pizza
Vijaya Nirmala Birthday 2017 celebrations
శ్రీమ‌తి విజ‌య‌నిర్మ‌ల పుట్టిన‌రోజు వేడుక‌లు
You are at idlebrain.com > News > Functions
Follow Us

20 February 2017
Hyderaba
d

మ‌హిళా ద‌ర్శ‌కురాలు శ్రీమ‌తి విజ‌య‌నిర్మ‌ల పుట్టిన‌రోజు ఫిబ్ర‌వ‌రి 20. ఈ సంద‌ర్భంగా నాన‌క్‌రామ్ గూడ‌లోని విజ‌య‌నిర్మ‌ల స్వ‌గృహంలో ఆమె పుట్టిన‌రోజు వేడుకల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో సూప‌ర్‌స్టార్ కృష్ణ‌, `మా` అధ్య‌క్షుడు డా.రాజేంద్ర‌ప్ర‌సాద్‌, సీనియ‌ర్ న‌టి గీతాంజ‌లి, శివాజీ రాజా, సీనియ‌ర్ న‌రేష్‌, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు, హీరో విజ‌య్‌కృష్ణ‌, నిర్మాత‌, సూప‌ర్‌హిట్ ప‌త్రికాధినేత బి.ఎ.రాజు, సంతోషం సురేష్ కొండేటి త‌దిత‌రులు పాల్గొన్నారు. అభిమానుల స‌మ‌క్షంలో విజ‌య‌నిర్మ‌ల కేక్ క‌ట్ చేశారు. అనంత‌రం...

సూప‌ర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ - ``విజ‌య‌నిర్మ‌ల‌గారికి ఇంత మంది అభిమానులు వ‌చ్చి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు అందించ‌డం ఆనందంగా ఉంది. అందరికీ థాంక్స్‌`` అన్నారు.

శ్రీమ‌తి విజ‌య‌నిర్మ‌ల మాట్లాడుతూ - ``నేను సాధార‌ణంగా పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను సెల్ర‌బేట్ చేసుకోవ‌డానికి ఆస‌క్తి చూప‌ను. కానీ అభిమానులు త‌మంత‌ట తాముగా నా పుట్టిన‌రో్జు వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తుంటారు. ఖాద‌ర్ గోరి, రాంబాబులు ముందుండి ఈ వేడుక‌ను నిర్వ‌హించారు`` అన్నారు.

సీనియ‌ర్ న‌రేష్ మాట్లాడుతూ - ``హీరోయిన్‌గా 200 సినిమాల‌కు పైగా న‌టించిన త‌ర్వాత‌, ద‌ర్శ‌కురాలిగా గిన్నిస్‌బుక్ రికార్డ్ సాధించిన త‌ర్వాత, ఇన్ని సంవ‌త్స‌రాలైన అదే ఉత్సాహంతో సూప‌ర్‌స్టార్ కృష్ణ‌, అమ్మ విజ‌య‌నిర్మ‌ల‌గారి పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను జ‌రుపుకోవ‌డం ఆనందంగా ఉంది`` అన్నారు.

ఈ కార్య‌క్క‌మంలో అభిమానులంద‌రూ పాల్గొన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved