కిషోర్ స్వీయదర్శకత్వంలో బిగ్ విగ్ మూవీ ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం `ఓ పిల్లా నీ వల్లా`. కృష్ణచైతన్య, రాజేష్ రాథోడ్, మోనికా సింగ్, షాలు చారసియా ప్రధానతారాగణం. కిషోర్ దర్శక నిర్మాణంలో సినిమా రూపొందింది.మధు పొన్నాస్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
ఈ కార్యక్రమంలో బెల్లం కొండ సురేష్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జానీ మాస్టర్, లగడపాటి శ్రీధర్, లోహిత్‌కుమార్, రాజ్‌కందుకూరి తదితరులు పాల్గొన్నారు.
రాజ్ కందుకూరి థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. బిగ్ సీడీని బెల్లం కొండ సురేష్ విడుదల చేశారు. ఆడియో సీడీలను బెల్లం కొండ సురేష్ విడుదల చేసి జానీ మాస్టర్‌కు అందించారు.
రాజ్ కందుకూరి మాట్లాడుతూ - ``ఓ పిల్లా నీ వల్లా టైటిల్ చాలా బావుంది. మధు పొన్నా చాలా చక్కగా మ్యూజిక్ ఇచ్చాడు. సినిమాలో మెలోడి సాంగ్‌తో సహా మాస్ సాంగ్ కూడా బాగా నచ్చింది. కిషోర్ చాలా రోజులుగా తెలుసు. తనకు సినిమాలంటే ఉన్న ప్యాషన్ నాకు తెలుసు. కచ్చితంగా సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు.
సుదీర్ రెడ్డి మాట్లాడుతూ - `` పాట చాలా బావుంది. సినిమా పెద్ద హిట్ అయ్యి హీరో హీరోయిన్స్ సహా ఇతర నటీనటులకు టెక్నిషియన్స్, దర్శక నిర్మాతలకు మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాం`` అన్నారు.
జానీ మాస్టర్ మాట్లాడుతూ - ``పాటలు చాలా బావున్నాయి. మధు అందించిన సాంగ్స్ ఎంతో బావున్నాయి. కిషోర్‌కు ఈ సినిమా దర్శకుడుగా మంచి బ్రేక్ తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నాను. ఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్`` అన్నారు.
లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ - `` సాధారణంగా అమ్మాయిల వల్ల అబ్బాయిల జీవితాలు మారిపోతాయని మనం వింటూ ఉంటాం. మరి ఈ సినిమాలో అమ్మాయి వల్ల ఏం జరిగిందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. డెఫనెట్‌గా యూత్ సహా అందరికీ నచ్చే సినిమా అవుతుందనుకుంటున్నాను. దర్శకుడుగా, నిర్మాతగా కిషోర్ చేస్తున్న తొలి ప్రయత్నం పెద్ద సక్సెస్ కావాలి. కృష్ణచైతన్య, రాజేష్ రాథోడ్, మోనికా సింగ్, షాలు చారసియాలకు ఈ సినిమా పెద్ద పేరు తీసుకు రావాలి`` అన్నారు.
లోహిత్ కుమార్ మాట్లాడుతూ - ``సినిమాను తీయడమే కాకుండా సినిమాను అందరికీ రీచ్ అయ్యేలా చేసిన దర్శక నిర్మాత కిషోర్‌ను ముందుగా అభినందిస్తున్నాను.
మోనికా రాథోడ్ మాట్లాడుతూ - ``మాకు సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్. కిషోర్‌గారు అద్భుతమైన అవకాశం ఇచ్చారు. సినిమాను పెద్ద హిట్ చేయాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాను`` అన్నారు.
షాలూ చారసియా మాట్లాడుతూ - ``సాంగ్స్, ట్రైలర్ అందరికీ నచ్చాయనే అనుకుంటున్నాను. టీం ఎంతో హార్డ్ వర్క్ చేశాం. కిషోర్‌గారు సినిమాను బాగా డైరెక్ట్ చేస్తే మధుగారు బ్యూటీఫుల్ మ్యూజిక్ అందించారు`` అన్నారు.
హీరో కృష్ణ చైతన్య మాట్లాడుతూ - ``సినిమా కోసం చాలా కష్టపడ్డాం. దర్శక నిర్మాత కిషోర్‌గారి వల్లే ఈరోజు నేనిక్కడ నిలబడి ఉన్నాను. మధుగారు ఎక్సలెంట్ మ్యూజిక్ అందించారు. ప్రేక్షకుల సహకారం అందించాలని కోరుకుంటున్నాం`` అన్నారు.
హీరో రాజేష్ రాథోడ్ మాట్లాడుతూ - ``మా తల్లిదండ్రులకు థాంక్స్. విజయ్ అన్న, నా స్నేహితులు నాకెంతో సపోర్ట్ చేశారు. అన్నీ ఎలిమెంట్స్ ఉన్న క్రేజ్ మూవీ. కిషోర్ గారు డౌన్ టు ఎర్త్ పర్సన్. మ్యూజిక్ డైరెక్టర్ మధుగారు మంచి పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు.
మ్యూజిక్ డైరెక్టర్ మధు పొన్నాస్ మాట్లాడుతూ - ``నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన కిషోర్‌గారికి థాంక్స్. సినిమా బాగా వచ్చింది. అందరికీ నచ్చుతుంది`` అన్నారు.
దర్శక నిర్మాత కిషోర్ మాట్లాడుతూ - ``మాటలు రావడం లేదు. సినిమా డబుల్ ఎనర్జీతో ఉంటుంది. అమ్మాయి వల్ల ఇద్దరు స్నేహితులు మధ్య ఏం జరిగిందనేదే ఈ సినిమాలో చూపిస్తున్నాం. మధుగారు చాలా మంచి సంగీతాన్నిచ్చారుఅందరూ చక్కగా సపోర్ట్ చేశారు. తమ సినిమాగా భావించి చేయడంతో సినిమా బాగా వచ్చింది. ప్రేక్షకులు ఈ సినిమాను హిట్ చేసి సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాం`` అన్నారు.
బెల్లం కొండ సురేష్ మాట్లాడుతూ - ``కొత్త దర్శకుడు కిషోర్ డైరెక్ట్ చేయడమే కాకుండా ప్రొడ్యూస్ చేయడం గొప్ప విషయం. మధు ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చారు. మంచి ఎక్స్‌పీరియెన్స్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్‌లా సంగీతాన్నందించారు. దర్శక నిర్మాతలు సహా అందరికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు.
కృష్ణచైతన్య, రాజేష్ రాథోడ్, మోనికా సింగ్, షాలు చౌరాసియా , సూర్య శ్రీనివాస్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సాహిత్యంః కృష్ణ మదినేని, కరుణాకర్ అడిగర్ల, కోరియేగ్రాఫర్ :జీతెంద్ర సినిమాటోగ్రఫీః షోయబ్ అహ్మద్ కె.ఎం., ఎడిటర్ః అనిల్ కింతాడ సహా నిర్మాత : మౌర్యా సంగీతంః మధు పొన్నాస్, నిర్మాతః కిషోర్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వంః కిషోర్.