pizza
Pilla Rakshasi Music launch
అల్లరి నరేశ్ చేతుల మీదుగా పిల్ల రాక్షసి ఆడియో విడుదల
You are at idlebrain.com > News > Functions
Follow Us

21 October 2016
Hyderaba
d

బిచ్చగాడు` వంటి సెన్సేషనల్ హిట్ చిత్రాన్ని అందించిన శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వేంక‌టేశ్వ‌ర ఫిలింస్ ప‌తాకంపై చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి అందిస్తున్న మరో చిత్రం పిల్ల రాక్షసి. మ‌ల‌యాళంలో ఘ‌న విజయం సాధించిన `ఆన్ మ‌రియ క‌లిప్పిలాను` తెలుగులో `పిల్ల రాక్షసి` పేరుతో నవంబర్ 4న విడుదల చేస్తున్నారు. `బిచ్చ‌గాడు` చిత్రానికి తెలుగులో మాట‌లు, పాటలు అందించిన ర‌చ‌యిత భాషాశ్రీ మ‌ల‌యాళ చిత్రం `ఆన్ మ‌రియ క‌లిప్పిలాను` తెలుగు అనువాదానికి మాట‌లు, పాట‌లు అందించారు. ఓ ఫ్రాడ్‌స్ట‌ర్‌తో చిన్నారి చేసిన సావాసం ఎలాంటి ప‌రిణామాల‌కు దారి తీసింద‌నే కాన్సెప్ట్ తో రూపొందిన సినిమానే పిల్ల రాక్షసి. ఈ సినిమా ఆడియో, ట్రైలర్ లను హీరో నరేశ్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు.

హీరో నరేశ్ మాట్లాడుతూ `` బిచ్చగాడులాంటి సినిమాను తెలుగు ప్రేక్షకులకోసం వందరోజులపాటు ఆడేలా చూసిన నిర్మాతల నుండి పిల్ల రాక్షసి అనే సినిమా వస్తుందంటేనే వాళ్ళ అభిరుచి ఎంతబాగుందో అర్థమైపోతోంది. తెలుగులో విభిన్న కాన్సెప్టులతో వస్తున్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మళయాళంలో పెద్ద విజయం సాధించిన ఈ సినిమా తెలుగులో కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను`` అని అన్నారు.

Leona Lishoy Glam gallery from the event

చదలవాడ తిరుపతి రావు మాట్లాడుతూ ``ఈ చిత్రంలో న‌టించిన అమ్మాయి భవిష్యత్తులో శ్రీదేవిలా పెద్ద హీరోయిన్ అవుతుంది. పిల్ల రాక్షసి పెద్ద విజయాన్ని అందుకుంటుందని నేను ఆశిస్తున్నాను`` అని చెప్పారు.

హీరోయిన్ జాన్ కైప్పలిల్ మాట్లాడుతూ `` ఈ సినిమా తెలుగులోకి తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉంది. మా అందరికీ నిజంగా లైఫ్ ఇచ్చింది. తెలుగులో ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను`` అని అన్నారు.

దర్శకుడు మిథున్ మాట్లాడుతూ ' మమ్మల్నందరినీ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న చదలవాడ లక్ష్మణ్ కి ధన్యవాదాలు. తెలుగు ప్రేక్షకులకు పిల్ల రాక్షసి తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నాం``అని తెలిపారు.

చదలవాడ లక్ష్మణ్ మాట్లాడుతూ ``మంచి సినిమా ఏదైనా ఎలాంటి బౌండరీలు లేకుండా అందరికీ చేరాలన్నదే మా లక్ష్యం. అందుకే బిచ్చగాడు సినిమాను తెలుగు ప్రేక్షకుల దగ్గరికి తీసుకొచ్చాం. ఇప్పుడు పిల్లరాక్షసి సినిమాను తెలుగు ప్రేక్షకుల కోసం నవంబర్ 4న విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాం`` అని చెప్పారు.

`ఓకే బంగారం` ఫేం దుల్కర్ స‌ల్మాన్ ఓ ముఖ్య అతిధిగా న‌టించ‌గా, సారా అర్జున్‌ టైటిల్ పాత్ర‌లో న‌టించింది. స‌న్ని వాయ్‌నే, అజు వ‌ర్గీస్ ఇత‌ర‌ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.

 

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved