pizza
Naruda DONORuda Music launch
You are at idlebrain.com > News > Functions
Follow Us

27 October 2016
Hyderaba
d

హీరో సుమంత్ కథానాయ‌కుడుగా రూపొందుతోన్న కొత్త చిత్రం `నరుడా..! డోన‌రుడా..!`. అన్న‌పూర్ణ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో ర‌మా రీల్స్‌, ఎస్‌.ఎస్‌.క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌ పై సంయుక్తంగా ఈ చిత్రం రూపొందుతోంది.మ‌ల్లిక్‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రాన్ని వై.సుప్రియ‌, సుధీర్ పూదోట నిర్మిస్తున్నారు. నవంబ‌ర్ 4న సినిమాను రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ సినిమా పాట‌లు విడుద‌ల కార్య‌క్ర‌మం గురువారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఆడియో సీడీల‌ను అక్కినేని నాగార్జున విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా...

నాగార్జున మాట్లాడుతూ ``విక్కీ డోనార్‌ని ఆధారంగా చేసుకుని తీస్తున్నారు. సుమంత్ చాలా రోజుల త‌ర్వాత మంచి స్క్రిప్ట్ తో వ‌స్తున్నాడు. చ‌క్క‌టి కామెడీ రోల్‌ని చేశాడు. బావుంటుంద‌ని న‌మ్మి చేశాడు. హిందీలో ఈ సినిమాలో మెసేజ్ ఉంది. ఎంట‌ర్‌టైన‌ర్ ఉంది. అక్క‌డ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. వీర్య దానం మీద తెర‌కెక్కించారు. భ‌యాలు, కాంప్లెక్స్ లు వంటి వాటికి సంబంధించిన సినిమా. మెసేజ్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్ క‌లిసి రావ‌డం క‌ష్టం. కానీ ఈ సినిమాకు కుదిరాయి. కొత్త‌గా ఉన్న‌ప్పుడు ఏ క‌థ‌నైనా నేను కాద‌న‌ను. ఇలాంటి క‌థ నాకు వ‌చ్చినా చేసేవాడిని. ఇప్పుడు న‌మో వేంక‌టేశా చేస్తున్నా. ఆ త‌ర్వాత కూడా న్యూ జాన‌ర్‌లో ట్రై చేద్దామ‌ని ఓ క‌థ విన్నా. అది విన్న‌ప్ప‌ట నుంచి నిద్ర కూడా ప‌ట్ట‌లేదు. అంత బావుంది`` అని అన్నారు.

అఖిల్ మాట్లాడుతూ ``ఇలాంటి క‌థ చేయ‌డానికి గ‌ట్స్ కావాలి. ఇలాంటి క‌థ‌తో సినిమా చేయాల‌ని నాకూ ఉన్నా నేను చేయ‌లేను. నాకు అన్ని గ‌ట్స్ లేవు. సుమంత్ చాలా మంచి స‌బ్జెక్ట్ తో ముందుకొస్తున్నాడు. హిట్ అవుతుంద‌ని భావిస్తున్నాను`` అని చెప్పారు.

డా.వైజ‌యంతి మాట్లాడుతూ ``వీర్య‌క‌ణం స‌మ‌స్య‌లు అనేవి మ‌హిళ‌ల్లో, పురుషుల్లో ఉంటాయి. కానీ మ‌హిళ‌ల్లో ఉంటాయ‌ని అనుకుంటారు. కానీ అందులో నిజం లేదు. అవ‌గాహ‌న క‌ల్పించే ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి`` అని తెలిపారు.

సంగీత ద‌ర్శ‌కుడు శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ ``8 పాట‌లున్నాయి. త‌ప్ప‌కుండా అంద‌రినీ అల‌రిస్తాయి`` అని చెప్పారు.

సుమంత్ మాట్లాడుతూ ``గోల్కొండ హైస్కూల్ సినిమా చేసేట‌ప్పుడు రామ్మోహ‌న్ నాకు ఈ సినిమా గురించి చెప్పారు. చేయ‌మ‌ని ఐడియా ఇచ్చారు. ఆయ‌న వ‌ల్లే ఈ క‌థ‌ను చూజ్ చేసుకుని చేయ‌డానికి నిర్ణ‌యించుకున్నాను. ఛూజ్ మై డాడ్ అనే ఒక యాప్ చూశా. ఈ సినిమాలో కామెడీ ఉంది. యువ‌త‌కు న‌చ్చేలా ఉంటుంది. ఎక్క‌డా బోర్ కొట్ట‌దు. మంచి సినిమాతో మ‌ర‌లా వ‌స్తున్నందుకు ఆనందంగా ఉంది. నిర్మాణ విలువ‌లు బావుంటాయి. న‌వంబ‌ర్ 4న సినిమాను విడుద‌ల చేస్తున్నాం. మంచి సినిమా అవుతుంది`` అని అన్నారు.

