నారు.
Glam galleries from the event |
|
|
త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ - ``గోపి మంచి టెస్ట్‌ఫుల్ నిర్మాత. దిల్‌రాజుగారు కథ నచ్చితేనే సినిమా చేస్తారు. వీరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా అంటే నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాటలు విన్నాను. చాలా బావున్నాయి. హిట్ కావడానికి అన్నీ హంగులున్న సినిమా, కాబట్టి సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ భాస్కర్ ఈ సినిమాతో పరిచయం అవుతున్నందుకు తనకు అభినందనలు. శేఖర్ చంద్ర మంచి మ్యూజిక్ అందించాడు`` అన్నారు.
అశ్విన్ బాబు మాట్లాడుతూ - ``ప్రసన్న అద్భుతమైన డైలాగ్స్ రాశారు. శేఖర్ చంద్ర ట్యూన్స్ బావున్నాయి. తన ఖాతాలో మరో హిట్ పడ్డట్టే. రావు రమేష్‌గారి క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది. తేజు, హెబ్బా మంచి పెర్‌ఫార్మెన్స్ చేశారు. నోయెల్, పార్వతీశంతో కలిసి వర్క్ చేయడం ఆనందంగా ఉంది. సపోర్ట్ చేసిన టీంకు థాంక్స్`` అన్నారు.
పార్వతీశం మాట్లాడుతూ - ``నాపై నమ్మకంతో నాకు చాలా మంచి రోల్. భాస్కర్‌గారు ఎంతో కూల్‌గా హ్యండిల్ చేశారు. ప్రసన్నకుమార్‌గారు, డైరెక్షన్ టీం నాకు ఎంతో సపోర్ట్ చేశారు. చోటాగారి సినిమాటోగ్రఫీలో వర్క్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. మూవీ పెద్ద హిట్ సాధించి నిర్మాతకు లాభాలు, టీంకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
తేజస్విని మాట్లాడుతూ - ``సినిమాలో నేను హెబ్బా బెస్ట్‌ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. ఈ సినిమాలో ఐటెమ్ సాంగ్ కూడా చేశాను`` అన్నారు.
నోయెల్ మాట్లాడుతూ - ``నటుడు కావాలని సింగర్ అయ్యాను. ఇప్పుడు మళ్లీ నటుడు అయ్యాను. నవీన్‌గారు, రవివర్మగారు, కీరవాణిగారు సహా చాలా మంది సపోర్ట్‌తోనే నేను ఈ స్థాయిలో నిలబడుతున్నాను`` అన్నారు.
హెబ్బా పటేల్ మాట్లాడుతూ - ``నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్ చిత్రంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. మంచి టీంతో కలిసి పనిచేసే అవకాశం కలిగింది. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్`` అన్నారు.
శేఖర్ చంద్ర మాట్లాడుతూ - ``లక్కీ మీడియా బ్యానర్లో నేను చేస్తున్న మూడో సినిమా ఇది. గోపిగారికి థాంక్స్. భాస్కర్‌గారు నాకు కావాల్సినంత ఫ్రీడం ఇచ్చి మ్యూజిక్ చేయించుకున్నారు. దిల్‌రాజుగారికి కూడా థాంక్స్. అన్నీ రకాల సాంగ్స్ ఉన్నాయి. సాంగ్స్ అందరికీ నచ్చుతాయి. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్`` అన్నారు.
సందీప్ కిషన్ మాట్లాడుతూ - ``గోపిగారికి దిల్‌రాజుగారి అండ దొరకడం తన అదృష్టం. మంచి టీం ఈ సినిమాకు పనిచేసింది. టీంకు ఆల్ ది బెస్ట్`` అన్నారు.
దిల్‌రాజు మాట్లాడుతూ - ``నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స చిత్రాన్ని జయలలితగారికి డేడికేట్ చేస్తున్నాం. శేఖర్ చంద్ర ప్రతి సాంగ్‌ను డిఫరెంట్‌గా చేశాడు. టీం బాగా కష్టపడి చేశారు. సినిమా చూశాను, నాకు బాగా నచ్చింది. హెబ్బా కోసం యూత్ సినిమా చూస్తారు. కూతురున్న తండ్రి ఈ సినిమా చూస్తారు. అలాగే ప్రతి అమ్మాయి ఈ సినిమా చూస్తుంది. మంచి తండ్రి కూతుళ్ల మధ్య మంచి అనుబంధం ఉండే సినిమా. మ్యూజిక్, ఎంటర్‌టైన్మెంట్ అన్నీ కుదిరిన సినిమా. డిసెంబర్ 16న సినిమా రిలీజ్ అవుతుంది. టీంకు ఆల్ ది బెస్ట్`` అన్నారు.
హీరో నాని మాట్లాడుతూ - ``నేను లోకల్‌కు పనిచేసిన సగం టీం ఈ సినిమాకు పనిచేసింది. హెబ్బా కంటిన్యూ సక్సెస్‌లు కొడుతుంది. ఈ సినిమా కూడా సక్సెస్ కొట్టాలి. తేజస్విని మంచి హైపర్ యాక్టివ్ పర్సన్. ఈ సినిమా తనకు స్టెప్పింగ్ స్టోన్ కావాలి. అలాగే నోయెల్, అశ్విన్, పార్వతీశంకు ఈ సినిమా మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను. శేఖర్ చంద్ర నాకు ఇష్టమైన సంగీత దర్శకుల్లో ఒకరు. గుండె చప్పుడు.. అనే సాంగ్ ఈ ఆల్బమ్‌లో నాకు బాగా నచ్చింది. గోపిగారు చాలా మంచి ప్రొడ్యూసర్. చాలా పాజిటివ్ పర్సన్. దిల్‌రాజుగారు ఈ సినిమాను విడుదల చేస్తుండటం చాలా మంచి విషయం. ఐదు సినిమాలు సెట్స్‌లో ఉన్నా మంచి సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. 2017 దిల్‌రాజుగారికి చాలా మంచి ఏడాది అవుతుంది. టీంకు ఆల్ ది బెస్ట్`` అన్నారు.
రావు రమేష్, హెబ్బా పటేల్, తేజస్వి మడివాడ, అశ్విన్, పార్వతీశం, నోయెల్ సేన్, కృష్ణభగవాన్, సనా, తోటపల్లి మధు, ధనరాజ్, షకలక శంకర్, చమ్మక్ చంద్ర తదితరులు నటించిన ఈ చిత్రానికి కథః బి.సాయికృష్ణ, పాటలుః చంద్రబోస్, భాస్కరభట్ల, వరికుప్పల యాదగిరి, కాసర్ల శ్యామ్, కొరియోగ్రఫీః విజయ్ ప్రకాష్, స్టంట్స్ః వెంకట్, స్క్రీన్‌ప్లే, మాటలుః బి.ప్రసన్నకుమార్, ఎడిటర్ః చోటా కె.ప్రసాద్, ఆర్ట్ః విఠల్ కోసనం, మ్యూజిక్ః శేఖర్ చంద్ర, సినిమాటోగ్రఫీః చోటా కె.నాయుడు, ప్రొడక్షన్ః లక్కీ మీడియా, నిర్మాతః బెక్కం వేణుగోపాల్(గోపి), దర్శకత్వంః భాస్కర్ బండి.