pizza
Saptagiri Express music launch
`సప్తగిరి ఎక్స్‌ ప్రెస్‌` ఆడియో విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

6 November 2016
Hyderaba
d

సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై.లి బ్యానర్‌పై సప్తగిరి, రోషిణి ప్రకాష్‌ హీరో హీరోయిన్లుగా అరుణ్‌ పవార్‌ దర్శకత్వంలో డా.కె.రవికిరణ్‌ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌స‌. విజ‌య్ బుల్‌గానిన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం ఆదివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది.

ఆడియో కార్య‌క్ర‌మానికి ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ముఖ్య అతిథిగా హాజ‌రై బిగ్ సీడీ, ఆడియో సీడీలను ఆవిష్కరించారు. తొలి సీడీని సప్తగిరి అందుకున్నారు.

ఇంకా కార్య‌క్ర‌మంలో ఆలీ, హేమ‌, ఎడిట‌ర్ గౌతంరాజు, ఎన్‌.శివ‌ప్ర‌సాద్‌, మారుతి, రాంప్ర‌సాద్‌, సింధూర‌పువ్వు కృష్ణారెడ్డి, శరత్ మరార్, సునీల్, నాగఅన్వేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాట్లాడుతూ - ``అభిమానుల ప్రేమ‌కు నేను స్పందిస్తాను కాబ‌ట్టే ఇక్క‌డ‌కు వ‌చ్చాను. గ‌బ్బ‌ర్‌సింగ్‌లో స‌ప్త‌గిరి యాక్ట్ చేసిన సీన్‌ను చూసి అప్ప‌ట్లో బాగా ఎంజాయ్ చేశాను. అప్ప‌టి నుండి స‌ప్త‌గిరిని క‌ల‌వాల‌నుకునేవాడిని, కుద‌ర‌లేదు. ఇప్ప‌టికీ కుదిరింది. నేను ఇప్పుడు చేస్తున్న సినిమాకు కాట‌మ‌రాయుడు అనే టైటిల్ పెడ‌దామ‌నుకున్నాం. కానీ అప్ప‌టికే ఈ సినిమాకు ఆ టైటిల్‌ను అనుకున్నారు. సినిమా కూడా ఎన‌బై శాతం పూర్త‌య్యింది. కానీ మాకు అవ‌స‌ర‌మ‌ని తెలియ‌డంతో వారు ఆ టైటిల్‌ను మాకిచ్చేశారు. అందుకు వారికి థాంక్స్‌. నేను త‌క్కువ‌గా సినిమాలు చూస్తుంటాను. ఈ స‌ప్త‌గిరి సినిమా న‌టించిన స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్ సినిమా చూడాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స‌ప్త‌గిరి న‌ట‌న‌లో ఎన‌ర్జీ, డ్యాన్స్ పెర్‌ఫార్మెన్స్‌, కామెడి టైమింగ్ న‌చ్చింది. ఈ సినిమాను క‌చ్చితంగా షో వేసుకుని చూస్తాను. అరుణ్ ప‌వార్, నా మిత్రుడు త్రివిక్ర‌మ్ ద‌గ్గ‌ర వ‌ర్క్ చేశాడు. స‌ర్దార్ సినిమాకు అరుణ్ ఎంతో హెల్ప్ చేశాడు. ఈ సందర్భంగా అరుణ్‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను. విజ‌య్ బుల్‌గానిని మ్యూజిక్ బావుంది. పాట‌లు బావున్నాయి. భ‌విష్య‌త్‌తో త‌
ను గొప్ప మ్యూజిక్ డైరెక్ట‌ర్ అవుతాడ‌ని భావిస్తున్నాను. సినిమా అద్భుతమైన విజ‌యం సాధించాల‌ని, ఇందులో న‌టించిన వారంద‌రికీ పేరుపేరునా, మంచి పేరు రావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను`` అన్నారు.

స‌ప్త‌గిరి మాట్లాడుతూ - ``మెగాభిమానుల మ‌ధ్య మెగా అభిమాని ఆడియో ఫంక్ష‌న్ జ‌రుగుతుంద‌ని నేను ఊహించుకోలేదు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ చేతులు మీదుగా ఆడియో విడుద‌ల కావ‌డం ఆనందంగా ఉంది. పుట్టిన‌ప్ప‌టి నుండి మెగాస్టార్ చిరంజీవిగారిని చూస్తూ పెరిగాను, అభిమానిస్తూ పెరిగాను. ఆరాధిస్తూ పెరిగాను. నేను నిజాయితీప‌రుడైన అభిమానిని కాబ‌ట్టి నా వేడుక‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్‌గారు వ‌చ్చారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌గారికి నేను ఆజ‌న్మాంతం రుణ‌ప‌డ్డాను. మాట‌లు రావ‌డం లేదు. చ‌రిత్ర సృష్టించే వ్య‌క్తుల‌ను నేను చూడ‌లేదు. కానీ ఈరోజు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌గారిని ద‌గ్గ‌ర నుండి చూస్తున్నాను. కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే అభిమానాన్ని నాకు అందించినందుకు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌గారికి థాంక్స్‌. మ‌న‌సంతా భావోద్వేగం నిండిపోయింది. ఆయ‌న కోసం ఎంత దూరం న‌డ‌వ‌డానికైనా, ఆయ‌న పిలుపు కోసం వెయిట్ చేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్‌ను చిరంజీవిగారు టీవీలో చూస్తుంటే ఆయ‌న‌కు నా పాదాభివంద‌నాలు తెలియ‌జేస్తున్నాను. మెగాభిమానులకు పాదాభివంద‌నం చేస్తున్నాను`` అన్నారు.