Pallavi Subhash Glam gallery from the event

సుశాంత్ మాట్లాడుతూ ``యు స‌ర్టిఫికెట్ వ‌చ్చింది. కొత్త కోణంలో ఉంది. స్టైల్ అదిరిపోతుంది సుమంత్‌ది `` అని అన్నారు.

మంచు మ‌నోజ్ మాట్లాడుతూ ``ట్రైల‌ర్ చూశాను. ఫెంటాస్టిక్‌గా ఉంది. మ‌న‌ద‌గ్గ‌ర ఎందుకు ఇలాంటి క‌థ‌లు రావ‌ట్లేదా అనుకోవ‌డానికి వీల్లేకుండా మంచి క‌థ వ‌స్తుంది`` అని తెలిపారు.

ల‌క్ష్మీ మంచు మాట్లాడుతూ ``ట్రైల‌ర్ చాలా బాగా క‌ట్ చేశారు. మంచి ఆర్టిస్ట్ సుమంత్‌. సినిమాను ప్రేమించి తీస్తున్న‌వాళ్లు బాగా చేయాలి`` అని అన్నారు.

త‌నికెళ్ల భ‌ర‌ణి మాట్లాడుతూ ``నేను అర‌కులో ఉన్న‌ప్పుడు సుమంత్ ఫోన్ చేసి మీరు హీరోగా ఒక సినిమా చేయాలి అని అన్నారు. నేను హీరో ఏంట‌య్యా అని అన్నాను. వ‌చ్చాక క‌థ వింటే చాలా బాగా అనిపించింది. సినిమా మొత్తం ఉంటాను. ఇలాంటి స‌బ్జెక్ట్ చేయ‌డానికి దైర్యం కావాలి. అంద‌రం త్రిక‌ర‌ణ శుద్ధిగా చేస్తున్నాం. సుమంత్ చాలా బాగా చేశాడు`` అని అన్నారు.

నిర్మాత సుధీర్‌ మాట్లాడుతూ ``సుమంత్‌తో ఇంకో సినిమా కూడా చేయాల‌ని ఉంది. అంత బాగా కోఆప‌రేట్ చేశారు`` అని తెలిపారు.

ప‌ల్ల‌వి సుభాష్ మాట్లాడుతూ ``ఒరిజిన‌ల్ చూశాను. నేను కూడా బాగా చేశాన‌నే భావిస్తున్నాను`` అని చెప్పారు.

ద‌ర్శ‌కుడు మ‌ల్లిక్ రామ్‌ మాట్లాడుతూ ``ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ గోల్కొండ హైస్కూల్ చేశా.. అవకాశం ఈ సినిమాతో వ‌చ్చింది. సుమంత్ గారు ఫోన్ చేసి విక్కీ డోన‌ర్ చూశావా అన్నారు. అప్ప‌టికి చూడ‌లేదు. చూసి ఆయ‌న‌కు ఫోన్ చేశాను. చాలా ఎగ్జ‌యిటింగ్‌గా చేశాను. మ్యూజిక్‌, కెమెరా, ఎడిటింగ్ కూడా సినిమాకు చాలా బాగా హెల్ప్ అయ్యాయి. విక్కీ డోన‌ర్‌ని మ‌న నేటివిటికీ తేవ‌డం క‌ష్టం. అయినా నేటివిటీ మిస్ కాకుండా తెర‌కెక్కించాం`` అని తెలిపారు.

ఈ చిత్రంలో శ్రీల‌క్ష్మి, సుమ‌న్ శెట్టి, భ‌ద్ర‌మ్‌, జ‌బ‌ర్‌ద‌స్త్ శేషు, సుంక‌ర‌ల‌క్ష్మి, పుష్ప‌, చ‌ల‌ప‌తిరాజు ఇత‌ర తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌ణః అన్న‌పూర్ణ స్టూడియోస్‌, సినిమాటోగ్ర‌ఫీః షానియల్ డియో, మ్యూజిక్ః శ్రీర‌ణ్ పాకాల‌, ఎడిట‌ర్ః కార్తీక శ్రీనివాస్‌, ఆర్ట్ః రామ్ అర‌స‌వెల్లి, డైలాగ్స్ః కిట్టు విస్సాప్ర‌గ‌డ‌, సాగ‌ర్ రాచ‌కొండ‌, లైన్ ప్రొడ్యూస‌ర్ః డా. అనిల్ విశ్వ‌నాథ్‌, నిర్మాత‌లుః వై.సుప్రియ‌, సుధీర్ పూదోట‌, ద‌ర్శ‌క‌త్వంః మ‌ల్లిక్ రామ్‌.

 

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved