22 June 2017
Hyderabad
సీనియర్ రచయిత, `మా` (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) కోశాధికారి పరుచూరి వెంకటేశ్వరరావు పుట్టిన రోజు వేడుకలు బుధవారం సాయంత్రం`మా` టీమ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయనకు `మా` టీమ్ శుభాకాంక్షలు తెలియజేసింది. అనంతరం ఆయన్ను శాలువా కప్పి సన్మానించారు.
ఈ వేడుకల్లో మా అధ్యక్షులు శివాజీ రాజా, వైస్ ప్రెసిడెంట్ బెనర్జీ, జాయింట్ సెక్రటరీ ఏడిద శ్రీరామ్, కల్చరల్ కమిటీ చైర్మన్ సురేష్ కొండేటి, సీనియర్ నటులు చలపతిరావు, జయప్రకాశ్ రెడ్డి, దర్శకుడు జయంత్ సి. పరాన్జీ, నిర్మాత అశోక్ కుమార్, బండారు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.




