pizza
Mixture Potlam audio success meet
`మిక్చ‌ర్ పొట్లం` ఆడియో స‌క్సెస్ మీట్
You are at idlebrain.com > News > Functions
Follow Us

10 March 2017
Hyderaba
d

జ‌యంత్, శ్వేతా బ‌సు ప్ర‌సాద్, గీతాజంలి హీరో, హీరోయిన్ల‌గా న‌టిస్తోన్న చిత్రం `మిక్చ‌ర్ పొట్లం`. స‌తీష్ కుమార్ ఎం.వి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గోదావ‌రి సినీ టోన్ ప‌తాకంపై ల‌యన్ క‌ల‌ప‌ట‌పు శ్రీ ల‌క్ష్మి ప్ర‌సాద్, కంటె వీర‌న్న చౌద‌రి, లంక‌ల ప‌ల్లి శ్రీనివాస‌రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మాద‌వ పెద్ద సురేష్ చంద్ర సంగీతం అందించిన ఆడియా ఇటీవ‌లే మార్కెట్ లోకి విడుద‌లై శ్రోత‌ల్ని విశేషంగా ఆక‌ట్ట‌కుంటోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ శుక్ర‌వారం ఉద‌యం హైద‌రాబాద్ లో ఆడియో స‌క్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది.

ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శకుడు స‌తీష్ కుమార్ మాట్లాడుతూ `` ఇటీవ‌ల విడుద‌లైన పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సీనియ‌ర్ టెక్నిష‌య‌న్స్ మా సినిమాకు ప‌నిచేయ‌డం వ‌ల‌నే ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వ‌స్తోంది. ముఖ్యంగా సిగ‌ర్ సుచిత్ర ఆల‌పించిన హ‌లో బేబి పాట‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. మాద‌వ పెద్ది సురేష్ గారు నేటి యువ‌త ప‌ల్స్ ప‌ట్టుకుని మంచి ట్యూన్స్ స‌మ‌కూర్చారు. ట్యూన్స్ తో పాటు, పాట‌లో సాహిత్యం కూడా అర్ధ‌వంతంగా ఉంది. తొలి కాపీ సిద్ద‌మైంది. మార్చి నెల‌ఖ‌రుక‌ల్లా సినిమా విడుద‌ల చేస్తాం. సినిమా మంచి విజ‌యం సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది` అని అన్నారు.

నిర్మాత కంటె వీర‌న్న చౌద‌రి మాట్లాడుతూ `` దుర్గ సినీ టోన్ పేరుతో 1936లో రాజ‌మండ్రిలో తొలిసారి ఓ స్టూడియోను ఏర్పాటు చేశారు. ద‌క్షిణాదిన అదే తొలి ఫిల్మ్ స్టూడియో. అందుకే గోదావ‌రి సినీ టోన్ గా మా బ్యాన‌ర్ పేరు పెట్టాం. షూటింగ్ అంతా రాజ‌మండ్రి అందాల‌ను మ‌రింత ఎలివేట్ చేస్తూ తెర‌కెక్కించా. మంచి అవుట్ ఫుట్ వ‌చ్చింది. సినిమాలంటే చిన్న‌ప్ప‌టి నుంచి ఫ్యాష‌న్. కానీ న‌టించ‌డం కుద‌ర‌లేదు. న‌టుడిగా నా తొలి సినిమా `ఒక మన‌సు`. ఇప్పుడు ఈ చిత్రంలో ఫుల్ లెంగ్త్ రోల్ పోషిస్తున్నా. సినిమాల‌పై నా ఫ్యాష‌న్ ను ఇలాగే కొన‌సాగించాల‌నుకుంటున్నా. భ‌విష్య‌త్లులో మంచి పాత్ర‌లు వ‌స్తాయ‌ని ఆశిస్తున్నా` అని అన్నారు.

