17 September 2016
Hyderabad
నవీన్, నిత్య, శ్రావ్య నటీనటులుగా ఎస్.వి.సి.ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి.బ్యానర్‌పై పి.వి.గిరి దర్శకత్వంలో రాధాకిషోర్.జి, బిక్షమయ్య సంగం నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'నందిని నర్సింగ్ హోం'. శనివారం ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల కార్యక్రమం హైధరాబాద్‌లో జరిగింది. సూపర్‌స్టార్ కృష్ణ, విజయ నిర్మల ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో....
సూపర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ - ''నవీన్ నాలుగు సంవత్సరాలు పాటు ట్రయినింగ్ తీసుకున్నాడు. మా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న ధర్డ్ జనరేషన్ హీరో తను. ఈ సినిమా తన కెరీర్‌కు బాగా హెల్ప్ అవుతుందనుకుంటున్నాను. ఈ నెల 27న ఆడియో జరుగుతుంది. మహేష్ ముఖ్య అతిథిగా హాజరవుతారు'' అన్నారు.
శ్రీమతి విజయనిర్మల మాట్లాడుతూ - ''నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మిస్తున్నారు. నవీన్‌కు ఈ సినిమా పెద్ద విజయాన్ని తెచ్చి పెడుతుంది'' అన్నారు.
Glam gallery from the event |
|
|
|
సీనియర్ నరేష్ మాట్లాడుతూ - ''నిర్మాతలు చేసిన తొలి చిత్రం. హండ్రెడ్ పర్సెంట్ వినోదంతో కూడుకున్న సినిమా. నవీన్ సత్యానంద్ మాస్టర్‌గారి దగ్గర ట్రయినింగ్ తీసుకున్నారు. మీ ఫ్యామిలీ నుండి మరో మంచి హీరోగా నవీన్ పేరు తెచ్చుకుంటాడని భావిస్తున్నాను. ఈ ఏడాది వచ్చే చిత్రాల్లో ఈ సినిమా హిట్ సినిమాగా నిలుస్తుంది'' అన్నారు.
హీరో నవీన్ మాట్లాడుతూ - ''దర్శకుడు పి.వి.గిరిగారు మంచి కథను అందించారు. సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మంచి ఎంటర్‌టైనింగ్ మూవీగా నాకు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది'' అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ''సినిమా చాలా బాగా వచ్చింది. హీరో హీరోయిన్స్ చక్కగా యాక్ట్ చేశారు. నవీన్‌కు మంచి పేరు తెచ్చే చిత్రమవుతుంది. దిల్‌రాజుగారు సినిమా చూసి బావుందని అన్నారు. మహేష్ అతిథిగా ఆడియో ఫంక్షన్‌ను నిర్వహిస్తున్నాం'' అన్నారు.
చిత్ర దర్శకుడు పి.వి.గిరి మాట్లాడుతూ - ''నవీన్‌కు మంచి పేరు తెచ్చే చిత్రమవుతుంది. కృష్ణ, విజయనిర్మలగారి చేతుల మీదుగా ఫస్ట్‌లుక్ విడుదల కావడం ఆనందంగా ఉంది'' అన్నారు.
నవీన్, నిత్య, శ్రావ్య, షకలక శంకర్, సప్తగిరి, వెన్నెలకిషోర్, జయప్రకాష్, జయప్రకాష్ రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అచ్చు, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర, పాటలు: రెహమాన్, మాటలు: పి.వి.గిరి, సురేష్ ఆరపాటి, కొరియోగ్రఫీ: విజయ్, నిర్మాతలు: రాధాకిషోర్.జి, బిక్షమయ్య సంగం, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పి.వి.గిరి.