మారుతి మాట్లాడుతూ - ``స‌ప్త‌గిరికి త‌న‌పై ఉన్న కాన్ఫిడెల్స్ లెవ‌ల్స్‌కు మెచ్చుకోవాలి. ఈ సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అవుతున్న స‌ప్త‌గిరి మంచి స్థాయికి చేరుకోవాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

Glam galleries from the event

ద‌ర్శ‌కుడు అరుణ్ ప‌వార్ మాట్లాడుతూ - ``త్రివిక్ర‌మ్‌గారి ద‌గ్గ‌ర ప‌నిచేసేట‌ప్పుడు ఒక వ్య‌క్తి ఎలా మాట్లాడాలి..ఎలా ఉండాలి., సినిమా ఎలా తీయాలో నేర్చుకున్నాను. ఆయ‌న వెనుక న‌డుస్తూనే సినిమా గురించి తెలుసుకున్నాను. ఈ సినిమా విష‌యంలో నాకు నిర్మాత‌గారు ఎంతో స‌పోర్ట్ చేశారు. స‌ప్త‌గిరి నాకు ద‌ర్శ‌కుడిగా అవ‌కాశం ఇచ్చినందుకు థాంక్స్‌. సినిమా బాగా వ‌చ్చింది. ప‌వ‌న్ క‌ల్యాణ్‌గారు మ‌మ్మ‌ల్ని ఎంక‌రేజ్ చేయ‌డానికి ఇక్క‌డికి వ‌చ్చినందుకు థాంక్స్‌`` అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ విజ‌య్ బుల్‌గానిన్ మాట్లాడుతూ - ``నాకు ఈ సినిమాలో అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌. స‌ప్త‌గిరిగారు నాకు ఈ సినిమాతో అవ‌కాశం ఇవ్వ‌లేదు. అన్నం పెట్టార‌నుకుంటున్నాను. మంచి టీం స‌పోర్ట్‌తో సినిమా బాగా చేశాం`` అన్నారు.

నిర్మాత డా.కె.ర‌వికిర‌ణ్ మాట్లాడుతూ - ``తండ్రి కొడుకుల మ‌ధ్య సంబంధాన్ని తెలియ‌జేసే ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. కామెడి, జ‌రుగుతున్న అన్యాయాల‌పై ఎదురు తిరుగుతూ హీరో ప‌డే తాప‌త్ర‌యం ఈ సినిమాలో క‌న‌ప‌డుతుంది. స‌ప్త‌గిరి అద్భుత‌మైన పెర్‌ఫార్మెన్స్ చేశాడు. గౌతంరాజుగారి ఎడిటింగ్ వ‌ర్క్‌, బుల్‌గానిన్ సంగీతం, రాంప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అన్నీ ప‌క్కాగా కుదిరాయి. సినిమా అంద‌రికీ త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది`` అన్నారు.

హేమ మాట్లాడుతూ - ``నేను కామెడి క్యారెక్ట‌ర్స్‌, మ‌ద‌ర్ క్యారెక్ట‌ర్స్ చేసుకుంటూ వ‌స్తున్నాను. అయితే ఈ సినిమా కోసం స‌ప్త‌గిరిగారు పిలిచి విల‌న్ వేషం ఉంది చేయ‌మ‌ని చెప్పారు. చాలా మంచి రోల్ చేయ‌డం ఆనందంగా ఉంది. యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

అలీ మాట్లాడుతూ - ``స‌ప్త‌గిరితో సినిమా చేసిన నిర్మాత‌లు అభినంద‌న‌లు. రాజ‌బాబుగారు అప్ప‌ట్లో స‌ర్కార్ ఎక్స్‌ప్రెస్ అనే సినిమా చేశారు. అప్ప‌ట్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలుసు. ఇప్పుడు స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్ వ‌స్తుంది. స‌ప్త‌గిరి, అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా స్టార్ట‌య్యి, కమెడియ‌న్‌గా మారి, ఇప్పుడు హీరో అయ్యాడు. త‌న‌కు ప్రేక్ష‌క దేవుళ్ల ఆశీర్వాదాలుండాల‌ని కోరుకుంటాను. స‌ప్త‌గిరి మంచి క‌థ‌ను తీసుకుని మంచి టెక్నిషియ‌న్స్‌తో సినిమా చేశాడు. ఈ సినిమా ఎక్స్‌ప్రెస్‌లా ఎక్క‌డా ఆగ‌కుండా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

సప్తగిరి, రోషిణి ప్రకాష్‌, శివప్రసాద్‌, అలీ, పోసాని కృష్ణమురళి, షాయాజీ షిండే, తులసి, షకలక శంకర్‌ తదితరలు నటించిన ఈ చిత్రానికి రచనా సహకారం: గోపిని రుణాకర్‌, ఆర్ట్‌: కుమార్‌, స్టంట్స్‌: జాషువా, సాహిత్యం: రామ్‌ పైడిశెట్టి, సురేష్‌ బానిశెట్టి,క్రియేటివ్‌ హెడ్‌: అమిరి శెట్టి గోపాల్‌, కొరియోగ్రఫీ: భాను, డైలాగ్స్‌: రాజశేఖర్‌ రెడ్డి పులిచెర్ల, మ్యూజిక్‌: బుల్‌గానిన్‌, ఎడిటర్‌: గౌతంరాజు, సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్‌, ఆడిషనల్‌ స్టోరీ, స్క్రీన్‌ప్లే: ఎ సప్తగిరి ప్రాజెక్ట్‌, కో ప్రొడ్యూసర్‌: డా.వాణి రవికిరణ్‌,నిర్మాత: డా.కె.రవికిరణ్‌, దర్శకత్వం: అరుణ్‌ పవార్‌.

 

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved