18 October 2016
Hyderabad
రంజిత్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం `రెండు ఆత్మల ప్రేమకథ`. స్వరూప ఆర్ట్స్ పతాకంపై కుర్ర రాజలింగు ఈ చిత్రాన్ని నిర్మించారు. సన హీరోయిన్ గా నటించింది. సదివే దేవేందర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఆడియో సీడీలను దర్శక నిర్మాత లయన్ సాయి వెంకట్ విడుదల చేసి తొలి సీడీని ప్రముఖ నటుడు వైజాగ్ ప్రసాద్ కు అందించారు. అనంతరం లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ...``రెండు ఆత్మల ప్రేమకథ` టైటిల్ చాలా బావుంది. పాటలు కూడా వినసొంపుగా ఉన్నాయి. ట్రైలర్ చూశాక నాకు అర్ధమైందేమిటంటే...ఇదొక హర్రర్ కామెడీ ఎంటర్ టైనర్ ఫిలిం అని. ఇటీవల కాలంలో ఇలాంటి చిత్రాలు విజయం సాధిస్తున్నాయి. ఆ చిత్రాల తరహాలోనే ఈ సినిమా కూడా సక్సెస్ కావాలని ఆశిస్తున్నా. దర్శకుడులో తపన నాకు బాగా నచ్చింది. హీరోగా, దర్శకుడుగా రెండు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాడు`` అని అన్నారు
ప్రముఖ నటుడు వైజాగ్ ప్రసాద్ మాట్లాడుతూ..``సినిమా తీయడం చాలా ఈజీ. విడుదల చేయడమే కష్టం. ఈ చిత్ర దర్శక నిర్మాతలు సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చి సరైన పబ్లిసిటీతో రిలీజ్ చేయాలని కోరుకుంటున్నా. పాటలు, ట్రైలర్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. టీమ్ అందరికీ నా శుభాకాంక్షలు`` అని అన్నారు.
చిత్ర నిర్మాత కుర్ర రాజలింగు మాట్లాడుతూ...`పదేళ్ల నుంచి సినిమా ఇండస్ర్టీలోకి రావాలనుకుంటున్నా. ఈ క్రమంలో దర్శకుడు రంజిత్ `రెండు ఆత్మల కథ` లైన్ వినిపించారు. నాకు నచ్చి వెంటనే ప్రారంభించాను. చెప్పిన దానికంటే కూడా దర్శకుడు చాలా బాగా తీశాడు. భవిష్యత్ లో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నా. మా తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా`` అని అన్నారు.
చిత్ర దర్శకుడు రంజిత్ కుమార్ మాట్లాడుతూ...``నా గురువు బల్లెం వేణుమాధవ్ గారి పూర్తి సహకారంతో ఈ సినిమా చేశాను. ఈ కథ అనుకున్నాక హీరో కోసం చాలా మందిని చూసాం. కానీ, కథకు సరిపోయే వారు దొరకకపోవడంతో నేను హీరోగా చేయాల్సి వచ్చింది. దర్శకుడుగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలన్నదే నా లక్ష్యం. ఈ సినిమాని హర్రర్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించాము. మా నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. నా వర్క్ నచ్చి వెంటనే మరో సినిమా చేసే అవకాశం కూడా కల్పించారు. అలాగే `ప్రేమజంట`, `ప్రేమ గోల` చిత్రాలకు డైరక్షన్ చేస్తున్నా. వీటిని ఇద్దరు యువ నిర్మాతలు నిర్మించనున్నారు. త్వరలో గ్రాండ్ గా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొని అవకాశం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు.
సంధ్యశ్రీ, కావ్య, వీరు, సిద్దు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతంః సదివే దేవేందర్, కెమెరాః కారె సతీష్ కుమార్, ఎడిటర్ః ధీరజ్ ఆర్ట్స్ , నిర్మాతః కుర్ర రాజలింగు, కథ-మాటలు-స్ర్కీన్ ప్లే-దర్శకత్వంః రంజిత్ కుమార్ (దుగ్గిరాల నాగేశ్వరరావు).