Geethanjali Glam gallery from the event

మ‌రో నిర్మాత‌ క‌ల‌ప‌ట‌పు ల‌క్ష్మీ ప్ర‌సాద్ మాట్లాడుతూ ` నిర్మాత‌గా మా తొలి ప్ర‌త‌య్నం `మిక్చ‌ర్ పొట్లం`. హీరో, హీరోయిన్లు కొత్త వాళ్లైనా మిగ‌తా న‌టీన‌టులు, టెక్నిషీయ‌న్లు అంతా సీనియ‌ర్లున్నారు. క‌థ‌ను ద‌ర్శ‌కుడు త‌ను అనుకున్న విధంగా తెర‌కెక్కించాడు. మాద‌వ పెద్ది సురేష్ గారు గ‌తంలో ఎన్నో హిట్ సినిమాల‌కు సంగీతం అందించారు. మ‌ళ్లీ ఇప్పుడు మా సినిమాకు సంగీతం చేయ‌డం అదృష్టంగా భావిస్తున్నాం. మంచి పాట‌లు కుదిరాయి కాబ‌ట్టే శ్రోత‌ల్ని ఆక‌ట్టుకున్నాయి. కుటుంబ స‌మేతంగా క‌లిసి చూడ‌ద‌గ్గ చ‌క్క‌ని సినిమా ఇది. ఇటీవ‌ల విడుద‌లైన పాట‌ల‌ను మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. సినిమా కూడా ఆ స్థాయి ఆద‌రణ ల‌భిస్తుంద‌ని ఆశిస్తున్నాం` అని అన్నారు.

మ‌రో నిర్మాత లంక‌ల‌ప‌ల్లి శ్రీనివాస‌రావు మాట్లాడుతూ ` తొలి కాపీ సిద్ద‌మైంది. త్వ‌ర‌లోనే సినిమా రిలీజ్ చేస్తాం. పాట‌ల‌ను ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్ష‌కుల‌కు కృత‌జ్ఞ‌త‌లు. సినిమా కూడా మంచి హిట్ అవుతుందిని ఆశిస్తున్నాం` అని అన్నారు.

సంగీత ద‌ర్శకుడు మాద‌వ‌పెద్ది సురేష్ మాట్లాడుతూ ` నిర్మాత‌లు ముగ్గురు ఎంతో ఫ్యాష‌న్ తో సినిమా నిర్మించారు. డ‌బ్బు కోసం కాదు మంచి సినిమా తీయాల‌న్న ఉద్దేశంతో ఈ క‌థ‌ను తెర‌పైకి తీసుకొస్తున్నారు. ఇలాంటి మర‌న్ని మంచి సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నా. ఈ చిత్రంలో అన్ని పాట‌ల్లోనూ ష‌డ్రుచులున్నాయి. నేటి యువ‌త‌రానికి త‌గ్గ‌ట్టు మంచి పాట‌లు కుదిరాయి. సుచిత్ర‌, ఎస్. పి బాల‌సుబ్ర‌మ‌ణ్యం, వెన్నెల‌కంటి వంటి మంచి టెక్నీషియ‌న్లు కుద‌ర‌డం వ‌ల్లే మంచి ట్యూన్స్ అందివ్వ‌గ‌లిగాను. ద‌ర్శ‌కుడు క‌థ‌ను అద్బుతంగా తెర‌కెక్కించాడు. బాపు-ర‌మ‌ణ ల‌కు ఈ చిత్రాన్ని అంకితం చేస్తున్నాం` అని అన్నారు.

సినిమాలో అవ‌కాశం ప‌ట్ల హీరోయిన్ గీతాంజ‌లి ఆనందం వ్య‌క్తం చేసింది. ఈ వేడుక‌లో ముర‌ళీ, వేణు త‌దిత‌రులు పాల్గొన్నారు.

భానుచంద‌ర్, సుమ‌న్, కృష్ణ భ‌గ‌వాన్, పోసాని, అలీ, చిట్టిబాబు త‌దితరులు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి పాట‌లు: వెన్నెల కంటి, చిర్రావూరి విజ‌య్ కుమార్, రాంభ‌ట్ల న‌ర‌సింహ శ‌ర్మ‌, భాషా శ్రీ, కెమెరా: క‌ళ్యాష్ స‌మీ, ఎడిటింగ్: ఎం.ఆర్ . వ‌ర్మ‌, డ్యాన్స్: ర‌మ‌ణ‌, ప్రేమ్-గోపీ, బాలు


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved